Anchor Suma: సుమ పరువు తీసిన జోగి బ్రదర్స్.. నైట్ అంతా ఆ పనే.. అతడికి అప్పు ఉండడం వల్లేనంటూ!

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తూ.. నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతోంది ప్రముఖ హోస్ట్ సుమ కనకాల. ఏ షో చేసినా సక్సెసే అనేంతగా ఆమె తనదైన యాంకరింగ్‌తో మాయ చేస్తోంది. అప్పటికప్పుడు పంచులు వేస్తూ సెలెబ్రిటీలకే చుక్కలు చూపిస్తోంది. ఫలితంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది.

ఇక, సుమ చేస్తోన్న షోలలో 'క్యాష్'కు ప్రత్యేకమైన స్థానం ఉంది. సెలెబ్రిటీలతో సందడి చేస్తూ నడిపే ఈ షోకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. దీంతో ప్రతి వారం ఈ షో భారీ రేటింగ్‌ను అందుకుంటోంది. ఇక, ఈ షోలోకి గెస్టులుగా వచ్చిన జోగి బ్రదర్స్.. సుమ బండారాన్ని బయట పెట్టేశారు. అసలేం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరే చూడండి!

సుమ వల్లే క్యాష్ షో సక్సెస్

సుమ వల్లే క్యాష్ షో సక్సెస్


ప్రముఖ ఛానెల్‌లో చాలా కాలంగా ప్రసారం అవుతోన్న క్యాష్ షో గురించి అందరికీ తెలిసిందే. జబర్ధస్త్, ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ తర్వాత అంతటి ప్రేక్షకాదరణను అందుకుంటోన్న షో ఇది. పేరుకు గేమ్ షోనే అయినా కామెడీ ప్రధానంగా రన్ అవుతోంది. ఫలితంగా ఇది సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇక, ఈ కార్యక్రమం ఇంతగా సక్సెస్ అవడానికి దీన్ని హోస్ట్ చేస్తోన్న సుమనే కారణం అనొచ్చు.

చుక్కలు చూపిస్తోన్న సుమ

చుక్కలు చూపిస్తోన్న సుమ


తన యాంకరింగ్ ప్రయాణంలో సుమ ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలు చేసింది. వీటిలో చాలా వరకు సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అందులో 'క్యాష్' కూడా ఒకటని తెలిసిందే. బుల్లితెర, వెండితెరకు చెందిన సెలెబ్రిటీలు హాజరయ్యే ఈ షో విజయవంతంగా ప్రసారం అవుతోంది. దీనికి వచ్చిన వారికి సుమ చుక్కలు చూపిస్తూ సందడి చేస్తోంది.

వచ్చే వారం సీనియర్ల రెడీ

వచ్చే వారం సీనియర్ల రెడీ


వచ్చే శనివారం ప్రసారం కానున్న 'క్యాష్' ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో టాలీవుడ్‌కు చెందిన సీనియర్ నటులు కాదంబరి కిరణ్, రాగిణి, జోగి నాయుడు, కృష్ణంరాజు గెస్టులుగా వచ్చారు. వీళ్లతో సుమ చేసిన సందడి అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా ఇందులో కొందరిని ఈ సీనియర్ యాంకర్ తనదైన శైలి టైమింగ్‌తో ముప్పతిప్పలు పెట్టింది.

సుమకే పంచ్‌లు వేశారుగా

సుమకే పంచ్‌లు వేశారుగా


మామూలుగా చూసుకుంటే క్యాష్ షోలో వచ్చిన సెలెబ్రిటీలకు యాంకర్ సుమ కనకాల పంచ్‌లు వేస్తూ ఆట పట్టిస్తుంటుంది. ఆమె దెబ్బకు అందరూ ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. అయితే, తాజాగా విడుదలైన ప్రోమోలో సెలెబ్రిటీలే ఈ యాంకరమ్మకు చుక్కలు చూపించారు. మరీ ముఖ్యంగా జోగి బ్రదర్స్, కాదంబరి కిరణ్ కూడా ఆమెకు పంచులు వేసి అవాక్కయ్యేలా చేసేశారు.

సుమపై జోగి బ్రదర్స్ ఫన్

సుమపై జోగి బ్రదర్స్ ఫన్


క్యాష్ షోలో భాగంగా గెస్టులుగా వచ్చిన జోగి బ్రదర్స్.. యాంకర్ సుమ గురించి వివరిస్తూ ప్రత్యేకమైన స్కిట్ చేశారు. ఇందులో భాగంగానే వాళ్లిద్దరూ ఆమె ఏజ్, సంపాదన, యాంకరింగ్ గురించి తమదైన రీతిలో పంచులు పేల్చారు. కొన్ని సందర్భాల్లోనైతే సుమకే షాకిచ్చే అంశాలను కూడా ప్రస్తావించారు. దీంతో ఈ ఎపిసోడ్ మొత్తం వాళ్లిద్దరి డామినేషన్ ఉన్నట్లు అర్థం అవుతోంది.

రాత్రంతా అదే పని చేస్తూ


క్యాష్ షోలో సుమ గురించి స్పెషల్ స్కిట్ చేసిన సమయంలో జోగి బ్రదర్స్ ఆమె పరువు తీసేలా మాట్లాడారు. మరీ ముఖ్యంగా 'సుమ పంచులు అనుకోని వేస్తుందంటావా? అప్పటికప్పుడు వేసేస్తుందా' అని జోగి నాయుడు అడగ్గా.. కృష్ణంరాజు 'సుమ అస్సలు పడుకోదు. రాత్రంతా పంచులన్నీ ప్రాక్టీస్ చేసి.. పొద్దున్నే వేసేస్తది. వాటిని మనం నేర్చుకోలేం' అని బాంబ్ పేల్చాడు.

అతడికి అప్పు పడిందని

అతడికి అప్పు పడిందని


ఇక, జోగి బ్రదర్స్ యాక్టర్ సమీర్ ప్రస్తావన కూడా తీసుకు వచ్చారు. కృష్ణంరాజు ఈ స్కిట్‌లో 'అరేయ్.. సమీర్‌ ఈ క్యాష్ షోకు కాంట్రాక్టర్‌ అని తెలుసా?' అని అడిగాడు.. దీనికి జోగి నాయుడు 'ఏది మన యాక్టర్ సమీరా? అసలు ఎందుకొస్తున్నాడో తెలుసా? సుమ డబ్బులు ఇవ్వడం లేదట. ఏదో ఒకరోజు ఇస్తాదని వస్తున్నాడు' అని పంచ్ వేశాడు. దీంతో అంతా ఫక్కున నవ్వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X