భిన్నమైన పిచ్‌పై జయసూర్య

By Pratap

Jayasuriya on a different pitch
శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య భిన్నమైన రంగంలో తన ప్రతిభను ప్రదర్శించబోతున్నారు. ఆయన ఝలక్ దిఖ్లా జా అనే డ్యాన్స్ రియాల్టీ షోలో పాల్గొంటున్నారు. జూన్ 16వ తేదీన ఇది కలర్స్ టీవీలో వస్తుంది. శని, ఆదివారాల్లో ఈ రియాల్టీ షో ప్రసారమవుతుంది.

డ్యాన్స్‌లో పెద్దగా ప్రవేశం లేకపోవడంతో జయసూర్య గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇది తనకెంతో కష్టమని, అయితే తనకు వచ్చిన పద్ధతిలో తాను డ్యాన్స్ చేస్తానని, తన పోటీదారులు ప్రొఫెషనల్స్ అని, మంచి డ్యాన్సర్‌గా తనను మార్చడానికి కోరియాగ్రాఫర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని జయసూర్య అన్నారు.

క్రికెటర్‌గా తాను భిన్నమైంది కూడా చేయాలనే తాను రియాల్టీ షోలో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. నిజ జీవితంలో తాను ఏ రోజు కూడా డ్యాన్స్ చేయలేదని, కొన్ని పార్టీల్లో మాత్రం కాళ్లూ ఊపడం చేశానని, తన జీవితమంతా క్రికెట్ ఆడానని, షోలో సాధ్యమైనంత ఉత్తమ ప్రదర్శన కనబరుస్తానని, అదే సమయంలో తన దేశ సంస్కృతికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని ఆయన చెప్పారు. తాను దీన్ని సవాల్‌గా తీసుకుంటున్నట్లు జయసూర్య తెలిపారు.

జయసూర్య రజనీకాంత్ ఫ్యాన్. బాలీవుడ్ ఖాన్‌ల గురించి తనకు తెలుసునని చెప్పారు. రియాల్టీ షో జడ్జి, నటి మాధురీ దీక్షిత్ గురించి కూడా ఆయన మాట్లాడారు. మాధురీ దీక్షిత్ పెద్ద నటి అని విన్నానని, ఆమె ముందు నాట్యం చేస్తున్నందుకు ఆనందంగా ఉందని ఆయన అన్నారు. షో ప్రారంభ కార్యక్రమంలో జయసూర్య మిత్రుడు హర్భజన్ సింగ్ పాల్గొంటారని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X