గుడ్లు పీకి గోళీలు ఆడుతా.. ముక్కు అవినాష్‌కు జోర్దార్ సుజాత వార్నింగ్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 16వ రోజు టాస్కులు, వినోదంతో సాగిపోయింది. మోనాల్, లాస్య, సుజాతను ఆటపట్టిస్తూ జబర్దస్త్ అవినాష్ షోను వినోదంగా మలిచాడు. ఆ తర్వాత ఫిజికల్ టాస్క్ మొదలైంది. రోబోలుగా రెండు జట్లు విడిపోయి గేమ్‌ను ఆడాయి. కొందరు గులాబీ రంగు దుస్తులు ధరించగా, మరో గ్రూప్ సిల్వర్ కలర్ రోబో దుస్తులు ధరించి గేమ్ ఆడారు. 16 రోజు ఆటలో విశేషాలు ఏమిటంటే...

మోనాల్ నోట అతికష్టంగా రైమ్స్
బిగ్‌బాస్ హౌస్‌లో మోనాల్ గజ్జర్ చేత తెలుగు రైమ్స్ పాడించాలని బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చారు. అతి కష్టమీద మోనాల్ తెలుగు రైమ్‌ను పూర్తి చేశారు. ఈ సందర్బంగా అవినాష్ మోనాల్‌ను ఆటపట్టించాడు. దాంతో ఆ టాస్క్ సరదాగా గడిచిపోయింది. అలా మోనాల్ చేత తెలుగు రైమ్స్‌ను పూర్తి చేయించారు.

మోనాల్‌ను టీజ్ చేస్తూ లవ్ ప్రపోజల్
ఆ తర్వాత మోనాల్‌ను టీజింగ్ చేస్తూ ముక్కు అవినాష్ ఆటపట్టించాడు. హలో గురూ ప్రేమ కోసమే అంటూ పాట పాడుతూ సరదాగా మోనాల్‌కు లవ్ ప్రపోజ్ చేశాడు. స్వీట్ గర్ల్, కాక్ టెయిల్ గర్ల్ అంటూ కామెంట్ వేశాడు. మోనాల్ మాటలతో కవ్విస్తూ అందర్నీ నవ్వించాడు. అలా మోనాల్‌కు బిస్కెట్లు వేస్తూ అవినాష్ షోను మరింత వినోదంగా కనిపించాడు.

సుజాత పాత తరం హీరోయిన్‌లా
జోర్దార్ సుజాన్‌ను మోనాల్, అవినాష్ టీజ్ చేశారు. సుజాతను చూస్తూ 70లో ఉండే హీరోయిన్‌లా ఉందంటూ కామెంట్ చేశారు. నీవు అలనాటి హీరోయిన్ వాణిశ్రీలా ఉన్నావు.. నిన్ను అలాగే చూడాలనిపిస్తాయని అవినాష్ అంటే.. అలా చూడకు గుడ్లు గుంజుతాయ్.. అలానే చేస్తే గుడ్లు పీకి గోళీలు ఆడుతాను అంటూ సుజాత స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

లాస్య నీవు హ్లోమ్లీగా ఉన్నావు..
సుజాతను ఆటపట్టించిన తర్వాత అవినాష్ దృష్టి అరియానా గ్లోరిపై పడింది. నీవు మోడరన్ హీరోయిన్‌లా ఉన్నావు అంటూ కామెంట్ చేశాడు. లాస్యను చూస్తూ హోమ్లీగా ఉన్నావు అంటే.. అలా లేననే కదా నీవు కామెంట్ చేశావు అంటూ లాస్య బదులిచ్చింది.
Recommended Video

అవినాష్‌కు చుక్కలు చూపించిన మోనాల్
ఆ తర్వాత అవినాష్, సుజాత దస్తీ, బిస్తీ (దాల్ దడీ) ఆట ఆడారు. సుజాతను అవినాష్ వేగంగా గిరగిరా తిప్పడంతో కళ్లు తిరుగుతున్నాయని వదిలిచుకొన్నది. ఆ తర్వాత మోనాల్, అవినాష్ వచ్చి ఆడారు. అవినాష్‌ను గిరగిరా తిప్పడంతో లబోదిబో మన్నాడు. అలా 16వ రోజు ఎపిసోడ్ వినోదంతో నిండిపోయింది.


Click it and Unblock the Notifications











