నాగార్జునపై యాంకర్ లాస్యకు అలాంటి ఫీలింగ్.. గుట్టుబయటపెట్టిన సుజాత
బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షోలో ఐదోవారంలో ఇంటి నుంచి జోర్దార్ సుజాత వెళ్లిపోయారు. ఇంటి నుంచి వెళ్లిపోతూ వేదికపై హోస్ట్ నాగార్జునతో కలిసి ముచ్చటించారు. ఆ సందర్బంగా హర్ట్ షేప్ ఉన్న సింబల్స్ గేమ్ ఆడుతూ లాస్య గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. లాస్యతో రాత్రి పూట కలిసి ముచ్చట్లు పెట్టుకోవడం మంచి ఫీలింగ్. అక్కకు ఇంటిలోని అన్ని విషయాలు తెలిసిపోతుంటాయి. ఏదైనా తెలియకపోతే అలా జరిగిందా అంటూ కొంపలు మునిగిపోయినట్టు ముఖం పెడుతుంది అని సుజాత చెప్పారు.
లాస్య గురించి చెబుతూ అక్కకు ఇంటిలో గాసిప్స్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో రాత్రి పూట గుసగుసలతోనే నా రిలేషన్ పెరిగింది. మేమిద్దరం మీ (నాగార్జున) గురించి కూడా మాట్లాడుకొన్నాం. నాగ్ సార్ చాలా అందంగా ఉంటాడు. ఆయన వేసుకొనే బట్టల కంటే ముఖం చాలా అందంగా ఉంటుంది అంటూ మేము మాట్లాడుకొంటాం అని సుజాత చెప్పింది.

అంతేకాకుండా నాగ్ సార్ ఓ సారి నాగచైతన్యను తీసుకురావచ్చుగా.. ఓ సారి చైతూతో కూడా కలిసి స్టెప్పేసి వెళ్లిపోయాదాన్ని అని లాస్య నేను మాట్లాడుకొన్నాం అంటూ సుజాత అసలు విషయాన్ని బయటపెట్టింది. సుజాత్ తన గురించి చెబుతుండగా నాగ్ కాస్త సిగ్గుపడిపోయాడు. నేను ఏమి అడుగుతున్నాను.. మీరు ఏం చెబుతున్నాను. మొత్తానికి సుజాత టాపిక్ మార్చిపడేసింది అంటూ నాగ్ అన్నారు.


Click it and Unblock the Notifications











