ఝాన్సీతో బ్రేకప్ అలా జరిగింది.. ఒక్క ఏడాదిలోనే జీవితం నాశనం.. జోగి నాయుడు
Recommended Video
సినిమా పరిశ్రమలో గానీ.. టెలివిజన్ ఇండస్ట్రీలో గానీ జోగి బ్రదర్స్ అంటే తెలియని వారుండరు. జోగి బ్రదర్స్‌గా జోగి నాయుడు, కృష్ణం రాజు చేసిన హంగామా వారికి భారీగా అభిమానులను సంపాదించి పెట్టింది. సినిమా అవకాశాలు పెరగడం సెలబ్రిటీలుగా మారడం అలా జరిగిపోయాయి. అయితే జోగి నాయుడు జీవితం ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. తాను ప్రేమించి పెళ్లి చేసుకొన్న యాంకర్ ఝాన్సీతో బ్రేకప్ కావడం ఆయనకు షాక్ కలిగించింది. తన జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

జోగి బ్రదర్స్ కార్యక్రమంతో
నేను, నా సహచరుడు కృష్ణంరాజు కలిసి జెమినీలో పనిచేసే వాళ్లం. ఆ సమయంలో జీకే మోహన్ గారు మేము మాట్లాడుకునే తీరు చూసి ఓ ప్రొగ్రాం డిజైన్ చేశాడు. యాంకర్లు మీరే అనిచెప్పే సరికి షాక్ తిన్నాం. అలా జోగి బ్రదర్స్ జెమినీ టీవీలో మొదలైంది. ఆ తర్వాత ఆ కార్యక్రమానికి బాగా క్రేజ్ వచ్చింది. సినీ ఇండస్ట్రీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కృష్ణవంశీ ఫోన్ చేసి ప్రశంసలు
జోగి బ్రదర్స్ ప్రొగ్రాం చూసి దర్శకుడు కృష్ణవంశీ గారు ఫోన్ చేసి స్వయంగా కలిశారు. మా కార్యక్రమం గురించి అడిగి తెలుసుకొన్నారు. స్క్రిప్టు ఎలా రాస్తారు? ఎంత రాస్తారు లాంటి విషయాలు అడిగి తెలుసుకొన్నాడు. స్క్రిప్టు లేకుండా సహజంగా మాకు ఏది తోచితే అది మాట్లాడుకుంటూ వెళ్తామని మేము చెప్పడం షాక్ తిన్నాడు.

ఝాన్సీతో ప్రేమ, పెళ్లి
జోగి బ్రదర్స్ ప్రారంభం కావడానికి కంటే ముందే నాకు, యాంకర్ ఝాన్సీకి పెళ్లి జరిగింది. మాది ప్రేమ వివాహం. నేను ముందు ప్రపోజ్ చేసే వాళ్లం. నాకు మంచి సపోర్ట్‌గా ఝాన్సీ ఉండేది. ఆమె యాంకర్‌గా పనిచేసేది. నేను కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే వాడిని. అలా మా మధ్య రిలేషన్ చక్కగా సాగిపోయింది.

ఏడాదిలోనే అంతా నాశనం
ఝాన్సీతో నా వైవాహిక జీవితం దాదాపు ఏడు, ఎనిమిది సంవత్సరాలు అద్భుతంగా సాగిపోయింది. ఎప్పుడైతే ఎదుటి వాళ్ల జీవితంలో పోలీకలు మొదలవుతాయి జీవితం సంక నాకి పోతుంది. డబ్బు, విలాసాలు, దర్పం గురించి ఆలోచించి.. ఎదుటి వాళ్లతో పోల్చి చూసుకోవడం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇలాంటి అంశాలు మా జీవితంలోకి ప్రవేశించిన ఏడాదిలోనే జీవితం దుర్బరమైంది. ఝాన్సీతో బ్రేకప్ కావడమే నా జీవితంలో అతి పెద్ద టెన్సన్ అని జోగి నాయుడు అన్నారు.

రూమర్లలో వాస్తవం లేదని
ఝాన్సీ వేధింపులకు గురిచేశానని చెప్పడం. ఇంకా ఆ క్రమంలో వచ్చిన ఎన్నో రూమర్లలో వాస్తవం లేదు. ఆర్థిక పరమైన అంశాలే మా బ్రేకప్ కారణాలు. ఝాన్సీతో ఉన్నప్పుడు స్టూడియో బాగా నడిచేది. చాలా బిజీగా ఉండే వాళ్లం. మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చే విషయాల్లో వాస్తవం లేదు. అసలు ఏం జరిగిందో మాకు తప్ప.. మా సన్నిహితులకు మాత్రమే తెలుసు అని జోగి నాయుడు పేర్కొన్నారు.

ఒంటరిగా 8 సంవత్సరాలు
ఝాన్సీతో బ్రేకప్ తర్వాత పెళ్లి చేసుకోవద్దని అనుకొన్నాను. దాదాపు 8 సంవత్సరాలు వేచి చూశాను. ఆమె తిరిగి వస్తారని ఆశించాను. ఆ క్రమంలో ఒంటరిగా ఉండటం వల్ల రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. రెండో పెళ్లికి ముందు ఆమెతో చాలా సంప్రదింపులు జరిపాను. కానీ ఝాన్సీ ఒప్పుకోలేదు. ఆమెది ఒకటే మాట.. ఒకటే బాట. తనకు ఇష్టం లేదు కాబట్టి వదిలేశాను అని అన్నారు.

రెండో భార్య గురించి ఏమన్నారంటే
ప్రస్తుతం సౌజన్య అనే అమ్మాయిని నా తల్లిదండ్రులు చూసి పెళ్లి చేశారు. ప్రస్తుతం వైవాహిక జీవితం సవ్యంగా సాగుతున్నది. సౌజన్య లాంటి భార్య దొరకడం నిజంగా అదృష్టం. నా తల్లిదండ్రులు బాగా ఇష్టపడుతారు. బ్రేకప్ తర్వాత లవ్ మ్యారేజ్ అంటే అభిప్రాయం మారలేదు. నాకు ఏదో జరిగిందని తప్పుడు అభిప్రాయం ఏర్పరుచుకోను అని జోగిని నాయుడు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











