Jabardasth జంట నిశ్చితార్థం డేట్ ఫిక్స్.. అఫీషియల్‌గా జోర్డార్ సుజాత క్లారిటీ!

టెలివిజన్ రంగంలో కొంతమంది సినీ తారల మధ్య కూడా ప్రేమ కొనసాగుతుంది అని చాలా రకాల వార్తలు వస్తూ ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో అయితే రియాల్టీ షోలలో పాల్గొంటున్న యాంకర్స్ మధ్యలో కూడా అలాంటి రూమర్స్ ఎక్కువగా వస్తున్నాయి. వారి మధ్య ఏమీ లేకపోయినా కూడా కావాలని టిఆర్పి రేటింగ్ కోసం కెమిస్ట్రీని క్రియేట్ చేస్తున్న చానల్స్ కూడా ఉన్నాయి. అయితే ఒక జబర్దస్త్ జంట మాత్రం చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతోంది అని అర్థం అవుతుంది. ఇక మొత్తానికి వారి నిశ్చితార్థం గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

రాకేష్ జబర్దస్త్ క్రేజ్

రాకేష్ జబర్దస్త్ క్రేజ్

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపును అందుకున్న కమెడియన్స్ లలో రాకింగ్ రాకేష్ ఒకరు. మొదట జబర్దస్త్ లో ఒక స్క్రిప్ట్ రైటర్ గా మొదలైన అతని ప్రయాణం ఆ తర్వాత కమెడియన్ గా టీం లీడర్ గా గుర్తింపును అందుకునే వరకు వచ్చింది. మొదట్లోనే రాకింగ్ రాకేష్ తన కామెడీ టైమింగ్ తో ఎంతగానో కట్టుకున్నాడు. ఇప్పుడు అతను కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా వివిధ రకాల షోలు కూడా చేస్తున్నాడు.

సుజాతతో లవ్ ట్రాక్

సుజాతతో లవ్ ట్రాక్

ఇక జబర్దస్త్ రాకింగ్ రాకేష్ ఎప్పుడైతే తన టీంలోకి జోర్దార్ సుజాతను తీసుకున్నాడో అప్పటినుంచే వారి మధ్యలో ఏదో కొనసాగుతోంది అనే విధంగా వార్తలు అయితే వచ్చాయి. ఇక చాలా సందర్భాలలో స్టేజ్ పైన వేరే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. దీంతో ఏదో కొనసాగుతోంది అనేలా హైలెట్ చేసిన విధానం కూడా బాగా వైరల్ అయింది.

వారి తరహాలోనే..

వారి తరహాలోనే..

అయితే జబర్దస్త్ లో ఈ తరహా మూమెంట్స్ కనిపించడం అనేది చాలా కామన్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే సుదీర్ రష్మి మధ్యలో ప్రేమ కొనసాగుతోంది అని వారి పెళ్లి కూడా జరగబోతోంది అని రేటింగ్స్ కోసం చాలాసార్లు హడావిడి చేశారు. ఇక బయట మాత్రం ఎప్పుడూ ఆ విషయం గురించి వారు పెద్దగా రియాక్ట్ అయ్యింది లేదు. ఆ విధంగానే వారికి బాగా గుర్తింపు లభించింది. అయితే అదే తరహాలో సుజాత జోడి కూడా పాపులర్ అయ్యింది.

రోజా ముందే ప్రకటన

రోజా ముందే ప్రకటన

గతంలో జబర్దస్త్ షో లోనే వారి గురించి ప్రేమ గురించి ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఆ తర్వాత రోజా దగ్గర కూడా వారి విషయం గురించి ప్రస్తావనకు రావడంతో ఆమె ముందే వీరు ప్రేమ విషయాన్ని ఒప్పుకున్నారు. అంతేకాకుండా ఒక రోజు సుజాత అలాగే రాకింగ్ రాకేష్ ఇద్దరు కూడా రోజా ఇంటికి వెళ్లి మరి ఆశీర్వాదం తీసుకున్నారు. అప్పుడే వారి పెళ్లి గురించి ఒక ప్రకటన ఇస్తూ వారి యూట్యూబ్లో ఒక వీడియో కూడా విడుదల చేశారు.

త్వరలోనే నిశ్చితార్థం

త్వరలోనే నిశ్చితార్థం

ఇక రీసెంట్ గా మరొసారి సుజాత తన యూట్యూబ్లో మరొక వీడియోను పోస్ట్ చేస్తూ తన పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఎప్పటినుంచో అనుకుంటున్న తరుణం రానే వచ్చింది అని ఈ నెల చివరలో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు సుజాత తెలియజేసింది. ఇరు కుటుంబాల సమక్షంలో తమ ఇద్దరం ఒకటి కావడానికి ఇంకా ఎంటెజో సమయం లేదు అని నిశ్చితార్థం తర్వాత పెళ్లి విషయం గురించి క్లారిటీ ఇస్తామని ఆమె తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X