twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో అంటే పరువు పోతుందనుకున్నానన్న రాజశేఖర్‌.. కన్నీళ్ళు పెట్టుకున్న జీవిత!

    |

    హీరో రాజశేఖర్ ఆ మధ్య కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చాలా రోజుల పాటు హాస్పిటల్ లోనే బెడ్ మీద ఉన్నారు. అప్పుడు ఆయన కండిషన్ చాలా సీరియస్ అయింది. కానీ కోలుకున్న తర్వాత ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న జీవిత రాజశేఖర్ దంపతులు ఈ విషయం మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

    Recommended Video

    Rajasekhar Resigns As MAA Vice President, Gets Emotional
    2020లో అర్జున అనే సినిమాతో

    2020లో అర్జున అనే సినిమాతో


    తన సహ నటి జీవితను ప్రేమించి వివాహం చేసుకున్న ఆయన ప్రస్తుతానికైతే సినిమాల విషయంలో కొంత వెనుకబడ్డారనే చెప్పాలి. చివరిగా 2017లో పిఎస్వి గరుడ వేగ సినిమాతో హిట్ అందుకున్న ఆయన 2019 లో కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మంచి అంచనాలతో విడుదలైంది కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే 2020లో అర్జున అనే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

     శేఖర్ సినిమాతో

    శేఖర్ సినిమాతో

    అయితే కానీ అది అవుట్ డేటెడ్ సినిమా కావడంతో ప్రేక్షకులు దానిని ఆదరించలేదు. ఆయన నటించిన శేఖర్ అనే సినిమా విడుదలకు సిద్ధమైంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన "జోసఫ్" అనే సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు కానీ మధ్యలో వదిలేయడంతో జీవిత రాజశేఖర్ సినిమా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. ఇది కాక రాజశేఖర్ కిరణ్ అనే దర్శకుడు దర్శకత్వంలో 92వ సినిమా చేస్తున్నారు. ఇందులో ఆయనకు పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

    ఆలీతో సరదాగా షోకి

    ఆలీతో సరదాగా షోకి

    ఇక జీవిత, రాజశేఖర్ ఇద్దరూ కూడా ఆలీతో సరదాగా షోకి గెస్ట్ గా వచ్చారు. సంక్రాంతి స్పెషల్‌గా ప్రసారం చేయబోతోన్న ఈ షో ప్రోమోను విడుదల చేశారు. అందులో రాజశేఖర్, జీవిత రాజశేఖర్ అనేక విషయాలను పంచుకున్నారు. రాజశేఖర్ డాక్టర్ చదివే సమయంలో, ఎగ్జామ్స్ రాసేటప్పుడు హీరో అవ్వాలని అనిపించేందట, కానీ తనకు నత్తి ఉండటం, ఏ దర్శకుడో, నిర్మాత దగ్గరికో వెళ్తే నీకు నత్తి ఉంది, అవకాశం ఇవ్వను పో అంటే మళ్లీ పరువు పోతుందని అనుకునేవాడిని అని పేర్కొన్నారు.

    హీరోగానే కాకుండా విలన్ గా

    హీరోగానే కాకుండా విలన్ గా

    సీనియర్ హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తమిళ సినిమాల్లో నటించడం మొదలు పెట్టిన ఆయన తెలుగులో హీరోగా సెటిల్ అయ్యారు. కేవలం హీరోగానే కాకుండా విలన్ గా కూడా ఎన్నో సినిమాల్లో రాజ శేఖర్ నటించారంటే ఆయన క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. పోలీస్ పాత్రలకు పెట్టింది పేరైన రాజశేఖర్ అంకుశం సినిమాతో తిరుగులేని స్టార్డమ్ తెచ్చుకున్నాడు.

    నెల రోజులు ఐసీయూలో

    నెల రోజులు ఐసీయూలో


    ఇక శేఖర్ సినిమాకు జీవిత దర్శకత్వం వహించిన క్రమంలో ఈ సినిమాకి ఎందుకు దర్శకత్వం వహించాల్సి వచ్చింది అనే విషయాన్ని జీవిత చెప్పుకొచ్చింది. శేఖర్ సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది అనుకుంటున్న వారం ముందే రాజశేఖర్ కరోనా బారిన పడ్డారు అంటూ జీవిత ఎమోషనల్ అయింది. నెల రోజుల పాటు ఆయన ఐసీయూలో ఉన్నారు.. అప్పుడు మా పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే అని జీవిత కంట తడి కూడా పెట్టుకుంది.

    మంట పెట్టేస్తారు

    మంట పెట్టేస్తారు

    ఇక నాకు సీరియస్ అయి మనం చచ్చిపోతాం.. రేపు ఎల్లుండి మనల్ని మంట పెట్టేస్తారు(చితిలో కాల్చేస్తారు) అని అనుకున్నా అప్పటికి నా మైండ్‌ అలా ఉంది' అని రాజశేఖర్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఇక రాజశేఖర్‌ తనని కుట్టి అని ముద్దుగా పిలుస్తారని ఈ సందర్భంగా జీవిత వెల్లడించారు. 'మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా విభేదాలు వచ్చాయా' అని ఆలీ అడిగిన ప్రశ్నకు, 'ఎలాంటి భార్య లభిస్తుందన్నది దేవుడిచ్చిన వరం' అంటూ రాజశేఖర్‌ సమాధానం ఇచ్చారు.

    English summary
    Jeevitha rajasekhar sankranthi special ali tho saradaga promo released
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X