CBSE పరీక్షల్లో దుమ్మురేపిన టీవీ నటి.. 90%తో సత్తా చాటిన ఝాన్సీ కి రాణి
వినోద పరిశ్రమలోకి చిన్నతనంలో ప్రవేశించి తన నటనా ప్రతిభతో అందర్ని విశేషంగా ఆకట్టుకొంటున్న టీవీ నటి అనుష్క సేన్ మరోసారి తన టాలెంట్‌తో సినీ, బుల్లితెర అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. నటనలోనే కాదు.. చదువుల్లోనే టాప్ అనే విధంగా వార్తల్లో నిలిచారు. ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలను సొంతం చేసుకొని అందరి ప్రశంసలు అందుకొంటున్నారు. బాలతారగా ప్రవేశించి స్టార్ స్టేటస్‌తో దూసుకెళ్తున్న అనుష్క సేన్ గురించి మరింత వివరంగా..

బాలతారగా అనుష్క సేన్
టెలివిజన్ రంగంలోకి అనుష్క సేన్ తన 9 ఏటనే బాలతారగా ప్రవేశించారు. యాహా మే ఘర్ ఘర్ ఖేలీతో తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. బల్ వీర్, ఇంటర్నెట్ వాలా లవ్, ఝాన్సీకి రాణి, దేవోంఖే దేవ్, మహాదేవ్ లాంటి సీరియల్స్‌లో సత్తా చాటారు. అలాగే కక్కడ్ ఫ్యామిలీ లాంటి బాలీవుడ్ సినిమాతోపాటు పలు టీవీ వ్యాపార ప్రకటనల్లో, మ్యూజిక్ వీడియోల్లో నటించి మెప్పించారు.

యాక్టింగ్, చదువుల్లోనూ టాప్
అటు యాక్టింగ్ రంగంలో బ్రహ్మండంగా రాణిస్తూనే మరోవైపు చదువుల్లోనూ టాప్ ర్యాంకులను సొంతం చేసుకొంటున్నారు. ఇటీవల సీబీఎస్‌ఈ బోర్డు విడుదల చేసిన 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో సత్తా చాటింది. తనకు సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్‌లో 89.4 శాతం మార్కులు వచ్చాయి అని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది.

సీబీఎస్ఈ పరీక్షల్లో 89.4 శాతం మార్కులు
సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించడంపై అనుష్క సేన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తనకు ప్రేరణగా నిలిచి మానసిక స్థైర్యాన్ని కలిగించిన టీచర్లు, ప్రిన్స్‌పాల్‌కు థ్యాంక్స్ చెప్పారు. నాకు వచ్చిన మార్కులతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు 89.4 శాతం మార్కులు వచ్చాయి. నిజాయితీగా చెప్పాలంటే నేను ఊహించిన దానికంటే చాలా తక్కువే. ఎందుకంటే నను ఝాన్సీ కి రాణి, మ్యూజిక్ వీడియో షూటింగుల్లో బిజీగా ఉండటమే అందుకు కారణం అని చెప్పారు.
Recommended Video

టీచర్లు, ప్రిన్సిపాల్, ఫ్యామిలీ సపోర్ట్‌తోనే
సీబీఎస్ఈ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చాటడానికి నా కుటుంబం, ఝాన్సీ కీ రాణి యూనిట్ ఎంతో సహకరించారు. అలాగే కీలకసమయంలో నాకు నన్ను గైడ్ చేసిన స్కూల్ యాజమాన్యం, టీజర్లు, ముఖ్యంగా ప్రిన్స్‌పాల్ మేడమ్ అందించిన ప్రోత్సాహం గురించి మాటల్లో చెప్పలేను. ఇదే ఉత్సాహంతో కాలేజీ విద్యను అభ్యసించేందుకు సిద్ధమవుతున్నాను అని అనుష్క సేన్ చెప్పారు.


Click it and Unblock the Notifications











