బిగ్‌బాస్ 3పై జోగిని శ్యామల కామెంట్స్.. పదే పదే అడిగారు.. కానీ..!

ప్రస్తుతం మీడియాలో, జనాల్లో ఎక్కడ చూసినా రియాలిటీ షో బిగ్ బాస్ 3 గురించిన చర్చలే వినిపిస్తున్నాయి. మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఈ షోపై ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బిగ్ బాస్ 3 పేరిట బ్రోతల్ హౌస్ నడిపిస్తున్నారని పేర్కొంటూ యాంకర్ శ్వేతారెడ్డి విరుచుకుపడటం, పోలీస్ కేసు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. కాగా తాజాగా బిగ్ బాస్ విషయమై ప్రముఖ మీడియాతో మాట్లాడిన జోగిని శ్యామల కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసి బిగ్ బాస్ వివాదాలపై మరిన్ని చర్చలకు తావిచ్చేలా చేసింది. ఇంతకీ బిగ్ బాస్ గురించి శ్యామల ఏం చెప్పింది? వివరాల్లోకి పోతే..

తెలుగు బిగ్‌బాస్ 3 పై సంచలన ఆరోపణలు.. షాకైన జనం

తెలుగు బిగ్‌బాస్ 3 పై సంచలన ఆరోపణలు.. షాకైన జనం

బిగ్ బాస్ తొలి రెండు సీజన్లు ఎంతో ఆసక్తికరంగా సాగడంతో సీజన్ 3 పై కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు బుల్లితెర ఆడియన్స్. అయితే తీరా ఆ సమయం వచ్చింది కానీ బిగ్ బాస్ హౌస్ పై వస్తున్న కామెంట్స్ సంచలనం సృష్టిస్తుండటం బిగ్ బాస్ ఆడియన్స్ ని టెన్షన్ పెడుతోంది. బిగ బాస్ ప్రోగ్రామ్ నిర్వాహకులపై యాంకర్ శ్వేతారెడ్డి, సినీ నటి గాయత్రి గుప్తా చేసిన ఆరోపణలు జనానికి షాకిచ్చాయి.

బిగ్‌బాస్‌ పదే పదే అడిగారు.. జోగిని శ్యామల కూడా

బిగ్‌బాస్‌ పదే పదే అడిగారు.. జోగిని శ్యామల కూడా

హాట్ హాట్ గా బిగ్‌బాస్ 3 పై చర్చలు నడుస్తున్న ఈ తరుణంలో జోగిని శ్యామల కూడా పెదవి విప్పి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. తనకు గతంలో బిగ్ బాస్ సీజన్ 1 లో అలాగే ఇప్పు జరగబోతున్న బిగ్ బాస్ సీజన్ 3 లో అవకాశం వచ్చిందని, కానీ వద్దనుకున్నానని శ్యామల చెప్పింది. తనకు హిందీ బిగ్‌బాస్‌ అంటే ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ బిగ్‌బాస్ షో గురించి తనకు మొత్తం తెలుసని చెప్పింది. బిగ్ బాస్ షో యాజమాన్యం పదే పదే అడిగినా సున్నితంగా తిరస్కరించానని తెలిపింది శ్యామల.

 షో ఫినిష్ అయ్యేసరికి తప్పదు.. నాకిష్టం లేదు

షో ఫినిష్ అయ్యేసరికి తప్పదు.. నాకిష్టం లేదు

బిగ్‌బాస్ హౌస్ లో ఉన్నంత వరకు బాగానే అనిపిస్తుంది గానీ బయటకు వచ్చేటపుడు మాత్రం ఎదో మచ్చపడక తప్పదని శ్యామల తెలిపింది. అది తనకు అస్సలు ఇష్టం లేదని.. పైగా అలా వచ్చే ఆ ఫేమ్, నేమ్ తనకు అక్కర్లేదని చెప్పింది. గతంలో కొందరు చెప్పిన విధంగానే బిగ్ బాస్ రియాల్టీ షో అయినప్పటికీ ఎడిటెడ్ వర్షన్‌లో ఉంటుందని పేర్కొంది జోగిని శ్యామల. కంటెస్టెంట్‌గా ఉండాలంటూ నిర్వాహకులు సంప్రదిస్తే తాను సాఫ్ట్‌గా రిజెక్ట్ చేశానని చెప్పింది జోగిని శ్యామల.

నాగార్జున హోస్ట్.. శ్రీముఖి సహా పలువురి పేర్లు

నాగార్జున హోస్ట్.. శ్రీముఖి సహా పలువురి పేర్లు

ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ 3 మాత్రం జులై 21 వ తేదీ నుంచి అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రమోషన్స్ మొదలు పెట్టేసిన బిగ్ బాస్ యాజమాన్యం పలు ప్రోమోలతో ఆకట్టుకుంటోంది. హోస్ట్ గా నాగార్జునను కన్ఫర్మ్ చేయగా పార్టిసిపెంట్లుగా యాంకర్ శ్రీముఖి, సావిత్రి లాంటి ఇంట్రెస్టింగ్ పేర్లు బయటకు వచ్చాయి.

నిషేధించాలంటూ పోరాటం

నిషేధించాలంటూ పోరాటం

మరో వైపు ‘బిగ్ బాస్' సీజన్ - 3ని నిషేదించాలని శ్వేతారెడ్డి డిమాండ్ చేస్తోంది. రియాలిటీ షో పేరిట చాలా మోసం జరుగుతుందని ఆమె చేస్తున్న ఆరోపనలు సంచలనం సృష్టిస్తున్నాయి. తన పోరాటం ఇంతటితో ఆగదని, తన డాకుమెంట్స్ న్యాయం కోసం పోరాడతానని తేల్చి చెప్పిన ఆమె పోలీస్ కేసు వరకూ వెళ్లడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తనలాగే చాలా మంది మహిళలతో ఈ షో నిర్వహకులు ఆడుకుంటున్నారని శ్వేతారెడ్డి ఆరోపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X