విష్ణుప్రియతో రెండో పెళ్లి? యాంకర్‌తో రిలేషన్‌పై హీరో స్ట్రాంగ్ రియాక్షన్

యాంకర్ విష్ణుప్రియ ఇటీవల వార్తల్లో ఎక్కువగా కనిపిస్తున్న, వినిపిస్తున్న పేరు. బెట్టింగ్ స్కామ్‌లో ఇరుక్కున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో మరిన్ని వివాదాలను కోరి తెచ్చుకుంది. ఎక్స్‌క్లూజిక్ కంటెంట్ పేరుతో అసభ్య ఫోటోలు, వీడియోలను అప్‌లోడ్ చేస్తోందని విష్ణుప్రియపై ఫిర్యాదులు రావడంతో ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఇక పెళ్లయిన ఓ సీనియర్ నటుడితో విష్ణుప్రియ క్లోజ్‌గా ఉంటోందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని గాసిప్స్ రావడం కలకలం రేపింది. తాజాగా దీనిపై సదరు నటుడు స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చారు జేడీ చక్రవర్తి. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, డైరెక్టర్‌గా ఆయన చెరగని ముద్ర వేశారు. 90లలో తన నవ్వుతో అమ్మాయిలకు ఫేవరేట్ హీరోగా నిలిచి, లవర్ బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ క్లాసిక్ సినిమాలలో ఒకటైన శివ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన జేడీ చక్రవర్తి అంచెలంచెలుగా ఎదిగారు. ప్రేమ కథలతో పాటు మాఫియా, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. మనీ, రక్షణ, వన్ బై టూ, అనగనగా ఒక రోజు, గులబీ, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, సత్య, ప్రేమకు వేళాయెరా తదితర చిత్రాలతో దూసుకొచ్చారు. దర్శకుడిగా హోమం, సిద్ధం వంటి చిత్రాలతో సత్తా నిరూపించుకున్నారు.

JD Chakravarthy Clarifies Relationship Rumors with Anchor Vishnu Priya Amid Controversies

ఓటీటీల రాకతో జేడీ చక్రవర్తి వంటి వారికి మంచి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఆయన కొన్ని వెబ్ సిరీస్‌లతో పాటు సినిమాలలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా జేడీ చక్రవర్తి నటించిన మూవీ గాయపడ్డ సింహం. తరుణ్ భాస్కర్ హీరోగా ఫరియా అబ్ధుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జేడీ చక్రవర్తి కీలకపాత్ర పోషిస్తున్నారు. పవన్ సాధినేని సమర్పణలో కళ్యాణ్ చక్రవర్తి మంథని, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు. కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యాంకర్ విష్ణుప్రియతో రిలేషన్‌, రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వస్తున్న రూమర్స్‌పై యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు జేడీ చక్రవర్తి. రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రావడం నేను కూడా విన్నానని అన్నారు జేడీ. అలాగే టాప్ యాంకర్‌ విష్ణుప్రియని మీరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయని యాంకర్ అడగ్గా.. నాకు తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తా. విష్ణుప్రియ గురించి నేను ఒక విషయం చెబుతా. నేను నటుడిగానే కాకుండా నాకు మరో కోణం ఉంది. అదే ఫిలాసఫి. విష్ణుప్రియ నా ప్రియ శిష్యురాలు. విష్ణుప్రియకు నేను ఫోన్ చేస్తే గురువుగారు అనే మాట్లాడుతుంది. అసలు ఆ అమ్మాయికి నాకు అఫైర్ ఉందని అనుకోవడం అన్నంత దుర్మార్గం ఇంకోకటి లేదు. ఆమె నా శిష్యురాలు... పైగా పెళ్లి చేసుకోవడమా? ఆ అమ్మాయి నన్ను గురువుగా భావిస్తోంది. ఇలాంటి వార్తలు పచ్చి అబద్ధమని జేడీ చక్రవర్తి పేర్కొన్నారు.

ఇండస్ట్రీలో హీరోయిన్లు, దర్శకులు పెళ్లిళ్లు చేసుకున్నారు... చాలామంది డైరెక్టర్లనీ హీరోయిన్లు మా గురువు అని చెబుతుంటారని యాంకర్ అడగ్గా.. గురువు అంటే విద్య నేర్పించేవాడు, గురువు అంటే విద్యను బోధించినవాడు. సినిమా ఇండస్ట్రీలో కాళ్లకు మొక్కడం అనే అలవాటు ఉంది. నేను మాత్రం పెట్టేవాడిని కాదు. అప్పుడు అందరికీ పెట్టాలి కదా? లైట్‌మెన్‌కి ఎందుకు పెట్టవు, కెమెరామెన్‌కి ఎందుకు పెట్టవు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే డ్యాన్స్ మాస్టర్‌ దగ్గరికి వెళ్లినప్పుడు దండం పెడతాం. అది న్యాయం. అదే డ్యాన్స్ మాస్టర్స్ సినిమా ఇండస్ట్రీలో డ్యాన్స్ కంపోజ్ చేస్తూ వచ్చారు కాబట్టి.. అప్పుడు గురువుగారు అని గురుభక్తితో దండం పెట్టేవాళ్లం. అలాగే ఇప్పుడొచ్చిన వాళ్లకి కూడా దండాలు పెడుతున్నారు. ఇది తప్పని నేను చెప్పడం లేదు.. ఎవరిష్టం వాళ్లది అని జేడీ చక్రవర్తి తేల్చేశారు.

ఇక ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో విష్ణుప్రియ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ గురించి యాంకర్ ప్రశ్నించగా.. తను నాకు ఫిలాసఫికల్ సైడ్‌లో శిష్యురాలు. తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌తో నాకు ఏ సంబంధం లేదు. తన ఇష్టం తనది.. తను నాతో డిస్కష్ చేసేది ఫిలాసఫి. విపరీతమైన దైవభక్తి, విపరీతమైన జ్ఞానం ఆ అమ్మాయిలో ఉన్నాయి. ఫిలాసఫి వేరు, దేవుడు వేరు. ఫిలాసఫికి సంబంధించిన విషయాలకే తను నాకు ఫోన్ చేసి కన్సల్ట్ అవుతుంది. దాని మీద మాత్రమే మేమిద్దరం మాట్లాడుకుంటాం. నేను విష్ణుప్రియని కలిసి దాదాపు మూడేళ్లు అవుతోంది అని జేడీ చక్రవర్తి తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: jd chakravarthy vishnu priya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X