twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ రోజు నాగార్జున కాలర్ పట్టుకోవడం వెనక అసలు కారణం చెప్పిన జేడీ చక్రవర్తి!

    |

    Recommended Video

    JD Chakravarthy Recalls Shiva Movie Scene With Nagarjuna Akkineni || Filmibeat Telugu

    'అలీతో సరదాగా' కార్యక్రమానికి సంబంధించి జేడీ చక్రవర్తి ప్రోమో వారం రోజులుగా యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. 'నాగార్జున తనను కొడితే కాలర్ పట్టుకున్నానని... మా మధ్య గొడవ జరుగుతుండటంతో అన్నపూర్ణ స్టూడియోకు చెందిన డ్రైవర్లు రాడ్లు పట్టుకుని నా తల బద్దలు కొట్టడానికి వచ్చారు' అని ఆ ప్రోమోలో జేడీ చెప్పడం మరింత ఆసక్తిగా మారింది.

    సోమవారం 'అలీతో సరదాగా' పూర్తి ఎపిసోడ్ ప్రసారమైంది. ఆ రోజు నాగార్జున తనను ఎందుకు కొట్టారు? తాను తిరిగి ఆయన కాలర్ పట్టుకున్న తర్వాత అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలు వివరించారు.

    అందంతా ‘శివ’ మూవీ షూటింగులో భాగమే

    అందంతా ‘శివ’ మూవీ షూటింగులో భాగమే

    తొలిసారి శివ చిత్రంలో నాగార్జునగారితో ఇరానీ కేఫ్‌లో ఫైట్ సీన్ చేసే అవకాశం వచ్చింది. ఈ సీన్ చిత్రీకరణ పటాన్ చెరువులో జరుగుతోంది. జనం బాగా గుమిగూడటం వల్ల షూటింగ్ జరుపలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎవరికీ తెలియకుండా షూటింగ్ చేయాలని రామ్ గోపాల్ వర్మ డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే మేము గొడవపడ్డామని జేడీ తెలిపారు.

    నాగార్జునే నన్ను కొట్టారు

    నాగార్జునే నన్ను కొట్టారు

    మధ్నాహ్నం 2 గంటల ప్రాంతంలో నాగార్జున లంచ్ చేసి వస్తున్నారు. నేను ఇరానీ కేఫ్‌లో నుంచి బయటకు వెళుతున్నాను. అనుకోకుండా నా భుజం ఆయనకు తగిలింది. దీంతో ఆయన ఏయ్ ఎటు చూసి నడుస్తున్నావ్? అన్నారు. ఏమిటీ.. తగిలిన వెంటనే సారీ చెప్పాలని తెలియదా? మర్యాదగా మాట్లాడు.. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్ అంటూ నాపై ఫైర్ అయ్యారు. నేను రియాక్ట్ అవుతూ సార్ మీరు మర్యాదగా మాట్లాడండి అన్నాను. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావ్ అంటూ లాగి పడేల్‌మని కొట్టాడు... అంటూ జేడీ గుర్తు చేసుకున్నారు.

    అన్నపూర్ణ స్టూడియో డ్రైవర్లు రాడ్లు పట్టుకుని వచ్చారు

    అన్నపూర్ణ స్టూడియో డ్రైవర్లు రాడ్లు పట్టుకుని వచ్చారు

    నన్ను కొట్టడంతో కిందపడిపోయాను. లేచి ఆయన కాలర్ పట్టుకున్నాను. నాకు ఆయనకు పరిచయం కూడా లేదు. ఆయన నా కాలర్, నేను ఆయన కాలర్ పట్టుకున్నాం. ఇది జరుగుతుండగా అన్నపూర్ణ స్టూడియోకు చెందిన డ్రైవర్లు నా తల పగలగొట్టేందుకు రాడ్లు తీసుకుని వచ్చారు. వెంటనే నాగార్జున నన్ను గట్టిగా వాటేసుకుని... వాళ్లందరినీ వెనక్కి వెళ్లండి అని చెప్పారు.

    రియలిస్టిక్‍‌గా ఉండాలనే రామ్ గోపాల్ వర్మ ఇలా ప్లాన్ చేశారు

    రియలిస్టిక్‍‌గా ఉండాలనే రామ్ గోపాల్ వర్మ ఇలా ప్లాన్ చేశారు

    అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. అసలు విషయం ఏమిటంటే జనాభా రావడం వల్ల అక్కడ మేము షూటింగ్ చేయలేకపోయాం. రామూ గారు దీన్ని రియలిస్టిక్‌గా తీయాలని ప్లాన్ చేశారు. 11.30 గంటలకు షూటింగ్ ఆపేసి కెమెరాలు రెండు పైన పెట్టేసి మీరు ఏం చేస్తారో తెలియదు. ఇద్దరూ ఫైట్ స్టార్ట్ చేయాలి, అందరూ నమ్మాలి. రియల్ ఫైట్ అనుకోవాలని చెప్పారు. షూటింగ్ జరుగుతుందనే విషయం అక్కడున్న నలుగురు ఐదుగురికి తప్ప ఎవరికీ తెలియదు. అలా నాగార్జున గారితో నా ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ జరిగిందని.... జేడీ తెలిపారు.

    English summary
    JD Chakravarthy recalls Shiva movie scene with Nagarjuna Akkineni. Shiva is a 1990 Indian action film written and directed by Ram Gopal Varma. The film has Nagarjuna and Amala in lead roles. The film became a blockbuster.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X