Jr NTR రెమ్యునరేషన్.. ఎవరు మీలో కోటీశ్వరులకు ఎంతంటే.. నాగ్ కంటే ఎక్కువ.. చిరు కంటే తక్కువ!

బుల్లితెరపై బిగ్‌బాస్ తెలుగు హోస్ట్‌గా వ్యవహరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి టెలివిజన్ ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు సిద్దమయ్యారు. జెమినీ టెలివిజన్‌లో ప్రసారమయ్యే ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ గేమ్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షోను నిర్వహించేందుకు ఎన్టీఆర్ తీసుకొన్న రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ షోకు కోసం ఎన్టీఆర్ ఎంత తీసుకొంటున్నారంటే..

బికినీ బేబీగా అప్సర రాణి.. స్విమ్మింగ్ పూల్‌లో అలాంటి అవతారంతో

120 దేశాల్లో అత్యంత ప్రేక్షకాదరణతో

120 దేశాల్లో అత్యంత ప్రేక్షకాదరణతో

ఇంగ్లీష్‌లో విజయవంతమైన హూ వాంట్స్ టూ బీ ఏ మిలియనీర్ షో ఆధారంగా దాదాపు 120 దేశాల్లో పలు భాషల్లో ఈ గేమ్‌ అత్యంత ప్రాచుర్యం పొందింది. హిందీలో కౌన్ బనేగా కరోడ్‌పతి దాదాపు 12 సీజన్లు ముగించుకొని దిగ్విజయంగా సాగుతున్నది. అమితాబ్ రికార్డు స్థాయిలో హోస్ట్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు.

పేరు మార్చుకొన్న రియాల్టీ గేమ్ షో

పేరు మార్చుకొన్న రియాల్టీ గేమ్ షో

తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో నాగార్జున అక్కినేని హోస్టుగా ఈ గేమ్ షో ప్రారంభమైంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే ఆశించనంతగా టీఆర్పీ రేటింగ్ రాకపోవడంతో ఛానెల్‌తోపాటు హోస్ట్‌ను కూడా మార్చారు.

హోస్ట్‌గా నాగార్జున పారితోషికం

హోస్ట్‌గా నాగార్జున పారితోషికం

అయితే స్టార్ మా టెలివిజన్‌లో ప్రసారమైన ఈ గేమ్ షో కోసం నాగార్జునకు భారీగా రెమ్యునరేషన్ ముట్టజెప్పారు. ఈ గేమ్ షోను నిర్వహించినందుకు గానూ నాగార్జునకు దాదాపు రూ.4.5 కోట్లు ముట్టజెప్పారు. అప్పట్లో అదే అత్యధికంగా చెల్లించిన రెమ్యునరేషన్‌గా చెప్పుకొన్నారు.

చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతంటే

చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతంటే

అయితే ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించిన రియాలిటీ షో కోసం రికార్డు స్థాయి పారితోషికాన్ని చెల్లించారు. మీలో ఎవరు కోటీశ్వరుడు నాలుగో సీజన్‌కు ఏకంగా చిరంజీవికి రూ.9 కోట్లు చెల్లించినట్టు సమాచారం. ఇది తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో చెల్లించిన అత్యధిక పారితోషికంగా రికార్డుల్లోకి ఎక్కింది.

ఎన్టీఆర్‌కు రికార్డు రెమ్యునరేషన్

ఎన్టీఆర్‌కు రికార్డు రెమ్యునరేషన్

ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు ప్రొగ్రాంకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నందుకు జూనియర్ ఎన్టీఆర్‌కు భారీగానే రెమ్యునరేషన్ చెల్లించినట్టు సమాచారం. ఈ షో కోసం రామారావు రూ.7 కోట్లు రెమ్యునరేషన్ అందుకొంటున్నట్టు తెలిసింది. ఇది కూడా రికార్డు స్థాయి రెమ్యునరేషన్ అని చెప్పుకొంటున్నారు.

తొలి సీజన్‌లో 60 ఎపిసోడ్స్

తొలి సీజన్‌లో 60 ఎపిసోడ్స్

ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించే మీలో ఎవరు కోటీశ్వరులు రియాలిటీ షో జెమినీ టెలివిజన్‌లో తొలి సీజన్‌లో 60 ఎపిసోడ్స్ ఉంటాయని వెల్లడిస్తున్నారు. ఈ షో ఏప్రిల్‌ చివరి వారంలో గానీ, మే మొదటి వారంలో గానీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాటు జోరుగా సాగుతున్నట్టు సమాచారం.

త్వరలోనే పార్టిసిపెంట్స్‌కు ప్రకటన

త్వరలోనే పార్టిసిపెంట్స్‌కు ప్రకటన


ఇప్పటికే టీజర్లు, ట్రైలర్లు రిలీజై ఎవరు మీలో కోటీశ్వరుడు షోపై అంచనాలు పెంచాయి. త్వరలోనే ఈ యూనిట్ ప్రేక్షకులు ఎలా పాల్గొనాలనే విషయంపై ప్రకటన చేయనున్నారు. క్విజ్ ప్రశ్నలు త్వరలోనే టెలివిజన్‌ ద్వారా వెల్లడించే అవకాశం ఉంది. దీంతో ఔత్సాహిక పార్టిసిపెంట్స్ ఈ షోలో పాల్గొనేందుకు భారీగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X