Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సుజాతను అలా పట్టుకున్న అవినాష్.. ఆడగాలి తాక ఎన్ని రోజులో అంటూ జోర్దార్ కౌంటర్
బిగ్ బాస్ షో నాల్గో సీజన్ కంటెస్టెంట్లు మళ్లీ సందడి చేసేందుకు రెడీ అయ్యారు. కామెడీ స్టార్స్ అంటూ రాబోతోన్న కొత్త షోలో అవినాష్, సుజాత,అరియానా వంటి వారు పార్టిసిపేట్ చేయబోతోన్నారు. అవినాష్‌ను ముందు పెట్టి ఓ కామెడీ చేయబోతోన్నారని ఆ మధ్య రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. అలా వచ్చిన వాటికి రూపమే ఈ కామెడీ స్టార్స్. అవినాష్ మెయిన్ లీడ్‌గా పెట్టిన వర్షిణి, శేఖర్ మాస్టర్, శ్రీదేవీ వంటి వారిని స్పెషల్ అట్రాక్షన్‌గా తీసుకొచ్చారు.
పూనమ్ భజ్వా కొత్త లుక్ మాములుగా లేదు (ఫొటోలు)
బిగ్ బాస్ తరువాత..
బిగ్ బాస్ షో నడిచినంత కాలం స్టార్ మా చానెల్ ట్రెండింగ్‌లో ఉంటుంది. ఓ మూడు నాలుగు నెలలు సోషల్ మీడియా మొత్తం బిగ్ బాస్ హవానే నడుస్తుంది. బిగ్ బాస్ ముగిశాక ఆ కంటెస్టెంట్లతో ఏదో ఒక కొత్త షోను ప్రారంభించడం స్టార్ మాకు అలవాటే. అలా ఈ సారి కాస్త భారీగానే ప్లాన్ చేశారు.
గతంలో అలా..
సెకండ్ సీజన్ బిగ్ బాస్ ముగిశాక లాఫ్టర్ చాలెంజ్ అనే షోను ప్రారంభించారు. దాంట్లో తేజస్వీని తీసుకున్నారు. ఆ తరువాత స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్ అంటూ శ్రీముఖితో ఓ షోను చేశారు. కానీ ఇవేవీ అంతగా వర్కవుట్ కాలేదు. అయితే తాజాగా కామెడీ స్టార్స్ అంటూ ఓ కొత్త షోను ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నారు.
స్పెషల్ అట్రాక్షన్స్..
కామెడీ స్టార్స్ అంటూ రాబోతోన్న ఈ షో.. ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 1 30గంటలకు ప్రసారం కాబోతోంది. అయితే ఈ షోలో శేఖర్ మాస్టర్, నాటి హీరోయిన్ శ్రీదేవీ విజయ్ కుమార్ జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. ఇక ఢీ నుంచి బయటకు వచ్చిన వర్షిణి ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతోంది.
సుజాతతో కామెడీ..
కామెడీ స్టార్స్ షోలో అవినాష్ సుజాత కలిసి బాగానే ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతోన్నట్టు కనిపిస్తోంది. బిగ్ బాస్ ఇంట్లోనూ ఈ ఇద్దరి కాంబో బాగానే క్లిక్ అయింది. ఇద్దరూ కలిసి సెటైర్లు వేసుకోవడం, సుజాతపై పంచ్‌లు వేస్తూ అవినాష్ గాలి తీసేయడం బాగానే వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు కూడా అవినాష్ అదే స్ట్రాటజీని వాడుతున్నట్టుంది.
ఆడగాలి తాకక...
తాజాగా వచ్చిన ప్రోమోలో అవినాష్ సుజాత కాంబో బాగానే క్లిక్ అయింది. సుజాతను అవినాష్ పట్టుకోవడంతో గట్టిగా కౌంటర్ వేసింది. స్కిట్లో ఇలా దొరికానని చెప్పి పట్టుకుంటున్నాడు.. ఎన్నోద్దులు అవుతుందో ఆడగాలి తాకక అంటూ అవినాష్ పరువు తీసేసింది సుజాత.
Recommended Video