twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్లీ హోస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్.. నాగార్జునకు చెక్.. యంగ్ టైగర్‌కు రెమ్యునరేషన్‌ ఎంతంటే!

    |

    వెండితెరపైనే కాకుండా బుల్లితెర మీద విశేషంగా ఆకట్టుకొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి హోస్ట్‌గా కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. గతంలో బిగ్‌బాస్ కోసం హోస్ట్‌గా మారిన ఎన్టీఆర్ విశేషంగా అభిమానుల ఆదరణను చూరగొన్న విషయం తెలిసిందే. గత రెండు సంవత్సరాలుగా బుల్లితెరకు దూరమైన ఆయనను మరోసారి రికార్డు స్థాయి టీఆర్పీని సాధించేందుకు ప్రముఖ టెలివిజన్ సంస్థ రంగం సిద్ధం చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

    బుల్లితెరపై ఎన్టీఆర్ హంగామా

    బుల్లితెరపై ఎన్టీఆర్ హంగామా

    తెలుగులో బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రారంభించిన సమయంలో సీజన్ 1 కోసం ఎన్టీఆర్ హోస్ట్‌గా బుల్లితెర మీద ప్రత్యక్షం అయ్యారు. కేవలం హోస్ట్‌గానే కాకుండా బిగ్‌బాస్ షోకు అనూహ్యమైన పాపులారిటీని, క్రేజ్‌ను సంపాదించి పెట్టారు. ఆ తర్వాత బిగ్‌బాస్ రియాలిటీ షోకు దూరం కావడంతో రెండో సీజన్‌కు నాని, ఆ తర్వాత అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

    దారుణమైన రేటింగ్‌తో మీలో ఎవరు కోటీశ్వరుడు

    దారుణమైన రేటింగ్‌తో మీలో ఎవరు కోటీశ్వరుడు

    అయితే మీలో కోటీశ్వరుడు రియాలిటీ షోకు హిందీలో అత్యంత టీఆర్పీ రేటింగ్ ఉన్నప్పటికీ.. తెలుగులో మాత్రం ప్రేక్షకుల ఆదరణను పొందడంలో దారుణంగా విఫలమైంది. తొలుత అక్కినే నాగార్జున కొంతలో కొంత బెటర్ రేటింగ్‌ను సాధించగా.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించిన సీజన్‌కు దారుణమైన రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. దాంతో అన్ని రకాల క్రేజ్ ఉన్న ఎన్టీఆర్‌ను బరిలోకి దించేందుకు చేసిన ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి.

    కేబీసీ తెలుగుకు ఎన్టీఆర్ హోస్ట్‌గా

    కేబీసీ తెలుగుకు ఎన్టీఆర్ హోస్ట్‌గా

    ఇక తాజాగా బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా కాకుండా అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోకు తెలుగు వెర్షన్ మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అయితే ఎన్టీఆర్‌ను ఒప్పించడంలో జెమినీ టెలివిజన్ తనదైన శైలిలో పావులు కదిపినట్టు సమాచారం. అయితే తనకు ఉన్న సినిమా కమిట్‌మెంట్స్ కారణంగా తొలుత అంగీకరించలేదనేది సమాచారం.

    కొత్త టైటిల్.. సరికొత్త మేకోవర్‌తో

    కొత్త టైటిల్.. సరికొత్త మేకోవర్‌తో

    ఇక మీలో ఎవరు కోటీశ్వరుడు ఎపిసోడ్‌ను సరికొత్త ఫార్మాట్‌లో తెరపైకి తెచ్చేందుకు ప్లాన్ చేశారు. గేమ్ ఫార్మాట్‌ను పూర్తిగా మార్చివేసినట్టు, మరింత ఆకర్షణీయంగా డిజైన్ చేసినట్టు సమాచారం. అయితే మీలో ఎవరు కోటీశ్వరుడు టైటిల్‌ను కూడా మార్చి.. సరికొత్త టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ మేరకు యూత్‌ను ఆకర్షించే విధంగా గేమ్‌ను రూపొందించినట్టు తెలుస్తున్నది.

    భారీ రెమ్యునరేషన్‌తో

    భారీ రెమ్యునరేషన్‌తో

    ఇక మీలో ఎవరు కోటీశ్వరుడు టైటిల్ మార్పుతో రానున్న కౌన్ బనేగా కరోడ్‌పతి తెలుగు వెర్షన్‌కు ఎన్టీఆర్ భారీగా రెమ్యునరేషన్ అందుకొన్నట్టు సమాచారం. తెలుగులో ఏ హీరో ఇప్పటి వరకు అందుకోనంతగా పారితోషికాన్ని ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఈ రెమ్యునరేషన్ విషయం బుల్లితెర చరిత్రలోనే మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

    Recommended Video

    #ThisHappened2019 : Best Tollywood Movies Of 2019 || Filmibeat Telugu
    స్టార్ మా లో కాకుండా జెమినీలో

    స్టార్ మా లో కాకుండా జెమినీలో

    ఇక ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించబోయే ఈ సరికొత్త కేబీసీ తెలుగు వెర్షన్ స్టార్ మా టీవి నుంచి వేరే ఛానెల్‌కు షిఫ్ట్ కావడం కూడా చర్చనీయాంశమైంది. తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ పొజిషన్ కోసం ఛానెల్స్ మధ్య పోటీ జరుగుతున్న నేపథ్యంలో ఈ బ్రాండ్ న్యూ షోను జెమినీ చానెల్‌ దక్కించుకోవడం ఆసక్తికరంగా మారింది. దీంతో తెలుగు బుల్లితెర రంగంలో కొత్త పోటీకి తెర లేచిందనే మాట వినిపిస్తున్నది.

    English summary
    Popular Reality Show Kaun Banega Crorepati telugu version Meelo Evaru Koteeswarudu's fans has good news. This show coming with new format on Gemini Entertainment Channel. Young tiger NTR is going to host this show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X