For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Evaru Meelo Koteeswarulu August 26th Questions list: ఎన్టీఆర్‌ వీరాభిమాని ఎంత గెలుచుకొన్నారో తెలుసా?

  |

  దేశవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన కౌన్ బనేగా కరోడ్ పతి రియాలిటీ షోకు తెలుగు వెర్షన్ ఎవరు మీలో కోటీశ్వరుడు ఎన్టీఆర్ హోస్ట్‌గా ఘనంగా ప్రారంభమైంది. రాంచరణ్ కర్టెన్ రైజర్ తర్వాత రెండో రోజు గురువారం ఎపిసోడ్‌ మంచి వినోదాన్ని పంచింది. ఆగస్టు 26వ తేదీ ఎపిసోడ్ ఎలా సాగిందంటే..

  ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్‌లో

  ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్‌లో

  ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్‌లో కంటెస్టెంట్లకు ఎన్టీఆర్ కింది ప్రశ్నను వేశారు.

  I. ఈ ఐపీఎల్ జట్లని, వాటి పేర్లలోని ప్రదేశాల ఆధారంగా ఉత్తరం నుంచి దక్షిణం దిక్కుకు అమర్చండి
  A. రాజస్థాన్ రాయల్స్
  B. సన్‌రైజర్స్ హైదరాబాద్
  C. పంజాబ్ కింగ్స్
  D. చెన్నై సూపర్ కింగ్స్

  Answer: C, A, B, D

  పై ప్రశ్నకు నిజామాబాద్‌కు చెందిన చుండ్రు అనురాధ చౌదరీ చాలా వేగంగా సమాధానాలను లాక్ చేశారు. దాంతో ఆమె హాట్ సీట్‌పైకి వచ్చారు. అనురాధ ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ఆమె ఎంతగా అభిమానిస్తారంటే.. చేతిపై ఎన్టీఆర్ అని పచ్చ బొట్టు వేయించుకొన్నారు. ఆమె అభిమానానికి ఎన్టీఆర్ నోట మాట రాలేదు. అలా అభిమానితో ఆట ప్రారంభించారు. మీరంటే నాకు చాలా ఆరాధనభావం ఉంది. మిమ్మల్ని కలువడానికే వచ్చాను అంటూ అనురాధ చెప్పారు.

  1000 రూపాయల కోసం ప్రశ్న

  1000 రూపాయల కోసం ప్రశ్న

  1. లీప్ సంవత్సరంలోని ఏ నెలలో ఒక రోజు అదనంగా ఉంటుంది?
  a) ఫిబ్రవరి
  b) జనవరి
  c) డిసెంబర్
  d) జూలై

  Answer: ఫిబ్రవరి

  2000 రూపాయల కోసం ప్రశ్న

  2000 రూపాయల కోసం ప్రశ్న

  2. వీటిలో ప్రశ్న వేయడం అనే అర్ధం కలిగిన మరియు ఒక కొలత ప్రమాణమూ అయిన పదం ఏది?
  a) ఎగురు
  b) పిడుగు
  c) జరుగు
  d) అడుగు

  Answer: అడుగు

  3000 రూపాయల కోసం ప్రశ్న

  3000 రూపాయల కోసం ప్రశ్న

  3. హిందు పురాణాలలో బ్రహ్మకు ఎన్ని ముఖాలు ఉంటాయి?
  a) నాలుగు
  b) ఐదు
  c) ఆరు
  d) ఏడు

  Answer: నాలుగు

  5000 రూపాయల కోసం ప్రశ్న

  5000 రూపాయల కోసం ప్రశ్న

  4. ఈ పాటలోని నటుడు ఎవరు? (అడవిరాముడు చిత్రంలోని కృషి ఉంటే మనుషులు రుషులు అవుతారు అనే పాటను ప్లే చేశారు)

  a) ఎన్ టీ రామారావు
  b) అక్కినేని నాగేశ్వర రావు
  c) ఎస్ వీ రంగారావు
  d) జగ్గయ్య

  Answer: ఎన్ టీ రామారావు

  10000 రూపాయల కోసం ప్రశ్న

  10000 రూపాయల కోసం ప్రశ్న

  5. వీటిలో అన్ని వేళలా అని సూచించేంది ఏది?

  a) 10/9
  b) 22/7
  c) 24/7
  d) 9/11

  Answer: 24/7

  20000 రూపాయల కోసం ప్రశ్న

  20000 రూపాయల కోసం ప్రశ్న

  6. ఈ చిత్రంలోని క్రీడాకారిణిని గుర్తించండి

  a) పద్మినీ రౌత్
  b) కోనేరు హంపి
  c) కిరణ్ మనీషా మొహంతి
  d) ఎస్ విజయలక్ష్మీ

  Answer: కోనేరు హంపి

  40000 రూపాయల కోసం ప్రశ్న

  40000 రూపాయల కోసం ప్రశ్న

  7. ప్రాచీన భారతదేశంలో చంద్రగుప్తుడు, అశోకుడు, బిందుసారుడు ఏ రాజవంశానికి చెందినవారు?

  a) మగధ
  b) మౌర్య
  c) గుప్త
  d) కుషాణ

  Answer: మౌర్య

  పై ప్రశ్నకు అనురాధ చౌదరీ 50:50 లైఫ్ లైన్ తీసుకొన్నారు. లైఫ్ లైన్ ప్రకారం రెండు తప్పుడు సమాధానం తీసి వేయడంతో మౌర్య, కుషాణ జవాబులు మిగిలిపోతే.. మౌర్య సమాధానాన్ని లాక్ చేశారు. దాంతో సమాధానం కరెక్ట్ కావడంతో తదుపరి ప్రశ్నకు వెళ్లారు.

