Bigg Boss Season 7: బిగ్‌బాస్‌లోకి వివాదాస్పద జర్నలిస్టు.. బెర్త్ కన్ఫర్మ్ అయినట్టేనా?
బిగ్ బాస్ ఇతర భాషలలో లాగానే తెలుగులో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్... ఏడవ సీజన్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నిజానికి ఈ ఏడవ సీజన్ కి నందమూరి బాలకృష్ణ, రానా హోస్టులుగా వ్యవహరిస్తారని ప్రచారం జరిగినా... ఎట్టకేలకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడు హౌస్ లోపలికి వెళ్లే వారి గురించి చర్చ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే...
సెలబ్రెటీల మధ్య చిచ్చు: నిజానికి బిగ్ బాస్ హౌస్ అంటేనే మసాలా. 14 నుంచి 18, 19 మంది సెలబ్రిటీలను లోపలికి పంపి వారి మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేసి కంటెంట్ రాబడుతూ ఉంటారు. ఇప్పటికే ఆరు సీజన్లలో దాదాపు అన్ని సీజన్లలోనూ బిగ్ బాస్ కి బాగానే వర్కౌట్ అయింది. ఏడవ సీజన్ విషయంలో కూడా ముందు నుంచే కొంచెం తేడా అని చెబుతున్న బిగ్ బాస్ ఆసక్తికరమైన వ్యక్తులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

వివాదాస్పద జర్నలిస్టు: అందులో భాగంగానే టాలీవుడ్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి ఇప్పుడు బిగ్ బాస్ లోకి రాబోతున్నట్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి సురేష్ కొండేటి ఎప్పుడో సినీ రంగంలో నటుడిగా రాణించాలని ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చారు. ఎక్కడో పాలకొల్లులో పుట్టి పెరిగిన ఆయన హైదరాబాద్ వచ్చి జర్నలిస్టుగా సెటిల్ అయిపోయారు. జర్నలిస్టుగా ఉన్న పరిచయాలతో డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా మారి బాగానే వెనకేసుకున్నారు.

యూట్యూబ్ లో ట్రెండ్: ఇక ఆ తర్వాత నాగార్జున సంతోషం సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆ సినిమా పేరునే ఒక పత్రికకు పెట్టి ఒక సినీ వారపత్రికను నడుపుతున్నారు. ఆయన ఇక ఈ మధ్యకాలంలో సినిమా ప్రెస్ మీట్ లో దర్శక నిర్మాతలను నటినటులను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతూ... ఆయన యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్నారు.
బిగ్ బాస్ లోకి ఆయన: ఒక్కోసారి ఆయన అడిగే ప్రశ్నలకు అర్థం ఉన్నా.. వాటిని దాటవేసే ప్రయత్నంలో హీరో హీరోయిన్లు దర్శకనిర్మాతలు దయచేసి కాంట్రవర్సీ చేయవద్దని చెబుతూ దాటవేస్తున్నారు. దీంతో ఆయనకు కాంట్రవర్సీ జర్నలిస్టుగా పేరు పడిపోయింది. అయితే ఇలాంటి కాంట్రవర్సీలే కావాలని ఎదురుచూసే బిగ్ బాస్ యాజమాన్యం ఇప్పుడు ఆయనను బిగ్ బాస్ లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయనను సంప్రదించగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

రేటింగ్స్ కోసమే: అయితే ఇందులో నిజం ఎంత ఉందో.. ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారా? లేదా అనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే! ఇక టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నదని మేరకు బిగ్ బాస్ యాజమాన్యం ఈసారి భారీగానే ఖర్చు పెడుతుందని మంచి అవుట్ పుట్ తో గట్టి రేటింగ్స్ రాబట్టుకునే ప్రయత్నాలు కూడా చేస్తుందని అంటున్నారు. చూడాలి మరి త్వరలో ఏం జరగబోతోంది అనేది.


Click it and Unblock the Notifications











