Evaru Meelo Koteeswarulu : మహేష్ తో పాటు మరో స్టార్ హీరో.. ఇక టీఆర్ఫీల ఊచకోతే!

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో జెమిని టీవీలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన కౌన్ బనేగా కరోడ్పతి అనే ప్రోగ్రాంకి తెలుగు వర్షన్ గా రూపొందిన ఈ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ షోకి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా రాజమౌళి కొరటాల శివ కూడా హాజరై ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పుడు మరో ఇద్దరు అగ్ర హీరోలు కూడా హాజరు కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

సెలబ్రిటీ గెస్ట్ ఉండేలా

సెలబ్రిటీ గెస్ట్ ఉండేలా

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షో ప్రసారం కాకుండా జెమినీ టిఆర్పి రేటింగ్స్ చాలా దారుణంగా ఉండేది. కానీ ఈ షో ప్రారంభమైన తర్వాత మిగతా ఎంటర్టైన్మెంట్ చానల్స్ తో పాటుగా టిఆర్పి రేటింగ్స్ వస్తున్నాయి. ఈ షో మొదటి కర్టెన్ రైజర్ ఈవెంట్ రామ్ చరణ్ తో ప్లాన్ చేయి రామ్ చరణ్ తో ప్లాన్ చేయగా ఆ మొదటి ఎపిసోడ్ కి మంచి రేటింగ్ వచ్చింది. దీంతో మీలో ఎవరు కోటీశ్వరులు నిర్వాహకులు ప్రతివారం ఎవరో ఒక సెలబ్రిటీ గెస్ట్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు.

ముందు చరణ్ తర్వాత

ముందు చరణ్ తర్వాత


మొదటి వారంలో రామ్ చరణ్ తేజ సందడి చేయగా ఇప్పుడు మూడో వారంలో రాజమౌళి, కొరటాల శివ ఇద్దరు హాజరై ఎన్టీఆర్ తో పాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఈ షోకి వరుసగా తెలుగులో ఉన్న టాప్ హీరోలు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ షోకి మహేష్ బాబు హాజరయ్యారు అనే ప్రచారం జరుగుతుండగా షూటింగ్ కూడా పూర్తయిందని మహేష్ బాబు ఏకంగా పాతిక లక్షలు గెలుచుకున్నారు అని అంటున్నారు.

ప్రభాస్ కూడా

ప్రభాస్ కూడా

ఇక సెలబ్రిటీ ఎపిసోడ్స్ లో ఉన్న రూల్స్ ప్రకారం సెలబ్రిటీలు ఎంత గెలిచిన అవన్నీ చారిటీకి ఇచ్చే చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా గతంలో పాల్గొన్న సెలబ్రిటీలు సైతం వాటిని చారిటీకి చేశారు. ఇప్పుడు తాజాగా జరుగుతున్న ప్రచారం ఏమిటంటే ఈ షోకి అతిథిగా ప్రభాస్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఒప్పుకున్నా ప్రభాస్

ఒప్పుకున్నా ప్రభాస్


ఇప్పటికే ప్రభాస్ ను ఎవరు మీలో కోటీశ్వరుడు టీమ్స్ సంప్రదించిందని ఎన్టీఆర్తో ప్రభాస్ కి కూడా మంచి సంబంధాలు ఉండడంతో ఆయనకు మాట ఇచ్చేశాడని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస షూటింగ్ లతో బిజీగా ఉండడంతో ఆయనకు కాస్త ఖాళీ అవ్వగానే ఈ షూటింగ్ పనులు ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు.

Recommended Video

RRR కోసం Radhe Shyam Thaggede Ley | Prabhas Vs RRR || Filmibeat Telugu
సినిమాల విషయానికి వస్తే

సినిమాల విషయానికి వస్తే

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అలాగే కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోపక్క కొరటాల శివ మరికొద్ది రోజుల్లో షూటింగ్ ప్రారంభం కాబోతోందని క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం రాధేశ్యామ్ అనే సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ సినిమాతో పాటు ఆయన మరో నాలుగు సినిమాలు కూడా ఒప్పుకున్నారు దీంతో ప్రభాస్ షెడ్యూల్ ఏ మాత్రం ఖాళీ లేకపోవడంతో ఆయన ఎప్పటికప్పుడు బిజీబిజీగా గడుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X