బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ విషయంలో క్లారిటీ.. చెప్పకనే చెప్పిన స్టార్ మా యాజమాన్యం.!

By Manoj

ఉత్తరాదిలో ప్రారంభమై.. దక్షిణాదిలోనూ సత్తా చాటిన కార్యక్రమాల్లో 'బిగ్ బాస్' రియాలిటీ షో ఒకటి. వివిధ రంగాలకు చెందిన సెలెబ్రిటీలను ఒక ఇంట్లో ఉంచడం.. అన్ని టాస్క్‌లను ముగించి ప్రేక్షకాదరణ పొందిన ఒకరిని విజేతగా ప్రకటించడం.. ఇదీ ఆ షో ఫార్మాట్. ఎన్నో అనుమానాల నడుమ ప్రారంభమైన ఈ షోకు రెండు రాష్ట్రాల నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీనికి కారణం షోను హోస్ట్ చేసిన హీరోలు కూడా అని చెప్పవచ్చు. తాజాగా నాలుగో సీజన్ హోస్ట్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. దీన్ని స్టార్ మా చెప్పకనే చెప్పింది. ఆ వివరాలు మీకోసం.!

ఎంతో మందికి కొత్త జీవితాన్ని ఇచ్చింది

ఎంతో మందికి కొత్త జీవితాన్ని ఇచ్చింది

చాలా కాలం పాటు బిజీ బిజీగా గడిపి ఇప్పుడు ఖాళీగా ఉంటున్న వారితో పాటు ప్రస్తుతం వరుస ఆఫర్లను దక్కించుకుంటున్న చాలా మందికి బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు తమ కెరీర్‌ను కొత్తగా ప్రారంభించి దూసుకుపోతున్నారు. ఇక, మొదటి టైటిల్‌ను శివ బాలాజీ, కౌశల్ రెండోది, మూడోది రాహుల్ సిప్లీగంజ్ దక్కించుకున్నారు.

ఇంటా బయట వివాదాలు.. బాగా ఫేమస్

ఇంటా బయట వివాదాలు.. బాగా ఫేమస్

బిగ్ బాస్ షోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడానికి వివాదాలు, గొడవలు తదితర అంశాలు కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరగడంతో పాటు అమ్మాయిల గ్లామర్ టచ్.. రొమాంటిక్ సంఘటనలు వంటి వాటి వల్ల ఈ షోకు పాపులారిటీ పెరిగింది. అదే సమయంలో బయట తలెత్తిన వివాదాలూ బాగా ప్లస్ అయ్యాయని చెప్పవచ్చు.

బిగ్ బాస్ విజయంలో వాళ్ల ముగ్గురి పాత్ర

బిగ్ బాస్ విజయంలో వాళ్ల ముగ్గురి పాత్ర

తెలుగులో బిగ్ బాస్ ఇప్పటికి మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ మూడింటికీ ముగ్గురు హీరోలు హోస్టులుగా వ్యవహరించారు. మొదటి సీజన్‌లో జూనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత నాని, మూడో దానికి అక్కినేని నాగార్జున తమ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. తప్పు చేసిన కంటెస్టెంట్లను మందలించడం.. బాగా చేస్తే ప్రోత్సహించడం వంటివి చేసి ప్రేక్షక హృదయాలను గెలుపొందారు.

ఊహాగానాలు మొదలు.. కొత్త పేర్లు తెరపైకి

ఊహాగానాలు మొదలు.. కొత్త పేర్లు తెరపైకి

మూడు సీజన్లకు ముగ్గురు హోస్టులు మారడంతో.. నాలుగో దానికి మరొకరు వచ్చే అవకాశం ఉందని చాలా రోజుల క్రితం నుంచే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగానే విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి, దగ్గుబాటి రానా, సూపర్ స్టార్ మహేశ్ బాబులలో ఒకరు ఫిక్స్ అయినట్లు వార్తలు వచ్చాయి.

ఎన్టీఆర్ రిఎంట్రీ.. నాగార్జుననే కంటిన్యూ

ఎన్టీఆర్ రిఎంట్రీ.. నాగార్జుననే కంటిన్యూ

కొత్త హోస్ట్ గురించి ప్రచారం జరుగుతోన్న సమయంలోనే... పాత ముగ్గురిలో ఒకరిని తీసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, వీరిలో నాని ఇకపై బిగ్ బాస్ షో చేయనని చెప్పడంతో జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగార్జునలో ఒకరు ఫైనల్ అవుతారని అన్నారు. అంతేకాదు, ఇందుకోసం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా అందుకుంటున్నారనే టాక్ వినిపించింది.

బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ విషయంలో క్లారిటీ

బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ విషయంలో క్లారిటీ

కొంత కాలంగా బిగ్ బాస్ 4 హోస్ట్ విషయంలో జరుగుతున్న చర్చకు మరో ప్రచారం తోడైంది. అయితే, ఈ సారి బయటకు వచ్చిన న్యూస్ దాదాపుగా నిజమేనన్న టాక్ వినిపిస్తోంది. దీని ప్రకారం.. త్వరలో ప్రారంభం కానున్న నాలుగో సీజన్‌ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నాడట. ఈ మధ్యనే అతడితో నిర్వహకులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయని సమాచారం.

Recommended Video

Krrish 4 To Be a Multi Starrer Targets RRR Movie
చెప్పకనే చెప్పిన స్టార్ మా యాజమాన్యం.!

చెప్పకనే చెప్పిన స్టార్ మా యాజమాన్యం.!

ఎన్టీఆర్‌ను గత రెండు సీజన్లలోనే తీసుకోవాలని స్టార్ మా నిర్వహకులు భావించారు. అయితే, అతడు బిజీగా ఉండడంతో వేరే వాళ్లను తీసుకున్నారు. తాజాగా ఆయనతో స్టార్ సంప్రదింపులు జరిపిందని, దీనికి తారక్ పచ్చజెండా ఊపేశాడని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఫ్యాన్స్ కోరడంతో పాటు ఈ కారణంగానే ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్‌ను రీటెలికాస్ట్ చేస్తున్నారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X