బిగ్‌‌బాస్ రేసులోకి వచ్చిన ఎన్టీఆర్.. ఇలాంటి పరిస్థితుల్లో యంగ్ టైగర్ కు సాధ్యమేనా!

Recommended Video

Bigg Boss 3 Telugu : NTR To Play As A Host ?? | Filmibeat Telugu

గత కొన్ని రోజులుగా తెలుగు బిగ్ బాస్ 3 సీజన్ గురించి అనేక ఉహాగానాలు వినిపిస్తున్నాయి. సీజన్1, 2 లకు మంచి రెస్పాన్స్ రావడంతో బిగ్ బాస్ 3 మరింత ఆకట్టుకునే విధంగా ఉండాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఎన్టీఆర్ షోని నడిపించిన విధానానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత అదే జోరుని నాని కొనసాగించాడు. కొన్ని విమర్శలు వినిపించినా అది పెద్ద సమస్య కాలేదు. కాగా ఈ ఏడాది ప్రారంభం కాబోయే సీజన్ 3కి హోస్ట్ ఎవరనే ఉత్కంఠ అందరిలో నెలకొని ఉంది.

వాళ్ళిద్దరి పేర్లు జోరుగా

వాళ్ళిద్దరి పేర్లు జోరుగా

బిగ్ బాస్ 3 కోసం సీనియర్ నటుడిని హోస్ట్ గా తీసుకోవాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఫేమ్, సీనియారిటీ రెండు ఉన్న నటుడు ఎవరని పరిశీలించగా బిగ్ బాస్ నిర్వాహకులలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ పేర్లు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరిని బిగ్ బాస్ టీం సంప్రదించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు కేవలం రూమర్ మాత్రమే అని వెంకటేష్ ఇటీవల క్లారిటీ ఇచ్చారు.

 రేసులోకి మళ్ళీ యంగ్ టైగర్

రేసులోకి మళ్ళీ యంగ్ టైగర్

తాజాగా బిగ్ బాస్ 3 కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ప్రచారంలోకి వచ్చింది. సీజన్ 1 ని ఎన్టీఆర్ విజయవంతంగా నడిపించాడు. దీనితో మరోమారు ఎన్టీఆర్ నే రంగంలోకి దించితే బావుంటుందని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. కానీ ఎన్టీఆర్ అంగీకరిస్తాడా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు.

 రాజమౌళి సినిమా అంటే

రాజమౌళి సినిమా అంటే

రాజమౌళి సినిమా అంటే హీరోలకు క్షణం తీరిక ఉండదు. కాల్షీట్స్ ఎక్కువగా కేటాయించాల్సి ఉంటుంది. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో రాజమౌళి మరింతగా జాగ్రత్త తీసుకుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకు సమయం కేటాయించలేక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ ఏడాది జూన్ నుంచి బిగ్ బాస్ 3 ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఊహాగానాలు మాత్రమే

ఊహాగానాలు మాత్రమే

ఇటీవల బిగ్ బాస్ 3 పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ కొంతమంది సెలెబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో రేణు దేశాయ్, శోభిత ధూళిపాల, జబర్దస్త్ నరేష్, వరుణ్ సందేశ్ ఇలా పలువురి పేర్లు ప్రచారం జరుగుతున్నాయి. ఇప్పటికైతే ఇది ప్రచారం మాత్రమే. రాబోవు రోజుల్లో బిగ్ బాస్ 3 గురించి మరిన్ని విషయాలు తెలియనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X