Don't Miss!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- News నక్షత్రాన్ని మార్చిన గురువు.. ఈ రాశులకు అదృష్ట యోగం
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
స్వింగ్ జర అంటూ దుమ్మురేపిన ఎన్టీఆర్.. డాన్సర్లకు సందేశం!
Recommended Video
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతటి అద్భుతమైన డాన్సరో అందరికీ తెలిసిందే. అద్భుతమైన ఎనర్జీతో కళాత్మకంగా డాన్స్ చేసే నైపుణ్యం ఎన్టీఆర్ సొంతం. ఎన్టీఆర్ డాన్స్ చేస్తే థియేటర్స్ లో విజిల్స్ మోతమోగాల్సిందే. అలాంటి ఎన్టీఆర్ డాన్స్ షోకు అతిధిగా వెళితే జోష్ మరింత పెరగడం ఖాయం. ప్రస్తుతం పాపులర్ డాన్స్ షో ఢీ 10 ఫైనల్స్ జరుగుతున్నాయి. ఫైనల్స్ కు ఎన్టీఆర్ అతిధిగా హాజరయ్యాడు. దానికి సంబందించిన ఫోటోలు, దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఉత్సాహభరితంగా
ఎన్టీఆర్ ఢీ ఫైనల్స్ లో ఉత్సాహ భరితంగా పాల్గొన్నాడు. ఢీ 10 షో కు ప్రియమణి, శేకర్ మాస్టర్ జడ్జీలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ షోకి హాజరు కాగానే అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఈ ఎపిసోడ్ నేడు ప్రసారం కానుంది. షోకి సంబందించిన ప్రోమో సోషల్ మీయదలో వైరల్ గా మారింది.
రెండు కళ్ళుసరిపోలేదు
కంటెస్టెంట్స్ పెర్ఫామెన్స్ ని ఎన్టీఆర్ బాగా ఎంజాయ్ చేశాడు. జై లవ కుశ చిత్రంలోని స్వింగ్ జరా సాంగ్ పెర్ఫామ్ చేసిన డాన్సర్ ని ఎన్టీఆర్ అభినందించాడు. చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదని వ్యాఖ్యానించాడు.
అదిరిపోయే స్టెప్పులు
కాటెస్టెంట్, శేఖర్ మాస్టర్ తో కలసి ఎన్టీఆర్ స్వింగ్ జరా సాంగ్ కు డాన్స్ చేశాడు. ఎన్టీఆర్ డాన్స్ ని అక్కడున్నవారంతా ఆసక్తికరంగా తిలకించారు.
డాన్సర్లకు సందేశం
ఈ షోలో ఎన్టీఆర్ డాన్సర్లకు తన సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. మంచి డాన్సర్ కావాలంటే.. డాన్స్ చేసే సమయంలో తలపై వెంట్రుక మొన నుంచి అరికాలి గోటి వరకు మొత్తం మన అధీనంలో ఉండాలి. శరీరం మొత్తం డాన్స్ మూమెంట్ కు తగ్గట్లుగా లయబద్దంగా కదలాలని సూచించాడు.