Bullet Bhasker: "సుడిగాలి సుధీర్ హీరోగా వేస్ట్.. మ్యాజిక్ షోలు చేసుకోవడం బెటర్"
జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన స్కిట్లు చేస్తూ.. అందరినీ కడుపుబ్బా నవ్వించే ఈయన ఈసారి మాత్రం.. ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో చాలా ఎక్స్ ట్రాలు చేశారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ పై సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఆయన సినిమాలను కించ పరుస్తూ మాట్లాడారు. ఈయన చేసిన అన్ని సినిమాలపై ఎవరూ ఊహించని స్థాయిలో సెటైర్లు వేశారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కమెడియన్ స్థాయి నుంచి టీం లీడర్ గా ఎదిగి.. ఎన్నో ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను నవ్విస్తూ తెగ సందడి చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్. అలాగే ఆయనతో పాటే ఎదిగిన సుడిగాలి సుధీర్ గురించి కూడా అందరికీ తెలిసిందే. మ్యుజీషియన్ గా కెరియర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత కమెడియన్.. టీం లీడర్ గా, యాంకర్ గా, డ్యాన్సర్ గా.. ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్నారు. అయితే తాజాగా వచ్చిన జబర్దస్త్ షోలో బుల్లెట్ భాస్కర్.. సుడిగాలి సుధీర్ పై స్కిట్ చేశాడు. గతంలో ఇలా చాలా సార్లే చేసినా.. తొలిసారి బుల్లెట్ భాస్కర్ హద్దు దాటి ప్రవర్తించారు.

ముఖ్యంగా సుడిగాలి సుధీర్ గురించి వివరిస్తూ... నవ్వించే ప్రయత్నం చేశారు. ముందుగా.. ఒకతను సుడిగాలి సుధీర్ ఫోన్ చేస్తున్నారు సార్ అంటూ ఆయన వద్దకు రాగా.. వాడికి చిలక్కి చెప్పినట్లు చెప్పాను.. ఫిబ్రవరి, మార్చిలో పెళ్లిళ్ల సీజన్ రా.. చక్కగా మ్యాజిక్ షోలు చేసుకోరా.. ఈవెంట్ కు 5 వేలు వస్తాయని.. అంటూ ఫన్ చేశాడు. ఆ తర్వాత అరే రష్మి ఓ పావుకిలో దానా కొనుక్కోరా... ఇద్దరూ కలిసి పావురాలకు వేసుకుంటూ షోలు చేసుకోవచ్చు అంటూ సెటైర్లు వేశాడు. ఇక్కడి వరకు కాస్త బాగానే ఉన్నా ఆ తర్వాత రెచ్చిపోయారు.
ఆయన ఫ్యాన్స్ హర్ట్ అవుతారంటూ... అటిస్టెంట్ చెప్పగా.. ఒరేయ్.. ఎవర్రా మీరంతా నాలుగైదు మెయిల్ ఐడీలు పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తారేంట్రా అంటూ అడిగాడు. షకీలా సినిమా కింద మీకేంట్రా పని... ఐ వాంట్ సుధీర్ అంటూ కామెంట్లు ఏంట్రా అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత శుభమస్తు ప్రోగ్రాం కింద కూడా ఇవే కామెంట్లు.. ఆ ప్రోగాంకు వాడికి ఏంట్రా సంబంధం అంటూ అడిగారు. మేము వాడిని పొమ్మనలేదురా వాడు పోయాడు.. అది వాడి కర్మ అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఇక ఆ తర్వాత మీరలాగే అంటారు కానీ ఆయన సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి అంటూ అసిస్టెంట్ అనగా.. కాలింగ్ సహస్ర.. కాలింగ్ బెల్ కొట్టినంత సేపు లేదు అది అంటూ చెప్పాడు. ఆ తర్వాత 3 మంకీస్ అనగానే.. చెడు మాట్లాడకు, చెడు చూడకు, చెడు వినకు అని క్యాప్షన్ పెట్టారు. ఆ సినిమా విడుదల అయిన తర్వాత దాని గురించి ఎవరూ మాట్లాడలేదంటూ తెలిపారు. అలాగే గాలోడు అనగానే.. ఫ్యాన్ వేసి గాలొచ్చే లోపే థియేటర్లలోంచి వెళ్లిపోయింది అన్నారు. సాఫ్ట్ వేర్ సుధీర్ ఎంత బాగుంటది సార్ అనగానే.. సాఫ్ట్ వేర్ కంపెనీలో ఊడ్చే వాళ్లు కూడా ఆ సినిమా చూడలేదని చెబుతాడు.

ఇలా సుడిగాలి సుధీర్ చేసిన సినిమాలపై విపరీతమైన కామెంట్లు చేయగా... ఆయన ఫ్యాన్స్ అంతా ఫుల్ ఫైర్ అవుతున్నారు. అతడి వరకు కామెంట్లు ఓకే కానీ.. సినిమాలపై చేయడం బాగాలేదంటూ చెప్పుకొస్తున్నారు. ఫన్ ఫన్ లాగే ఉండాలి కానీ ఇంకొకరిని హర్ట్ చేసే లాగా ఉండకూదంటూ చెప్పుకొస్తున్నారు.


Click it and Unblock the Notifications











