మరోసారి హోస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్.. ప్లాన్ సెట్ చేసుకున్న ప్రముఖ TV ఛానెల్
ఆల్ రౌండర్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరోసారి టెలివిజన్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించబతున్నట్లు తెలుస్తోంది. గతంలో బిగ్ బాస్ షోకు హోస్ట్ గా శ్రీకారం చుట్టిన తారక్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు మరోసారి అంతకంటే ఎక్కువ స్థాయిలో అలరించడానికి సిద్ధమవుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో బలమైన టాక్ వినిపిస్తోంది.

బలమైన పునాది వేసిన ఎన్టీఆర్
మొదట్లో బిగ్ బాస్ తెలుగులో హిట్ అవుతుందో లేదో అనే అనుమానాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ సీజన్ ను సక్సెస్ చేసి బలమైన పునాది వేశాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఒకేసారి రియాలిటీ షో అలాగే షూటింగ్ అనేసరికి కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండింటికి న్యాయం చేసినప్పటికి పర్సనల్ లైఫ్ కు ఎక్కువగా స్పేస్ కేటాయించలేక మొదటి సీజన్ తోనే ఎండ్ కార్డ్ పెట్టేశాడు.

గత ఏడాది నుంచి తారక్ వెంట పడుతున్నారట
ఇక బిగ్ బాస్ షో ఆ తరువాత వరుసగా మూడు సీజన్స్ ను పూర్తి చేసుకోగా ప్రతి సీజన్ కు తారక్ వచ్చే అవకాశం ఉందని రూమర్స్ వచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ అని తెలియాడానికి ఎక్కువ రోజులు సమయం పట్టలేదు. అయితే బిగ్ బాస్ లాంటి షో కాకుండా ఏదైనా టాక్ షో చేస్తే బావుంటుందని ఎన్టీఆర్ అనుకున్నారట. ఇక గత ఏడాది నుంచి జెమిని టీవీ వాళ్ళు ఆ విషయంపై తారక్ వెంట పడుతున్నట్లు తెలుస్తోంది.

అన్నపూర్ణ స్టూడియోస్ లోనే..
ఇక ఫైనల్ గా జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ప్లాన్ రెడీ చేసుకోమ్మని చెప్పగా షో నిర్వహుకులు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏకంగా రెండు ఫ్లోర్స్ ను బుక్ చేసినట్లుగా పక్కా సమాచారం అయితే అందుతోంది. భారీ సెట్ నిర్మించేందుకు సిద్దనైనట్లుగా ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా కొన్ని రూమర్స్ వైరల్ గా మారాయి.
Recommended Video

షో ఎలా ఉండబోతోందంటే..
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక టాక్ షోను ఎలా ప్లాన్ చేస్తున్నారో తెలియదు గాని శని ఆదివారాల్లో తారక్ రెండు గంటల సనాయన్ని కేటాయిస్తే చాలాట. షో కోసం ఎక్కువగా కష్టపడే అవకాశం కూడా లేదని టాక్ అయితే వస్తోంది. అందుకే తారక్ ఈజీగా ఒప్పేసుకున్నాడట. షోను కొనసాగిస్తూనే షూటింగ్స్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఆ షో గురించి మరిన్ని వివరాలు తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











