జూనియర్ ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరుడు'.. షాకింగ్ రూమర్?
నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 హోస్ట్ గా ఏ స్థాయిలో ఆకట్టుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఆ తరువాత షెడ్యూల్స్ అడ్జెస్ట్ చేయడం కష్టమని హోస్ట్ బాధ్యత నుంచి దూరమైన తారక్ మళ్ళీ చాలా కాలం తరువాత జనాలకు ఉపయోగపడే షో ద్వారా ఆకట్టుకోవాలని రెడీ అయ్యాడు. ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు హోస్ట్ గా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ప్రశ్నలు మొదలయ్యాయి. ఆడిషన్స్ ప్లాన్స్ కూడా రెడీ అయ్యాయి. అయితే సడన్ గా ఒక రూమర్ ఆడియెన్స్ ను కన్ఫ్యూజన్ కు క్రియేట్ చేస్తోంది. ఈ షోకు బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంటే ఆలస్యంగా మొదలు కానున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ మధ్యలో కొన్ని సమస్యలు తలెత్తడంతో వాయిదా పడనున్నట్లు టాక్ వస్తోంది.

ఇది ఎంతవరకు నిజం అనే విషయంలో ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇక ప్రోమోలతో కొన్నాళ్ళు ప్రమోట్ చేయాలని అనుకుంటున్నారట. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివతో కూడా ఒక సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications