ఎన్టీఆర్ షోపై సర్‌ప్రైజింగ్ న్యూస్: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అప్పటి నుంచే.. లీకైన కీలక విషయాలు

తెలుగు సినీ ఇండస్ట్రీలోని బడా హీరోల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. అద్భుతమైన యాక్టింగ్, అదిరిపోయే డ్యాన్స్‌తో పాటు డైలాగ్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడతను. ఈ క్రమంలోనే హోస్టుగా బుల్లితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ కూడా తనదైన శైలి యాంకరింగ్‌తో అదరగొట్టేశాడు. సుదీర్ఘ విరామం తర్వాత తారక్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే షోను చేయబోతున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన కీలక విషయాలు బయటకు వచ్చాయి. అసలేం జరుగుతోంది? ఆ పూర్తి వివరాలేంటో చూద్దాం పదండి!

నాలుగు సీజన్లు చేసిన ఇద్దరు స్టార్స్

నాలుగు సీజన్లు చేసిన ఇద్దరు స్టార్స్

హిందీలో చాలా కాలంగా 'కౌన్ బనేగా కరోడ్‌పతీ' అనే పేరుతో క్విజ్ గేమ్ షో ప్రసారం అవుతోంది. దీన్నే తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే పేరుతో ప్రారంభించారు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఇది.. ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇందులో మొదటి మూడింటినీ అక్కినేని నాగార్జున.. నాలుగో దాన్ని మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేశారు.

ఇప్పుడు సరికొత్తగా వస్తోన్న గేమ్ షో

ఇప్పుడు సరికొత్తగా వస్తోన్న గేమ్ షో

తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో ఎంతో ఆదరణను దక్కించుకుంది. అయినప్పటికీ నాలుగు సీజన్లు పూర్తైన తర్వాత ఎందుకనే దీన్ని మళ్లీ ప్రసారం చేయలేదు. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత ఈ షోను తీసుకొస్తున్నారు. అయితే, ఈ సారి దీనికి 'ఎవరు మీలో కోటీశ్వరులు' అని టైటిల్ మార్చారు. అంతేకాదు, ఈ సారి ఈ షో జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న విషయం తెలిసిందే.

చాలా రోజుల క్రితమే ప్రకటించిన టీమ్

చాలా రోజుల క్రితమే ప్రకటించిన టీమ్

ప్రేక్షకులు మెచ్చిన షోగా ప్రసారం కాబోతున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ప్రోమోను ఆ మధ్య విడుదల చేశారు. అందులో నిర్వహకులు దీని ప్రస్థానం గురించి వివరించారు. అంతేకాదు, 'మీ జీవితాలని మార్చే గేమ్ షో.. మీ ఆశలని నిజం చేసే గేమ్ షో ''ఎవరు మీలో కోటీశ్వరులు'' త్వరలో మీ జెమినీ టీవీలో రాబోతుంది సిద్ధంగా ఉండండి' అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

ఎన్టీఆర్ రీఎంట్రీ... రామారావు అంటూ

ఎన్టీఆర్ రీఎంట్రీ... రామారావు అంటూ

గతంలో అక్కినేని నాగార్జున, చిరంజీవి నడిపించిన ఈ షోను.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నాడు. గతంలో బిగ్ బాస్ షోను సక్సెస్‌ఫుల్‌ చేసిన అతడు.. ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు'ను కూడా అదే రీతిలో నడిపించేందుక రెడీ అవుతున్నాడు. కొద్ది రోజుల క్రితం విడుదలైన తారక్ పరిచయ ప్రోమోలో తన పేరు రామారావు అని చెప్పి షోపై అంచనాలు పెంచేశాడు.

షో ఆగిపోయిందంటూ టాక్ రావడంతో

షో ఆగిపోయిందంటూ టాక్ రావడంతో

'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు సంబంధించిన ప్రోమో విడుదలై చాలా కాలమే అవుతోంది. అయిన్పటికీ కరోనా కారణంగా ఈ షో ప్రసారం మాత్రం వీలు పడలేదు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా కరోనా బారిన పడ్డాడు. దీంతో 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవన్న టాక్ వినిపించింది. దీంతో జెమినీ షో ఉంటుందని ఇటీవలే ప్రకటించింది.

‘ఎవరు మీలో కోటీశ్వరులు' వివరాలు

‘ఎవరు మీలో కోటీశ్వరులు' వివరాలు

తాజాగా ఈ షోకు సంబంధించిన కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. ఇప్పటికే ఈ షో కోసం నిర్వహకులు ఆడిషన్స్ నిర్వహించారు. ఇక, వచ్చే వారం నుంచి షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నారట. తాజా సమాచారం ప్రకారం.. ఈ షెడ్యూల్‌కు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాబోతున్నాడట. ఇందుకోసం ఇప్పటికే షో నిర్వహకులకు డేట్స్ కూడా కేటాయించాడని తెలిసింది.

షో ప్రసారం మాత్రం అప్పటి నుంచేనట

షో ప్రసారం మాత్రం అప్పటి నుంచేనట

వచ్చే వారం నుంచి షో షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ.. ప్రసారం మాత్రం చాలా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ముందుగా ఎన్టీఆర్‌పై కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేసిన తర్వాత ఎడిటింగ్ వర్క్ ప్రారంభిస్తారట. ఆ తర్వాత వీటిని ప్రసారం చేసి.. మళ్లీ తారక్‌తో షూటింగ్ చేస్తారట. మొత్తంగా ఇది ఆగస్టు నుంచి మొదలయ్యే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X