For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాహుల్‌కు చెమటలు పట్టించిన సుజాత.. అమ్మాయి దూకుడికి షాకైన బిగ్ బాస్ విన్నర్!

  By Manoj Kumar P
  |

  సింగర్‌గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి... చాలా తక్కువ సమయంలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు రాహుల్ సిప్లీగంజ్. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌తో సత్తా చాటిన అతడు.. యూత్‌లో ఎనలేని క్రేజ్‌ను దక్కించుకున్నాడు. ఇక, గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ -3లో విన్నర్‌గా నిలిచిన తర్వాత అతడి కెరీర్ అమాంతం మారిపోయింది. దీంతో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో రాహుల్‌కు జోర్ధార్ సుజాత భారీ షాకిచ్చింది. ఆ అమ్మాయి బిగ్ బాస్ విన్నర్‌కు కాసేపు చెమటలు పట్టించింది. ఆ వివరాలు మీకోసం.!

  సినిమా పాటలతో కాదు.. అలా ఫేమస్

  సినిమా పాటలతో కాదు.. అలా ఫేమస్

  ప్లేబ్యాక్ సింగర్‌గా ఎంట్రీ ఇవ్వక ముందు చాలా టీవీ షోలలో తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు రాహుల్ సిప్లీగంజ్. ఆ తర్వాత నాగ చైతన్య నటించిన ‘జోష్'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాటలు పాడాడు. అయితే, సినిమా పాటల కంటే సొంతంగా రూపొందించిన ప్రైవేట్ ఆల్బమ్‌ల వల్ల రాహుల్ బాగా ఫేమస్ అయ్యాడు.

  బిగ్ బాస్ హౌస్‌లో ఆమెతో లవ్ ట్రాక్

  బిగ్ బాస్ హౌస్‌లో ఆమెతో లవ్ ట్రాక్

  బిగ్ బాస్ సీజన్ -3లో సహా కంటెస్టెంట్ అయిన హీరోయిన్ పునర్నవి భూపాలంతో రాహుల్ సిప్లీగంజ్ ప్రేమాయణం సాగించాడన్న టాక్ అప్పట్లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్‌లో వీళ్లిద్దరూ అదే తరహాలో వ్యవహరించడం కారణంగానే ఈ టాక్ వచ్చింది. అంతేకాదు, ఈ జంటకు పెళ్లి కూడా జరుగుతుందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.

  విన్నర్‌గా నిలిచాడు.. బిజీగా మారాడు

  విన్నర్‌గా నిలిచాడు.. బిజీగా మారాడు

  ఏమాత్రం అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించాడు రాహుల్ సిప్లీగంజ్. దూకుడుగా ఉంటూ ఎన్నో వివాదాలకు కారణం కూడా అయ్యాడు. దీంతో అతడు ఏ వారమైనా వెళ్లిపోతాడేమోనని ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా ఫైనల్స్ వరకు వెళ్లి విజయం సాధించాడు. తద్వారా ఎన్నో ఆఫర్లను అందుకుంటూ బిజీ బిజీగా సాగిపోతున్నాడు.

   తొలిసారి ప్రయోగం చేస్తున్న రాహుల్

  తొలిసారి ప్రయోగం చేస్తున్న రాహుల్

  ఇప్పటికే సింగర్‌గా ఎన్నో సూపర్ హిట్ పాటలతో ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు రాహుల్. అయితే, కెరీర్‌లో తొలిసారి యాక్టర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో రాబోతున్న ‘రంగమార్తాండ'లో రాహుల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చాలా మంది ప్రముఖులు నటిస్తున్నారు.

  బిగ్ బాస్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చాడుగా

  బిగ్ బాస్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చాడుగా

  బిగ్ బాస్‌ షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేయడానికి ‘బిగ్ బాస్ బజ్' అనే చిట్ చాట్ షోను ప్రారంభించిన విషయం తెలిసిందే. గత సీజన్‌లో దీన్ని హీరో తనీష్ హోస్ట్ చేశాడు. ఇప్పుడు మాత్రం దీన్ని రాహుల్ నడిపిస్తున్నాడు. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లను విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ విన్నర్‌కు భారీ షాక్ తగిలింది.

  Bigg Boss Telugu 4 : జోర్దార్ సుజాత ఎలిమినేటెడ్!
  రాహుల్‌కు చెమటలు పట్టించిన సుజాత

  రాహుల్‌కు చెమటలు పట్టించిన సుజాత

  తాజాగా షో నుంచి ఎలిమినేట్ అయిన జోర్ధార్ సుజాతతో రాహుల్ బిగ్ బాస్ బజ్‌లో కలిశాడు. ఈ క్రమంలోనే ఆమె నుంచి ఎన్నో విషయాలను రాబట్టాడు. ఇందులో భాగంగానే హౌస్‌లోకి కంటెస్టెంట్ల ఫొటోలు చూపించి రాపిడ్ ఫైర్ నిర్వహించాడు. దీనికి సుజాత మనసులోని మాటలను ధైర్యంగా చెప్పి అతడికే షాకిచ్చింది. ఈ దెబ్బతో రాహుల్‌కు చెమటలు కూడా పట్టడం గమనార్హం.

  English summary
  We have already seen popular contestant Gangavva exiting the show of ‘Bigg Boss Telugu 4’ owing to her health issues. And now, another contestant got evicted from the show this weekend. On Sunday (October 11), Jordar Sujata got evicted.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X