Jr NTR: మరో రియాలిటీ షోకు హోస్ట్ కాబోతున్న తారక్.. ఆ చానల్ తో బిగ్ ప్లాన్!
RRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ మూవీలో తారక్ పర్ఫార్మెన్స్ కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో క్రేజ్ మరింతగా పెరిగింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తీయబోయే సినిమాలపై భారీగా అంచనాలు ఉన్నాయి.
అలాగే ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై కూడా సందడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక టెలివిజన్ షో నిర్వాహకులతో చర్చలు స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎన్టీఆర్ 30 తరువాత: మోస్ట్ అవైటెడ్ హిట్ కాంబో అయిన కొరటాల శివతో కలిసి NTR30 చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. దీని తర్వాత అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ మెగా ప్రాజెక్టు వార్-2 లో ఎన్టీఆర్ నటించడం దాదాపు ఫిక్సైపోయింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

బుల్లితెరపై ప్లాన్ వేసిన తారక్: అయితే ఇవన్నీ పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న సినిమాలు. ఇవి కంప్లీటై విడుదల కావడానికి కొంత వేచి ఉండక తప్పదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ను స్క్రీన్ పై చూడటానికి మాత్రం ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేనట్లుగానే కనిపిస్తోంది. అన్ని సవ్యంగా జరిగితే తారక్ ను త్వరలోనే స్మాల్ స్క్రీన్ పై చూడొచ్చు.

గతంలో చేసినప్పటికీ.: జూనియర్ ఎన్టీఆర్ గతంలో బిగ్ బాస్ రియాల్టీ షోకు హోస్ట్ గా చేశాడు. తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఎంతో ఆకట్టుకున్నాడు. ఆ ఇయర్ బిగ్ బాస్ షో సూపర్ సక్సెస్ అయింది. కానీ మళ్ళీ తారక్ అటు వైపు చూడలేదు. సినిమా షూటింగ్స్ బిగ్ బాస్ షూట్ ను బ్యాలెన్స్ చేయలేకపోయాడు. ఇక ఆ తర్వాత జెమినీలో వచ్చిన ఎవరు మీలో కోటీశ్వరుడు కూడా చేశాడు. తన గ్రేస్ తో ఏమాత్రం బోర్ కొట్టకుండా ప్రోగ్రామ్ హోస్ట్ చేసి మంచి మార్కులే కొట్టేశాడు.

కొత్త షో స్టార్ట్ కాబోయేది ఎప్పుడు?: ఈ తర్వాత తారక్ స్మాల్ స్క్రీన్ పైకి మళ్లీ రాలేదు. ఇప్పుడు మరో షోకు హోస్ట్ చేయడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తారక్ తో షో చేయడానికి ఈటీవీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ టాక్ షో కాన్సెప్ట్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారట.
ఈ టాక్ షో ఈ ఏడాది చివర్లో నవంబర్ లో ప్రారంభం కావొచ్చని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల కోసం ఎక్కువ సమయం తీసుకున్నా కూడా ఈ షోల ద్వారా మళ్ళీ వారికి దగ్గర కావచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో..


Click it and Unblock the Notifications











