బిగ్‌బాస్2ను రక్షించేందుకు ఎన్టీఆర్.. పావులు కదుపుతున్న నిర్వాహకులు!
Recommended Video

తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షోకు అత్యంత ప్రజాదరణ తెచ్చిన ఎన్టీఆర్ మరోసారి తన మ్యాజిక్‌ను రిపీట్ చేయనున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. బిజీ షెడ్యూల్ కారణంగా తెలుగు బిగ్‌బాస్‌కు ఎన్టీఆర్ దూరంగా ఉండటంతో ఆ స్థానంలో నేచురల్ స్టార్ నాని ఎంపిక చేశారు. అయితే హోస్ట్‌గా నానిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సదరు టెలివిజన్ ఛానెల్ రేటింగ్స్ ఒడిదుడుకులకు లోనవుతున్నట్టు సమాచారం.

ఎన్టీఆర్ హోస్ట్‌గా
ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ ప్రారంభ ఎపిసోడ్‌కు 16.18 రేటింగ్ వచ్చింది. తొలివారానికి 9.24 రేటింగ్స్‌తో జూనియర్ ఎన్టీఆర్ బ్రహ్మండంగా సెటిల్ అయ్యాడు. అంతేకాకుండా సెలబ్రిటీల ఎంపిక కూడా జూనియర్ కరిష్మాకు తోడైంది.

నాని హోస్ట్‌గా
ఇక నాని హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ ప్రారంభ ఎపిసోడ్‌కి 15.05 రేటింగ్ నమోదైంది. తొలివారంలో 7.93తో ఒకే అనిపించాడు. ఓవరాల్‌గా బిగ్‌బాస్2 కార్యక్రమానికి నాని హోస్ట్‌గా తొలివారం బాగానే నెట్టుకొచ్చారనే అభిప్రాయం నెలకొన్నది.

రెండోవారంలో రేటింగ్స్
అయితే సెలబ్రిటీల ఎంపికపై ప్రేక్షకులు పెదవి విరిచిన నేపథ్యంలో బిగ్‌బాస్ షోపై కొంత ప్రతికూల ప్రభావం పడింది. దాంతో రెండో వారంలొ కొంత రేటింగ్స్ విషయంలో తేడా రావడంతో జరుగబోతున్న డామేజ్‌ను కంట్రోల్ చేసే పనిలో నిర్వాహకులు ఉన్నారు.

గెస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్
బిగ్‌బాస్2 షోకు రేటింగ్స్ అంతగా నమోదు కాకపోతున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌ను ఓసారి గెస్టుగా హౌస్‌కు రప్పించే పనిలో ఉన్నారు. త్వరలోనే బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎన్టీఆర్ రంగ ప్రవేశం చేసి హల్‌చల్ చేసేందుకు రెడీ అవుతున్నారట. ఒకవేళ అదే నిజమైతే ఆ వారం ఎపిసోడ్స్ మంచి ర్యాంకింగ్, ప్రేక్షకులకు జోష్ లభించే అవకాశం లేకపోలేదు.

ఎన్టీఆర్ హంగామా
బిగ్‌బాస్ ఇంట్లో జూనియర్ ఎన్టీఆర్.. అలాగే హోస్ట్‌గా నాని ఉంటే ప్రేక్షకులకు పండుగే పండుగ అంటున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళితే ఇంటి సభ్యులకు తారక్ స్ఫూర్తిదాయకంగా వ్యవహరించడం ఖాయం. మరోసారి ఇంటిలో వంట చేసే హంగామా చేస్తాడా లేదా అని వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











