For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  EMK with Mahesh babu: ఎన్టీఆర్ షోలోకి ఖరీదైన టీషర్ట్ తో మహేష్.. నా రాజా అంటూ తారక్ అల్లరి!

  |

  టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలు కూడా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి చాలా విభిన్నమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆ విషయంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు అని చెప్పవచ్చు. మొదట బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ తో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు. ఇక ఆ తర్వాత సినిమాలతో బిజీగా ఉండడంతో ఆ కాంట్రవర్సీ షోను బ్యాలెన్స్ చేయలేకపోయాడు.

  ఇక ఈసారి ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ గా ప్రేక్షకులను ఆకట్టుకుని ఎవరు మీలో కోటీశ్వరులు అనే మంచి షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సారి మహేష్ బాబు స్పెషల్ ఎట్రాక్షన్ గా షోలోకి రాబోతున్నాడు. అందుకు సంబంధించిన ప్రోమో తో పాటు మహేష్ టీషర్ట్ ఖరీదు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  కాంట్రవర్సీ లేకుండా..

  కాంట్రవర్సీ లేకుండా..

  జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1 ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు అలాంటి కాంట్రవర్సీ షో తెలుగులో సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో మంచి హోస్టింగ్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు.

  జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లో ఎక్కువగా బిజీగా ఉండటం వలన ఆ కాంట్రవర్సీ షోను తగిన విధంగా బ్యాలెన్స్ చేయలేకపోయాడు. ఇక ఈసారి ఎలాంటి వివాదాలు లేకుండా అందరికీ విజ్ఞానాన్ని అందించే ఎవరు మీలో కోటీశ్వరులు షోతో సరికొత్తగా ఆకట్టుకోవాలని ప్రయత్నం చేశాడు.

  స్టార్ సెలబ్రెటీలు స్పెషల్ ఎట్రాక్షన్ గా..

  స్టార్ సెలబ్రెటీలు స్పెషల్ ఎట్రాక్షన్ గా..

  ఎవరు మీలో కోటీశ్వరులు అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సాధారణ జనాలతో పాటు పలువురు స్టార్ సెలబ్రెటీలు కూడా ఈ ఆటలో ప్రత్యేకంగా పాల్గొనడంతో షోకు మంచి హైప్ అయితే వచ్చింది. మొదటి వారం రామ్ చరణ్ రాగా ఆ తరువాత కొరటాల శివ రాజమౌళి వచ్చారు. ఇక స్టార్ హీరోయిన్ సమంత అలాగే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తమన్ ఇద్దరూ కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు.

  మొదటిసారి మహేష్ బాబు

  మొదటిసారి మహేష్ బాబు

  ప్రతి వారం ఎవరో ఒక టాప్ సెలబ్రిటీతో జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.. ఇక త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా తారక్ సందడి చేయబోతున్నట్లు ఇటీవల ప్రోమోతో క్లారిటీ వచ్చేసింది. సాధారణంగా మహేష్ బాబు ఇప్పటివరకు రియాలిటీ షోల్లో అయితే పెద్దగా పాల్గొన్నది లేదు.. ఇక మొదటి సారి జూనియర్ ఎన్టీఆర్ అడగగానే ఒక సోదరభావంతో ఎవరు మీలో కోటీశ్వరులు ఆటను ఆడేందుకు వచ్చారు.

  మహేష్ తో తారక్ అల్లరి

  మహేష్ తో తారక్ అల్లరి

  త్వరలోనే ప్రసారం కాబోయే ఈ ఎపిసోడ్ పై అభిమానులలో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఎపిసోడ్ కు సంబంధించిన ఒక ప్రోమోను కూడా సోషల్ మీడియా లో విడుదల చేశారు. స్పెషల్ ఎపిసోడ్ లో జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు మధ్య ఆహ్లాదకరమైన వినోదం కొనసాగినట్లు అర్థమవుతోంది. మహేష్ అన్న అంటూ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబును స్వాగతించడం నుంచి 'నా రాజా' అంటూ ఆటపట్టించడం వరకు కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. మహేష్ బాబు కూడా తన సెన్సాఫ్ హ్యూమర్ ను తారక్ మీద చూపించినట్లు అర్థమవుతోంది.

  Damu Balaji At Nayeem Diaries Movie Trailer Launch Event
  మహేష్ ఖరీదైన టీ షర్ట్

  మహేష్ ఖరీదైన టీ షర్ట్

  అయితే ఈ షో లో ఒక ప్రత్యేకమైన విశేషం కూడా ఉంది. మహేష్ బాబు వేసుకొచ్చిన టీ షర్ట్ ఖరీదు ఎంత అనే విషయంలో అనేక రకాల కామెంట్స్ అయితే వెలువడుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. స్కాచ్ అండ్ సోడా కు చెందిన ఆ టీ షర్ట్ ఖరీదు దాదాపు 12 వేల వరకు ఉంటుందని కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేసుకుంటున్నారు. మరి ఈ ఎపిసోడ్ టెలివిజన్ రంగంలో ఎలాంటి రేటింగ్స్ ను అందుకుంటుందో చూడాలి.

  English summary
  Jr ntr evaru meelo koteeswarulu with Mahesh babu special episode
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X