For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షూటింగ్స్ లేక డిప్రెషన్ లోకి టీవీ నటుడు.. ఫేస్ బుక్ లైవ్ పెట్టి మరీ సూసైడ్ అటెంప్ట్.. చివరికి!

  |

  కరోనా వైరస్ అనేక మంది జీవితాలను అల్లకల్లోలం చేస్తోంది. ఇప్పటికే ఈ కరోనా బారిన పడి అనేక మంది ప్రాణాలు కోల్పోగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా కరోనా లాక్ డౌన్ వలన షూటింగ్స్ లేక నిరాశలో కూరుకుపోయిన ఒక టీవీ నటుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతేకాక ఆత్మహత్యాయత్నాన్ని ఫేస్బుక్ లో లైవ్ కూడా పెట్టడానికి ప్రయత్నించాడు. ఆ వివరాల్లోకి వెళితే

  లాక్ డౌన్ కారణంగా

  లాక్ డౌన్ కారణంగా

  దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది.. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ ఉధృతి ఎక్కువగా కనిపిస్తూ ఉండటంతో పాటు ప్రతి రోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పుడు కొంచెం పరిస్థితి కుదుట పడుతుంది కానీ నిన్న మొన్నటి వరకు రెండు లక్షలకు తక్కువ కాకుండా కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదు కారణంగా దాదాపు భారతదేశం మొత్తం లాక్డౌన్ లోకి వెళ్ళిపోయింది. లాక్ డౌన్ కారణంగా మళ్లీ అనేకమంది పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  31 ఏళ్ల నటుడు సూసైడ్ అటెంప్ట్

  31 ఏళ్ల నటుడు సూసైడ్ అటెంప్ట్

  మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది కార్మికులు, చిన్న నటులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అలా ఇబ్బంది పడుతూ ఒక బెంగాలీ టెలివిజన్ నటుడు తాను ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని భావించాడు. అయితే ఆయన చేసిన ఒక పని మళ్ళీ ఆయన ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడింది. ప్రస్తుతానికి కరోనా లాక్డౌన్ కారణంగా ఎలాంటి షూటింగ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న 31 ఏళ్ల నటుడు ఫేస్బుక్ లైవ్ నిర్వహిస్తూనే స్లీపింగ్ పిల్స్ మింగేశాడు.

  ఫేస్ బుక్ లైవ్ లో

  ఫేస్ బుక్ లైవ్ లో

  అయితే అతని లైవ్ ఫాలో అవుతున్న ఒక వ్యక్తి ఆ లింక్ ని పోలీసులకు చేరవేయడంతో వెంటనే రంగంలోకి పోలీసులు దిగారు. వెంటనే ఫేస్బుక్ సంస్థను సంప్రదించి సదరు వ్యక్తి ఎక్కడి నుంచి ఈ లైవ్ నడుపుతున్నాడు అనే విషయాన్ని తెలుసుకున్నారు. లైవ్ జరుగుతున్న సమయంలో పోలీసులు ఆ వ్యక్తి ఎక్కడి నుంచి లైవ్లో మాట్లాడుతున్నాడో అక్కడికి వెళ్లి గారు. అయితే ఈ ఘటన జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి తన రూమ్ లో ఉన్నాడని బయట ఉన్న అతని అమ్మకు, సోదరికి కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలియదని పోలీసులు గుర్తించారు.

  'నేను నిష్క్రమిస్తా'

  'నేను నిష్క్రమిస్తా'

  10 నిమిషాల పాటు ఈ లైవ్ కొనసాగగా దానికి 'నేను నిష్క్రమిస్తా' అని ఆయన క్యాప్షన్ పెట్టాడు. అంతేకాక ఈ సమయంలో ఆయన గిటార్ వాయిస్తూ పాటలు పాడుతూ మధ్య మధ్యలో స్లీపింగ్ పిల్స్ తీసుకుంటూ కనిపించాడు. లాక్ డౌన్ ముందు వరకు తను ఎలా సీరియల్స్ లో బిజీగా ఉండేవాడో చెబుతూ ఈ లాక్ డౌన్ జీవితాన్ని ఎలా మార్చేసిందో చెప్పుకొచ్చారు. ఈ కరోనా వలన అందరూ బాధపడుతున్నారని తన తల్లి 31 ఏళ్ల తన కొడుకు ఖాళీగా ఉంటుంన్నాడని భావిస్తూ ఉండొచ్చని అన్నారు. తాను గత ఏడాది చనిపోయిన తన తండ్రి పెన్షన్ తిని బతుకుతున్నానని కూడా లైవ్లో పేర్కొన్నారు.

  అలాంటివి నాకు ఇష్టం లేదు

  అలాంటివి నాకు ఇష్టం లేదు

  ఇక ఎవరైనా డిప్రెషన్ లో ఉన్నప్పుడు వాళ్లకు బతకాలని ఉండదని అందుకే నేను ఇదేదో షో చేయడం కోసం కాదని నిజంగానే స్లీపింగ్ పిల్స్ మింగేస్తున్నానని చెబుతూనే ఆయన ఒక్కొక్క స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం మొదలు పెట్టాడు. బిల్డింగ్ మీద నుంచి దూకటం, చేయి కోసుకోవడం లాంటివి నాకు ఇష్టం లేదని చివరికి ఈ స్లీపింగ్ పిల్స్ దొరికాయని ఇవి తీసుకుంటే ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉన్న వారికి కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాడు.

  అలా బతికిపోయాడు

  అలా బతికిపోయాడు

  తమ కుటుంబంలో చాలా మందికి ఈ కార్డియాక్ అరెస్ట్ అవడంతో తనకు కూడా అలా జరిగే అవకాశం ఉందని లైవ్లో చెప్పుకొచ్చాడు. స్లీపింగ్ పిల్స్ స్ట్రిప్ మొత్తం వేసుకున్నాను కదా ఇప్పుడు చూద్దాం నేను బతికి ఉంటే మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం అని పేర్కొన్నాడు. ఇక పోలీసుల ఎంట్రీతో సీన్ మారిపోయింది. అతనిని హాస్పిటల్ కి తరలించి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే సదరు నటుడి పేరు మాత్రం బయటకు వెల్లడి కాలేదు.

  English summary
  Bengali television actor attempted to kill himself by overdosing on sleeping pills. due to corona lock down he is at home now, and He also livestreamed the incident on facebook which helped the police to track him down and save him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X