EMK: ఎన్టీఆర్ మీద సమంత ఫైర్.. ముందే చెప్పాలంటూ అలిగి మరీ అప్సెట్!
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో జెమిని టీవీలో ప్రసారం అవుతోంది. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన కౌన్ బనేగా కరోడ్పతి అనే ప్రోగ్రాంకి తెలుగు వర్షన్ గా రూపొందిన ఈ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ షోకి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా రాజమౌళి, కొరటాల శివ కూడా ఒక ఎపిసోడ్ లో హాజరై ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పుడు ఈ షోలో సమంత కూడా కనిపించి ఆశ్చర్యపరిచారు. ఆ వివరాల్లోకి వెళితే

సెలబ్రిటీ గెస్ట్ ప్లాన్
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షో ప్రసారం కాకుండా జెమినీ టిఆర్పి రేటింగ్స్ చాలా దారుణంగా ఉండేవి అయితే ఈ షో ప్రారంభమైన తర్వాత మిగతా ఎంటర్టైన్మెంట్ చానల్స్ తో పాటు మంచి టిఆర్పి రేటింగ్స్ వస్తున్నాయి. ఈ షో మొదటి కర్టెన్ రైజర్ ఈవెంట్ రామ్ చరణ్ తో ప్లాన్ చేయి రామ్ చరణ్ తో ప్లాన్ చేయగా ఆ మొదటి ఎపిసోడ్ కి మంచి రేటింగ్ వచ్చింది.

చరణ్ తో ఓపెనింగ్
దీంతో మీలో ఎవరు కోటీశ్వరులు నిర్వాహకులు ప్రతివారం ఎవరో ఒక సెలబ్రిటీ గెస్ట్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. అలా మూడో వారంలో రాజమౌళి, కొరటాల శివ ఇద్దరు హాజరై ఎన్టీఆర్ తో పాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఈ షోకి వరుసగా తెలుగులో ఉన్న టాప్ హీరోలు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.

వరుస సెలబ్రిటీలు
ఇప్పటికే ఈ షోకి మహేష్ బాబు హాజరయ్యారు అనే ప్రచారం జరుగుతుండగా షూటింగ్ కూడా పూర్తయిందని మహేష్ బాబు ఏకంగా పాతిక లక్షలు గెలుచుకున్నారు అని అంటున్నారు. ఈ ఎపిసోడ్ దీపావళికి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇక సెలబ్రిటీ ఎపిసోడ్స్ లో ఉన్న రూల్స్ ప్రకారం సెలబ్రిటీలు ఎంత గెలిచిన అవన్నీ చారిటీకి ఇచ్చే చేయాల్సి ఉంటుంది.

సమంత ఎంట్రీ
అందులో భాగంగా గతంలో పాల్గొన్న సెలబ్రిటీలు సైతం వాటిని చారిటీకి ఇచ్చేశారు. ఇక తాజాగా ఈ షోకి గెస్ట్ గా హాజరైన సమంత ప్రోమో విడుదల చేశారు. పండుగ స్పెషల్ నేపథ్యంలో ఈ నెల 14న అంటే గురువారం నాడు జెమినీ టీవీలో సమంత స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వనున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా షో ప్రోమో రిలీజ్ చేశారు.
Recommended Video
ఎన్టీఆర్ మీద సీరియస్ అయిన సమంత
ఇక ప్రోమోలో ఎంటర్ అయిన సమంత వస్తూనే ఇక్కడ కూర్చుంటే భయంగా ఉంది అని సమంత అనగా.. అది హాట్ సీట్ అలాగే ఉంటుందని తారక్ బదులివ్వడం ఆసక్తికరంగా ఉంది. ఇక నాకు డబ్బు వద్దులే అని ఒకసారి.. కావాలి అని మరోసారి సమంత అనడం కూడా ప్రోమోలో చూపించారు. ఇక క్విట్ అయిపోతారా అని ఎన్టీఆర్ అడగ్గా... మీరు ఇప్పుడు చెబుతున్నారు, ముందే చెప్పాలి కదా అంటూ సమంత కాస్త కోపం ప్రదర్శించడంతో ప్రోమో ఎండ్ అవుతోంది. మొత్తం మీద ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉండనుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











