జూ ఎన్టీఆర్ మాట వినాల్సింది.. బిగ్ బాస్ తర్వాత కెరీర్ నాశనం.. సంపూ ఆవేదన
టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ డమ్ దక్కించుకున్నారు సంపూర్ణేశ్ బాబు. ఈయన అసలు పేరు నర్సింహాచారి. స్క్రీన్ నేమ్ మాత్రం సంపూర్ణేశ్ బాబు అని పెట్టుకున్నారు. తెలుగు సినిమాల స్పూఫ్ వీడియోలను చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతో టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ 'మహాత్మ' సినిమాలో చిన్న పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏకంగా హీరోగా 'హృదయ కాలేయం' అనే చిత్రంతో వెండితెరపైకి వచ్చారు. సంపూగా పరిచయమై ప్రేక్షకులను అలరించారు. తొలిచిత్రంతోనే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. కామెడీ హీరోగా ప్రశంసలు అందుకున్నారు.
మొదటి చిత్రం 'హృదయ కాలేయం' గ్రాండ్ సక్సెస్ కావడంతో వరుసగా సినిమాల్లో ఆఫర్లు అందాయి. 'కరెంట్ తీగ', 'పెసరట్టు' వంటి చిత్రాల్లో క్యామియో రోల్స్ లో కనిపించి మరింత సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత 'బందిపోటు', 'సింగం 123', 'వేర్ ఈజ్ విద్యా బాలన్', లచ్చిందేవికి ఓ లెక్కుంది, కొబ్బరిమట్ట, బజార్ రౌడీ, కాలీఫ్లవర్, చోర్ బజార్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే ఆయన సినిమాల్లో 'హృదయ కాలేయం' తర్వాత అంతటి సక్సెస్ ను మరే చిత్రం అందించలేకపోయింది. ఇక చివరిగా వచ్చిన 'మార్టిన్ లూథర్ కింగ్' చిత్రం పర్లేదనిపించింది.
అయితే, సంపూర్ణేశ్ బాబు టాలీవుడ్ లో ఒక వెలుగొందుతాడని అంతా భావించారు. ఓవైపు అనుకున్నంత అవకాశాలు వచ్చినా మాత్రం నెక్ట్స్ లెవల్ కు వెళ్లలేకపోయారు. అయినా ఇప్పటికీ డిఫరెంట్ డిఫరెంట్ జోనర్లలో చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, సంపూర్ణేశ్ బాబు కెరీర్ ను టర్న్ చేసే అవకాశం ఒకటి కెరీర్ లో వచ్చిందని ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఏకంగా జూనియర్ ఎన్టీఆరే తనకు మోటీవేషన్ ఇచ్చినా వినిపించుకోలేదని తానే స్వయంగా చెప్పుకొచ్చారు. అప్పుడు తారక్ అన్న మాటలు విని ఉంటే మాత్రం ఇప్పుడు కెరీర్ మరోలా ఉండేదాని చెప్పుకొచ్చాడు. తన తప్పును గుర్తు చేసుకున్నాడు.

టెలివిజన్ రంగంలో సంచలనంగా మారిన 'బిగ్ బాస్ తెలుగు' రియాలిటీ షోకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షోకు సెపరేట్ ఆడియెన్స్ కూడా ఉన్నారు. తమ అభిమాన సెలబ్రెటీలను హౌజ్ లో చూసేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఆశిస్తుంటారు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో మొదటి కంటెస్టెంట్ గా సంపూర్ణేష్ బాబుకు అవకాశం దక్కింది. కానీ సంపూర్ణేశ్ బాబు మాత్రం కేవలం 9 రోజులు మాత్రం హౌజ్ లో ఉండి బయటికి వచ్చేశారు. అప్పట్లో ఈ వార్త హాట్ టాపిక్ గ్గా మారింది.
అప్పుడు బిగ్ బాస్ హౌజ్ నుంచి వచ్చేప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వెళ్లొద్దని సంపూర్ణేశ్ బాబుకు చెప్పారంట. ఈ షో తర్వాత మంచి అవకాశాలు, కెరీర్ టర్నింగ్ పాయింట్ కూడా ఉండబోతుందని వివరించాడంట. అప్పుడు హౌజ్ లో ఉండి ఉంటే మాత్రం బిగ్ బాస్ మొదటి సీజన్ లో విన్నర్ గా నిలిచేవాడినని, టెలివిజన్ రంగంలో అదొక హిస్టరీగా ఉండేదని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ బాధపడుతున్నారు. ఇక మళ్లీ బిగ్ బాస్ హౌజ్ లో మళ్లీ అవకాశం వస్తే వెళ్తారా? అని ప్రశ్నించగా.. ఇప్పుడు కూడా వెళ్లలేనని, తనకు పల్లె వాతావరణం అలవాటైంది.
హౌజ్ లో బంధించిన ఫీలింగ్ ఉంటుందని అది తట్టుకోలేనని వివరించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ తనను ఎంతగానో ప్రోత్సహించారని చెప్పారు. ఆయన మాటలు విని హౌజ్ లో ఉండింటే ఈరోజు పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. ప్రస్తుతం ఆయన మాటలు హాట్ టాపిక్ గ్గా మారాయి. ఇక సంపూర్ణేశ్ బాబు తన హిట్ ఫిల్మ్ 'హృదయ కాలేయం'కు సీక్వెల్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో దీనిపై మరిన్ని అప్డేట్స్ కూడా రానున్నాయి.


Click it and Unblock the Notifications











