For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rocking Rakesh: లవర్ ని స్మశానానికి తీసుకెళ్లిన జబర్దస్త్ కమెడియన్.. షాకింగ్ గా రీజన్..

  |

  బుల్లితెరపై ఒక షో కానీ పోగ్రామ్ కానీ హిట్ కొట్టాలంటే ఎక్కవగా ఉపయోగించే ట్రిక్.. లవ్ ట్రాక్. స్టేజీలపై వాళ్లిచ్చే పర్ఫామెన్స్ చూస్తే నిజంగా వాళ్లు లవ్ లో ఉన్నారనే చాలామంది అనుకుంటారు. కానీ అలా జరగదు. అయితే షోలలో లవర్స్ గా యాక్ట్ చేసిన వారిలో అతికొద్ది మంది మాత్రం నిజ జీవితంలో కూడా ప్రేమికులుగా మారతారు. అలాంటి జంటలో ఒక జోడి రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత. వీళ్లిద్దరు ప్రముఖ కామేడీ షో జబర్దస్త్ ద్వారా కలిసిన విషయం తెలిసిందే. అయితే తన గర్ల్ ఫ్రెండ్ అయిన జోర్దార్ సుజాతను రాకేష్ ఒక స్మశానికి తీసుకెళ్లాడట. తాజాగా ఈ విషయం చెప్పి షాక్ ఇచ్చింది సుజాత. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయంలోకి వెళితే..

   రింగ్ తొడిగి ప్రపోజ్..

  రింగ్ తొడిగి ప్రపోజ్..

  కామేడీ షో జబర్దస్త్ వేదికగా ఒక్కటైన జంట రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత. అయితే మొదట్లో మాత్రం వీరిద్దరూ షోకి రేటింగ్ కోసం మాత్రమే చేస్తున్నారని అందరూ అనుకున్నారు. అంతేకాకుండా యూట్యూబ్ లో వాళ్ల వీడియోస్ కి కామెంట్లు కూడా అలానే వచ్చేవి. తర్వాత ఒక టీవీ ప్రోగ్రామ్ లో సుజాతకు రింగ్ తొడిగి మరి ప్రపోజ్ చేశాడు రాకింగ్ రాకేష్.

  రేటింగ్ కోసం వేసే స్టంట్స్..

  రేటింగ్ కోసం వేసే స్టంట్స్..

  అలా రింగ్ తొడగటాన్ని కూడా ఫేక్ అన్నవాళ్లు లేకపోలేదు. అదంతా టీఆర్పీ రేటింగ్ కోసం వేసే స్టంట్స్ అని, నిజం కాదన్నారు. ఈ క్రమంలోనే ఇతర వేదికలపై అదంతా నిజమని వాళ్లిద్దరూ స్వయంగా ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. తర్వాత వారికి ఆల్ ది బెస్ట్ చెబుతూ విషెస్ అందించారు.

  ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడంతో..

  ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడంతో..

  అలాగే రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత వివాహానికి వాళ్ల ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడంతో వారికి లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం పలు ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్న ఈ జంట ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని టాక్. అయితే ఈ పెళ్లి వార్తలపై మాత్రం వాళ్లు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

  మొత్తంగా పది జంటలు..

  మొత్తంగా పది జంటలు..

  ఇదిలా ఉంటే ఈ జంట తాజాగా మిస్టర్ అండ్ మిస్సెస్ అనే షోలో పాల్గొంది. యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా చేస్తున్న ఈ ప్రోగ్రాంలో మొత్తంగా పది జంటలు పాల్గొన్నాయి. అందులో ఒక జంటగా రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత జోడి పార్టిస్ పేట్ చేసింది. ఈ షోలో తాము ఎదుర్కొన్న సమస్యలను చెప్పుకుంటూ జంటలు ఎమోషనల్ అయ్యాయి.

  చిన్నప్పటి నుంచి పరీక్షలు..

  చిన్నప్పటి నుంచి పరీక్షలు..

  ఇందులో భాగంగానే రాకేష్ గురించి సుజాత మాట్లాడింది. ''నాకు దేవుడు చిన్నప్పటి నుంచి పరీక్షలు పెట్టాడు. కానీ, నువ్వు నన్ను స్మశానికి తీసుకు వెళ్లి పరీక్ష పెట్టావ్. నాకు కోట్లు కావాలి, కార్లు కావాలి అని నేను అడగను. నా కన్నీళ్లు తుడవటానికి నా జీవితాంతం నా పక్కనే ఉంటే చాలు'' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సుజాత.

  ఆ పరీక్ష ఎంటీ..

  సుజాత కన్నీళ్లు పెట్టుకుంటే ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు రాకింగ్ రాకేష్. అయితే ఆ స్మశానికి తీసుకెళ్లడం ఏంటీ.. ఆ పరీక్ష ఎంటీ అని తాజాగా విడుదల చేసిన మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రోమో చూసిన వారికి ఆసక్తిగా ఉంది. మరి అది తెలియాలంటే ఈ పోగ్రామ్ పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.

  English summary
  Bigg Boss 4th Season Fame Jordar Sujatha Reveals Her Love Test By Rocking Rokesh In Mister And Misses Latest Promo
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X