NTR's EMKలో గందరగోళం.. ఇప్పటికే ఎన్టీఆర్‌కు భారీగా రెమ్యునరేషన్.. టెన్షన్‌లో నిర్వాహకులు

అత్యంత ప్రతిష్టాత్మకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ఎవరు మీలో కోటీశ్వరులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయడం అభిమానులను సంతోషానికి గురి చేసింది. అయితే ఈ షోను నిరవధికంగా వాయిదా వేయడంతో ఫ్యాన్స్, బుల్లితెర ప్రేక్షకులు నిరుత్సాహానికి గురయ్యారు. అయితే ఈ షో వాయిదా పడటానికి కారణాలు ఇవే అంటూ మీడియాలో వస్తున్న రూమర్లు, ఊహగానాలకు తెరవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ షో ఎప్పుడు ప్రారంభమవుతుందంటే...

ఎన్టీఆర్ హోస్ట్‌గా భారీ హైప్

ఎన్టీఆర్ హోస్ట్‌గా భారీ హైప్

ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రారంభమయ్యే ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు సంబంధించిన ప్రోమోలు మంచి రెస్సాన్స్‌ను కూడగట్టుకొన్నాయి. అంతేకాకుండా ఆ వీడియోలు వైరల్‌గా మారడంతో షోపై అంచనాలు పెరిగాయి. ఆ క్రమంలో షోను ప్రారంభించడానికి ఎన్టీఆర్‌తో ప్రెస్ మీట్‌ కూడా నిర్వహించారు.

ఎన్టీఆర్‌లో అలాంటి విశ్వాసం

ఎన్టీఆర్‌లో అలాంటి విశ్వాసం

ఎవరు మీలో కోటీశ్వరుడు షో ప్రారంభానికి ముందు ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. తప్పకుండా ఈ షో విజయవంతం అవుతుందనే విశ్వాసాన్ని ప్రకటించారు. ఈ రియాలిటీ షోను ప్రేక్షకులు మెప్పించేలా డిజైన్ చేశారు అంటూ తన అభిప్రాయాన్ని ఎన్టీఆర్ చెప్పారు. అయితే అనూహ్యంగా ఈ షో వాయిదా పడటం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

కరోనావైరస్ బారిన యంగ్ టైగర్

కరోనావైరస్ బారిన యంగ్ టైగర్

ఎవరు మీలో కోటిశ్వరుడు షో ప్రారంభానికి కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కావడం, అలాగే స్వయంగా ఎన్టీఆర్ కోవిడ్ బారిన పడటం ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది. అయితే అందరూ అనుకొంటున్నట్టుగా ఆగస్టులో ఈ ప్రారంభమయ్యే అవకాశమే లేదంటూ సినీ, టెలివిజన్ వర్గాలు పేర్కొంటున్నాయి.

 సినిమాలతో బిజీగా ఎన్టీఆర్

సినిమాలతో బిజీగా ఎన్టీఆర్

ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. RRR చిత్ర షూటింగు ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేని పరిస్థితి ఉండగా.. పలు అగ్ర దర్శకుల చిత్రాలకు యంగ్ టైగర్ ఓకే చెప్పారు. కరోనావైరస్ పరిస్థితులు సద్దుమణగిన తర్వాత ఈ సినిమా షూట్స్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఎన్టీఆర్ బిజీగా మారిపోయే అవకాశం ఉంది. డేట్స్, సమయం కేటాయించడం ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదనే మాట వినిపిస్తున్నది.

 ఇప్పటికే ఎన్టీఆర్ భారీ రెమ్యునరేషన్

ఇప్పటికే ఎన్టీఆర్ భారీ రెమ్యునరేషన్

అయితే ఎవరు మీలో కోటీశ్వరుడు షో ప్రారంభం కావడం తప్పనిసరి. అయితే ఎప్పుడనేది ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పలేం. ఇప్పటికే ఎన్టీఆర్‌కు భారీ రెమ్యునరేషన్ చెల్లించారు. ఆ రెమ్యునరేషన్‌కు ప్రతిఫలంగా సానుకూల పరిస్థితులు నెలకొన్న తర్వాత ఎన్టీఆర్ హోస్ట్‌గా ఈ షోను తెరపైకి తెచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Recommended Video

Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
 జూ ఎన్టీఆర్ కెరీర్ ఇలా..

జూ ఎన్టీఆర్ కెరీర్ ఇలా..

నందమూరి తారక రామారావు కెరీర్ విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో RRR చిత్ర షూటింగు సుదీర్ఘంగా కొనసాగుతున్నది. ఈ సినిమా తర్వాత కొరటాల శివతో ఓ చిత్రం, అలాగే కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో మరో సినిమా ప్రారంభం కావాల్సి ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా కొన్ని చిత్రాల గురించి పలువురు నిర్మాతలతో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X