Amigos ఈవెంట్ లో యాంకర్ సుమపై ఎన్టీఆర్ సీరియస్.. స్టేజ్ పైనే గుర్రుగా చూస్తూ..
కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఈ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ కాస్త కోపంగానే కనిపించాడు. ముఖ్యంగా యాంకర్ సుమ ఎన్టీఆర్ కు మైక్ ఇచ్చే ముందు ఎన్టీఆర్ కు కోపం తెప్పించేలా ఇంట్రడక్షన్ ఇచ్చింది. స్టేజ్ పైనే ఎన్టీఆర్ కోపంగా చూస్తు షాక్ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ముందుగా తారక్ ఎమోషనల్ కామెంట్స్
అమిగోస్ ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన విశేషాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఈ సినిమా దర్శకుడు రాజేంద్ర కోసం విజయం సాధించాలని అతని తల్లిదండ్రులు ఈ సినిమా షూటింగ్ లో ఉండగా కన్నుమూశారు అని ఎమోషనల్ గా మాట్లాడాడు. ఇక దర్శకుడి కోసమైనా ఈ సినిమా ఘనంగా విజయం సాధించాలి అని ఎన్టీఆర్ కోరుకున్నారు.
ఎన్టీఆర్ సీరియస్
అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నట్లు మాట్లాడిన విధానం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. అమిగోస్ గురించి అలాగే RRR ఆస్కార్ కు వెళ్లడం గురించి కూడా మాట్లాడిన అనంతరం ఎన్టీఆర్ చివరలో ఫ్యాన్స్ గురించి మాట్లాడారు. ఫ్యాన్స్ ఎక్కువ స్థాయిలో సినిమా అప్డేట్ గురించి అడుగుతూ ఒత్తిడి చేయడంతో ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు అనిపించింది.

మా బార్యల కంటే ముందు
ఫ్యాన్స్ సంతోషం కంటే మాకు ఏది ఎక్కువ కాదు కాని అప్డేట్ అడుగుతూ ఉంటే కొన్నిసార్లు నిర్మాతలు దర్శకుడు తీవ్రస్థాయిలో ఒత్తిడికి గురి అవుతున్నారని అన్నారు. ఇది నేను మా గురించి చెప్పడం లేదని దాదాపు ఇండస్ట్రీలో అందరూ ఎదుర్కొంటున్న ఇబ్బంది అని అన్నారు. మంచి కంటెంట్ ఇవ్వడానికి ఎప్పుడు ముందుంటాము సినిమా అప్డేట్ సరైన టైమ్ లో ఇస్తాము. మా బార్యల కంటే ముందు మీకే చెబుతాము.. అని ఎన్టీఆర్ అన్నారు.

సుమపై సీరియస్
అయితే ఎన్టీఆర్ ఈ తరహా స్పీచ్ ఇవ్వడం కంటే ముందు యాంకర్ సుమపై కాస్త సీరియస్ గా చూడడం జరిగింది. అంతే కాకుండా ఆమెకు కౌంటర్ కూడా ఇచ్చాడు. ఎన్టీఆర్ కు మాట్లాడేందుకు మైక్ ఇస్తున్న క్రమంలో సుమ ఎన్టీఆర్ 30 అప్డేట్ కూడా మనకు చెప్పాల్సి ఉందని సుమ ఇంట్రో ఇచ్చింది. అలా చెబుతు ఉండగానే ఎన్టీఆర్ ఊహించని రియాక్షన్ ఇచ్చాడు.

వాళ్ళు అడక్కపోయినా..
ఇక ఎన్టీఆర్ మైక్ అందుకోగానే చాలా సీరియస్ గా చూశాడు. ఇక పక్కనే కళ్యాణ్ రామ్ కూడా తమ్ముడికి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఇక ఎన్టీఆర్ 'వాళ్ళు అడక్కపోయినా.. మీరు చెప్పేసేలా ఉన్నారు' అని సీరియస్ గా సుమ మాటలకు రియాక్ట్ అయ్యాడు. ఇక అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











