‘ఎవరు మీలో కోటీశ్వరులు’ నుంచి ఊహించని న్యూస్: ఎన్టీఆర్ సంచలన నిర్ణయం.. వాళ్ల ఎంట్రీపై రాని స్పష్టత

కొంత కాలంగా వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ జోష్‌లోనే కొత్త సినిమాలను ఒక్కక్కటిగా లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇప్పటికే RRRలో నటిస్తోన్న అతడు.. మరికొన్ని ప్రాజెక్టులను కూడా ప్రకటిస్తున్నాడు. అదే సమయంలో బుల్లితెరపైకి రీఎంట్రీ ఇవ్వడం కోసం 'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే షోను సైతం చేయడానికి డిసైడ్ అయ్యాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోలు కూడా విడుదలయ్యాయి. కొద్ది రోజుల్లో ఈ షో ప్రారంభం అవుతుంది అనగా.. ఓ ఊహించని న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం

సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం

కొంత కాలంగా వరుస హిట్లతో సత్తా చాటుతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న RRRలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో తారక్.. కొమరం భీంగా, చరణ్.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

బుల్లితెరపైకి అలా ఎంట్రీ ఇచ్చిన జూనియర్

బుల్లితెరపైకి అలా ఎంట్రీ ఇచ్చిన జూనియర్

సినిమాల పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్.. బిగ్ బాస్ అనే షోకు హోస్టుగా చేసిన విషయం తెలిసిందే. యాంకర్‌గా మొదటి ప్రయత్నమే అయినా.. దీన్ని విజయవంతంగా నడిపించాడు. అంతేకాదు.. అద్భుతమైన హోస్టింగ్‌తో కొత్త వన్నెను తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే బిగ్ బాస్‌ను సూపర్ సక్సెస్ చేశాడీ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్.

మరో షోతో రాబోతున్న నందమూరి హీరో

మరో షోతో రాబోతున్న నందమూరి హీరో

దాదాపు 120 దేశాల్లో ప్రసారం అవుతూ తెలుగులో కూడా వచ్చిన షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఇది.. ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. అన్ని భాషల్లో మాదిరిగానే మన దగ్గర కూడా ఈ షో సూపర్ సక్సెస్ అయింది. ఇందులో మొదటి మూడింటికీ అక్కినేని నాగార్జున.. నాలుగో దానికి మెగాస్టార్ చిరంజీవి హోస్టులుగా చేశారు.

ఐదో సీజన్ కోసం అన్నీ కొత్త ప్లాన్ చేశారు

ఐదో సీజన్ కోసం అన్నీ కొత్త ప్లాన్ చేశారు


'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షో నాలుగు సీజన్లు స్టార్ మా చానెల్‌లో ప్రసారం అయిన విషయం తెలిసిందే. దీని ద్వారా సదరు చానెల్‌కు భారీ స్థాయిలో రేటింగ్ వచ్చింది. అప్పట్లో ఇదే నెంబర్ వన్ గేమ్ షోగా ఉండేది. కానీ, అక్కడితోనే దీని ప్రస్థానం ఆగిపోయింది. ఇక, ఈ సారి ఈ గేమ్ షో జెమినీ టీవీలో ప్రసారం కాబోతుంది. దీనికి 'ఎవరు మీలో కోటీశ్వరులు' అని టైటిల్ మార్చారు.

ఆట నాది కోటి మీది అంటూ ఆశలు నిజం

ఆట నాది కోటి మీది అంటూ ఆశలు నిజం

ఇటీవల జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ప్రోమోను విడుదల చేశారు. 'మీ జీవితాలని మార్చే గేమ్ షో.. మీ ఆశలని నిజం చేసే గేమ్ షో ''ఎవరు మీలో కోటీశ్వరులు'' త్వరలో మీ జెమినీ టీవీలో రాబోతుంది సిద్ధంగా ఉండండి' అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అలాగే, 'ఆట నాది.. కోటి మీది' అంటూ ఎన్టీఆర్ ప్రోమోను కూడా వదిలారు.

‘ఎవరు మీలో కోటీశ్వరులు’ లేటెస్ట్ న్యూస్

‘ఎవరు మీలో కోటీశ్వరులు’ లేటెస్ట్ న్యూస్

ప్రస్తుతం కరోనా ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎక్కువగా చూపిస్తోంది. దీంతో సినిమా షూటింగులు అన్నీ నిలిచిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 'ఎవరు మీలో కోటీశ్వరు' షో ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశాలు లేవన్న టాక్ బాగా వినిపించింది. కానీ, ఈ షో గ్రౌండ్ వర్క్ మాత్రం వేగంగా జరుగుతోందట. ఇందులో భాగంగానే తిరుపతిలో ఆడిషన్స్ కూడా నిర్వహిస్తున్నారని తాజా న్యూస్.

Recommended Video

Pawan Kalyan పై బాబు గోగినేని సెటైర్.. మెగా బ్రదర్ ఫైర్!! || Filmibeat Telugu
ఎన్టీఆర్ సెన్సేషనల్ డెసీషన్.. ఆ విషయంలో

ఎన్టీఆర్ సెన్సేషనల్ డెసీషన్.. ఆ విషయంలో


'ఎవరు మీలో కోటీశ్వరులు' టీమ్ ఆడిషన్స్ నిర్వహించడానికి కారణం ఎన్టీఆర్ తీసుకున్న సంచలన నిర్ణయమే అని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఈ షోలో పాల్గొనేందుకు అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అందుకే పనులు చకచకా జరుగుతున్నాయని టాక్. అయితే, ఇందులోకి ఆడియెన్స్‌ను తీసుకొస్తారా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X