  80000 రూపాయల కోసం ప్రశ్న

  80000 రూపాయల కోసం ప్రశ్న

  8. తెలంగాణకి ఉత్తరాగ్రంలో ఉన్న జిల్లా ఏది?

  a) ఆదిలాబాద్
  b) ఖమ్మం
  c) సంగారెడ్డి
  d) హైదరాబాద్

  Answer: ఆదిలాబాద్

  160000 రూపాయల కోసం ప్రశ్న

  160000 రూపాయల కోసం ప్రశ్న

  9. జూలై 2021లో కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి నుంచి రాజీనామా చేసినవారు ఎవరు?

  a) పియూష్ గోయల్
  b) అమిత్ షా
  c) హర్షవర్ధన్
  d) నిర్మలా సీతారామన్

  Answer: హర్షవర్ధన్

  సమాధానం సరిగా తెలియకపోవడంతో మరో లైఫ్‌లైన్‌ను అనురాధ ఉపయోగించుకొన్నారు. ఆడియెన్స్ పోల్ ఉపయోగించుకోవడంతో ఎక్కువ మంది హర్షవర్ధన్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేశారు. దాంతో హర్షవర్ధన్‌ను లాక్ చేయడంతో 160000 రూపాయలు గెలుచుకొన్నారు.

  320000 రూపాయల కోసం ప్రశ్న

  320000 రూపాయల కోసం ప్రశ్న

  10. ఇస్రో రాకెట్ ప్రయోగాలు చేసే సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఏ ద్వీపంలో ఉంది?

  a) కోనసీమ
  b) శ్రీహరి కోట
  c) హౌప్ ఐలాండ్
  d) భవానీ ద్వీపం

  Answer: శ్రీహరి కోట

  పై ప్రశ్నకు సమాధానం చెప్పిన అనురాధ రూ.320000 గెలుచుకొన్నారు. మరో ప్రశ్నకు వెళ్లే ముందు నాదో చిన్న కోరిక అంటూ మనసులో మాటను బయటపెట్టింది. మీతో డ్యాన్స్ చేయాలని కోరడంతో ఎన్టీఆర్ తెలివిగా తప్పించుకొన్నారు. 1250000 గెలిస్తే డ్యాన్స్ చేస్తాను అంటూ చెప్పడంతో ఆటలోకి వెళ్లిపోయారు.

  640000 రూపాయల కోసం ప్రశ్న

  640000 రూపాయల కోసం ప్రశ్న

  11. కేరళలోని ఏ దేవాలయంలో మహిళల ప్రవేశానికి 2018 సుప్రీంకోర్టు అనుమతిచ్చింది?

  a) గురువాయురు శ్రీకృష్ణ దేవాలయం
  b) శబరిమల అయ్యప్ప దేవాలయం
  c) పద్మనాభస్వామి దేవాలయం
  d) పళని మురుగన్ దేవాలయం

  Answer: శబరిమల అయ్యప్ప దేవాలయం

  1250000 రూపాయల కోసం ప్రశ్న

  1250000 రూపాయల కోసం ప్రశ్న

  12. షాజహాన్ ఢిల్లీకి మార్చకముందు మొఘల్ సామ్రాజ్యపు రాజధాని ఏది?
  a) జైపూర్
  b) కోల్‌కతా
  c) ఆగ్రా
  d) కాబూల్


  Answer: ఆగ్రా

  2500000 రూపాయల కోసం ప్రశ్న

  2500000 రూపాయల కోసం ప్రశ్న

  13. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా పనిచేసిన మొట్టమొదటి మాజీ ముఖ్యమంత్రి ఎవరు?
  a) మోహన్ లాల్ సుఖాడియా
  b) సీఎం త్రివేది
  c) పట్టోం దాసుపిల్లే
  d) భీంసేన్ సచార్

  Answer: భీంసేన్ సచార్

  అయితే ఈ ప్రశ్నకు అనురాధకు సమాధానం తెలియకపోవడంతో తన స్నేహితురాలు నిజమాబాద్‌లోని శ్రీలేఖకు వీడియో కాల్ చేశారు. అయితే శ్రీలేఖకు కూడా కన్ఫర్మ్‌గా సమాధానం చేయకపోవడంతో అనురాధ ఆట నుంచి వైదొలిగారు. దాంతో అనురాధ 1250000 గెలుచుకొన్నారు. అలా గురువారం ఎపిసోడ్ ముగిసింది.

  Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
  ఎన్టీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన అనురాధ చౌదరీ

  ఎన్టీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన అనురాధ చౌదరీ

  ఇక గేమ్ నుంచి క్విట్ అయిన అనురాధకు చెక్‌తోపాటు గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తూ.. జీవితంలో ఎవరికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సి వస్తుంది. అలా మీరు ఎవరికి థ్యాంక్స్ చెప్పుకొంటారని ఎన్టీఆర్ అడిగితే.. నా బలం ఏమిటో మీకు తెలుసు. డెఫినెట్‌గా మీకే థ్యాంక్స్ చెప్పుకొంటాను అంటూ అనడంతో ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. నాపై వెలకట్టలేని ప్రేమను పెంచుకొన్న మీలాంటి అభిమానులకు శిరసు వంచి నమస్కారం చేస్తున్నాను అని అనురాధకు వీడ్కోలు చెప్పారు.

  English summary
  NTR's EMK Show August 26th Episode: Chundru Anuradha Chowdary participated in this show. Here is the questions and Answers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X