For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jabardasth: రోజా ఇంట్లోనే జోర్డార్ సుజాత పెళ్లి ముచ్చట్లు.. రాకింగ్ రాకేష్ తో పెళ్లి ఎప్పుడంటే..

    |

    టెలివిజన్ ప్రపంచంలో ఇటీవల కాలంలో కొంతమంది టీఆర్పి రేటింగ్ కోసమే ప్రేమ వ్యవహారాలతో హడావిడి చేస్తున్నారు అనే కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. ముఖ్యంగా జబర్దస్త్ ఢీ లాంటి షోలలో ఈ తరహా సెలబ్రిటీలు ఎక్కువగా కనిపించారు. అయితే జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపునందుకున్న రాకింగ్ రాకేష్ అలాగే జోర్దార్ సుజాత ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్ వచ్చింది. అయితే వీరిది కూడా డ్రామా ని అందరూ అనుకున్నారు. కానీ వారిది నిజమైన ప్రేమ అని ఆ తర్వాత క్లారిటీగా అర్థమైంది. ఇక రీసెంట్ గా రోజా ఇంటికి వెళ్లిన సుజాత అక్కడ తన పెళ్లి విషయంపై కూడా ఒక క్లారిటీ ఇచ్చింది.. ఆ వివరాల్లోకి వెళితే..

    జబర్దస్త్ లో ప్రేమ

    జబర్దస్త్ లో ప్రేమ

    జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపునందుకున్న రాకేష్ రాకేష్ చాలా తొందరగానే టీమ్ లీడర్ గా కూడా సెలక్ట్ అయ్యాడు. ఇక అతను గత రెండు మూడేళ్ల కాలంలో రియాలిటీ షోలతోనే మంచి ఆదాయాన్ని అందుకుంటున్నాడు. మరో వైపు చిన్న చిన్న సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. అతనితో పాటు జోర్డార్ సుజాత కూడా జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకుంది. అక్కడే వారికు దారి ఏర్పడింది.

    టీఆర్పీ కోసమే..

    టీఆర్పీ కోసమే..

    అయితే జోర్డార్ సుజాత రాకింగ్ రాకేష్ మధ్యలో ఏదో నడుస్తోంది అని చాలా రకాల వార్తలో అయితే వినిపించాయి. ఇక రియాలిటీ షోలో కూడా వీరు లవ్ బర్డ్స్ తరహాలోనే కనిపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక విధంగా రష్మీ సుధీర్ తరహాలోని వీరిది కూడా కేవలం టిఆర్పి కోసం కొనసాగే లవ్ ట్రాక్ అయ్యి ఉండవచ్చు అని అందరూ అనుకున్నారు.

    రింగ్ తొడిగి

    రింగ్ తొడిగి

    కానీ సుజాత రాకేష్ ఇద్దరు కూడా నిజంగానే ప్రేమించుకుంటున్నట్లు పలు ఇంటర్వ్యూలలో కూడా తెలియజేశారు. అప్పటికి కూడా జనాలు నమ్మలేదు కానీ ఆ మధ్యలో శ్రీదేవి డ్రామా కంపెనీలో వారిద్దరూ ప్రేమ విషయాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్లు తెలియజేశారు. అంతే కాకుండా స్టేజి మీద సుజాతకు రాకేష్ రింగ్ తొడిగి ప్రపోజ్ చేయడంతో వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు అని చాలా క్లారిటీగా అర్థమయిపోయింది.

    రోజా ఇంట్లో సుజాత ముచ్చట్లు

    రోజా ఇంట్లో సుజాత ముచ్చట్లు

    అయితే సుజాత రాకేష్ ఇద్దరూ కూడా ధైర్యంగా ప్రేమ విషయాన్ని బయట చెప్పడానికి కారణం రోజా కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె ఒకసారి స్టేజ్ పైన ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంది అని కామెంట్ చేయడంతోనే బలమైన క్లారిటీ వచ్చేసింది. రీసెంట్ గా సుజాత రోజా ఇంటికి వెళ్లే అక్కడ అనేక విషయాలను తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసుకునే.

    తల్లి కొడుకుల అనుబంధం

    తల్లి కొడుకుల అనుబంధం

    మొదటిసారి రోజా ఇంటికి వచ్చినట్లు చెప్పిన సుజాత అక్కడే ఆమె హోమ్ టూర్ కూడా చేసి రోజా గారితో ఉన్న అనుబంధం గురించి కూడా తెలియజేసింది. రోజా గారు రాకేష్ ని ఒక కొడుకులా భావిస్తారు అని.. వారిద్దరికీ తల్లి కొడుకుల అనుబంధం అని చాలాసార్లు రుజువయ్యిందని కూడా సుజాత తెలియజేసింది. అయితే మేము మా ప్రేమ విషయాన్ని ఎప్పుడూ కూడా అలా స్టేజిలపై చెప్పకుండా ఉందామని అనుకున్నాము అంటూ.. రోజా గారు గుర్తించిన తర్వాతనే ఆమె సపోర్ట్ ద్వారా బయటకు చెప్పాల్సి వచ్చిందని సుజాత తెలిపింది.

    త్వరలోనే పెళ్లి

    త్వరలోనే పెళ్లి

    రోజా గారు రాకేష్ కు నాకు చాలా సపోర్ట్ చేశారు. అండగా నిలిచారు. ఆ ధైర్యంతోనే మేము మా ప్రేమ విషయాన్ని కూడా అందరితో షేర్ చేసుకున్నాను. త్వరలోనే పెళ్లి విషయం గురించి కూడా చెబుతాను అని రోజా ఇంట్లోనే సుజాత వివరణ ఇచ్చింది. అంతేకాకుండా రాకేష్ తో తిరుపతి వెళ్ళిన అనంతరం రోజానీ కలిసి ఆమెతో కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. వారికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా వైరక్ గా మారుతొంది.

    English summary
    Jordar sujatha clarification on marriage with jabardasth rocking rakesh in roja home tour
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X