చిరంజీవి, నాగార్జునను ఎదుర్కోవడం ఓ ఛాలెంజ్.. నా మార్కును చూపిస్తా.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ఎవరు మీలో కోటీశ్వరులు గేమ్ షోకు సర్వం సిద్ధమైంది. త్వరలోనే ఈ రియాలిటీ షో తెలుగులో జెమినీ టెలివిజన్‌లో ప్రసారం కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తోపాటు జెమినీ, సన్ టెలివిజన్ నిర్వాహకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఎన్టీఆర్ సమాధానాలు, అలాగే గేమ్ షో గురించి వివరాల్లోకి వెళ్తూ....

120 దేశాల్లో పలు భాషల్లో
ఇక ఎవరు మీలో కోటీశ్వరుడు లాంటి గేమ్ షో సుమారు 120 దేశాల్లో ప్రసారం అవుతున్నది. బ్రిటన్‌లో హు వాంట్స్ బీ ఏ మిలియనీర్ గేమ్ షో స్పూర్తి, ఫార్మాట్‌తో దాదాపు పలు భాషల్లో వస్తున్న గేమ్‌షోకు విశేష ఆదరణ లభిస్తున్నది. హిందీలో సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా దశాబ్దకాలంగా ఈ షో కొనసాగుతున్నది.

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా
తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షో తొలుత అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌లుగా వ్యవహరించారు. అయితే వారి సమయంలో గేమ్ షో టీఆర్పీ పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ షోను మా టెలివిజన్ నుంచి జెమినీకి మార్చడమే కాకుండా హోస్ట్, టైటిల్‌లో కొద్దిపాటి మార్పులతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఒప్పుకోవడానికి కారణం ఇదే..
ఎవరు మీలో కోటీశ్వరుడు గేమ్ షోను ఒప్పుకోవడానికి పెద్దగా కారణాలు ఏమీ లేవు. బిగ్‌బాస్ షోను ఒప్పుకోవడానికి ఎలాంటి కారణాలు ఏమీ లేవో.. ఈ షోను కూడా ఒప్పుకోవడానికి కూడా కారణాలు లేవు. సినిమా ఒప్పుకోవడానికి కథ, కథనాలు ఎలానో.. ఎవరు మీలో కోటీశ్వరుడు ఒప్పుకోవడానికి ప్రజలను నేరుగా కలుసుకోవడానికి అవకాశం లభిస్తుందనే కారణంతో ఒకే అన్నాను అని ఎన్టీఆర్ తెలిపారు.

నాగ్, చిరంజీవి నాకు ఛాలెంజ్
గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షోకు నాగార్జున, చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించారు. వారి వారి పరిధిలో ఈ గేమ్ షోకు తమ మార్కును క్రియేట్ చేశారు. ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్‌గా వ్యవహరించడం నాకు ఓ ఛాలెంజ్‌ను విసిరి వెళ్లారు. నా వంతు కృషిని చేసి నా మార్కును క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

ఎలాంటి ప్రిపరేషన్ లేదు..
ఎవరు మీలో కోటీశ్వరులు షో చేయడానికి ఎలాంటి ప్రిపరేషన్ చేయలేదు. చేయకూడదనే ఫీలింగ్‌తో ఉన్నాను. సహజంగా గేమ్ షోను కొనసాగించేందుకు ప్రయత్నిస్తాను. నా ముందు ఉండే పార్టిసిపెంట్స్, వారి తీరుతోనే నా హోస్టింగ్ ఆధారపడి ఉంటుంది అని ఎన్టీఆర్ అన్నారు.


Click it and Unblock the Notifications











