NTR Vs Tamannaah: ఎవరు మీలో కోటీశ్వరులు, మాస్టర్ చెఫ్ నువ్వా? నేనా?.. జబర్దస్త్‌కు షాక్

తెలుగు బుల్లితెరపై రియాలిటీ, స్పెషల్ షోల మధ్య భారీగా పోటీ పెరిగింది. ఇప్పటి వరకు యాంకర్లకే పరిమితమైన ఈ షోలు స్టార్ హీరో, హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. తెలుగు టెలివిజన్ చరిత్రలో ఎన్టీఆర్, తమన్నా భాటియా లాంటి వాళ్లు అడుగుపెట్టడంతో పలు షోలకు భారీ పోటీ ఏర్పడింది. ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న షో మీలో ఎవరు కోటీశ్వరులు, అలాగే తమన్నా భాటియా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో మాస్టర్ చెఫ్ బుల్లితెరపై స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారాయి. ఈ ఏడాది 34వారంలో షో రేటింగులు ఎలా ఉన్నాయంటే..

జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షో రేటింగ్స్

జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షో రేటింగ్స్

ప్రముఖ ఛానెల్‌ ఈటీవీలో మల్లెమాల నిర్మాణంలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో రేటింగ్ కాస్త తగ్గినట్టు కనిపించింది. జబర్దస్త్ షో 34వ వారంలో అర్బన్‌లో 6.45, రూరల్‌లో 6.49 రేటింగ్‌ను నమోదు చేసింది. ఎక్స్‌ట్రా జబర్దస్త్‌‌ షో విషయానికి వస్తే.. రూరల్‌లో 6.67, అర్బన్‌లో 6.46 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది.

 స్టార్ మాలో సుమ, ఓంకార్ షోలకు

స్టార్ మాలో సుమ, ఓంకార్ షోలకు

ఇక స్టార్ మా తెలుగు టెలివిజన్‌లో ప్రసారమయ్యే స్టార్ట్ మ్యూజిక్‌కు సంబంధించి రూరల్‌లో 4.87 రేటింగ్, అర్బన్‌లో 3.75 రేటింగ్ సొంతం చేసుకొన్నది. అలాగే కామెడీ స్టార్ షో రూరల్‌లో 3.82, అర్బన్‌లో 3.07 రేటింగ్‌ను నమోదు చేసింది. అలాగే ఓంకార్ హోస్ట్‌గా నిర్వహించే సిక్త్‌సెన్స్ షోలో సీజన్ 4 విషయానికి రూరల్‌లో 5.44, అర్బన్‌లో 4.78 రేటింగ్‌ను నమోదు చేసింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టుగా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టుగా

ఇక స్టార్ మా నుంచి జెమినీ టెలివిజన్‌కు షిష్ట్ అయిన ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షో తొలివారం ఘనంగానే రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. కానీ ఊహించినంత మేరకు రేటింగ్ రాకపోవడంతో కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు తొలివారం 4.82 రేటింగ్ నమోదు కావడం గమనార్హం. రానున్న రోజుల్లో ఈ మరింత క్రేజ్‌ను సొంతం చేసుకొంటే జెమినీ రేటింగ్ మెరుగుపడే అవకాశం ఉంది.

Recommended Video

Jabardasth Rajamouli Funny Video | Badmash Gaallu Evaro
మాస్టర్ చెఫ్ షోకు రేటింగ్ ఎంతంటే..

మాస్టర్ చెఫ్ షోకు రేటింగ్ ఎంతంటే..

అలాగే జెమినీలోనే ప్రసారం అవుతున్న మరో స్టార్ ప్రోగ్రాం మాస్టర్ చెఫ్ షో ఓ మోస్తారు రేటింగ్‌తో ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తమన్నా భాటియా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న వంటల ప్రోగ్రాంకు 4.64 రేటింగ్ నమోదైంది. ఈ షోకు స్టార్ స్టేటస్‌ను తమన్నా క్రియేట్ చేయడం గమనార్హం.

జాతిరత్నాలు సినిమాకు రేటింగ్ ఇలా

జాతిరత్నాలు సినిమాకు రేటింగ్ ఇలా

ఇక గతవారం టెలివిజన్‌లో ప్రదర్శించిన సినిమాల రేటింగ్ వివరాల్లోకి వెళితే.. జెమినీలో ప్రసారమైన జాతి రత్నాలు సినిమాకు అత్యధికంగా రేటింగ్ నమోదైంది. బడా హీరోలకు ధీటుగా ఈ రేటింగ్ రావడం గమనార్హం. జాతిరత్నాలు సినిమాకు రూరల్‌లో 7.05 రేటింగ్ రాగా, అర్బన్‌లో 10.15 రేటింగ్ రావడం విశేషం. అలాగే నితిన్ భీష్మ చిత్రానికి రూరల్‌లో 3.11 రేటింగ్ రాగా, అర్బన్‌లో 4. 48 రేటింగ్ వచ్చింది.

 క్రాక్ కంటే రాజా ది ‘గ్రేట్'

క్రాక్ కంటే రాజా ది ‘గ్రేట్'

ఇక స్టార్ మాలో ప్రసారమైన రాజా ది గ్రేట్‌, క్రాక్ చిత్రానికి ఓ మోస్తారు రేటింగ్ లభించాయి. రాజా ది గ్రేట్ చిత్రం రూరల్‌లో 3.54 రేటింగ్, అర్బన్‌లో 3.46 రేటింగ్ నమోదు చేసింది. అలాగే క్రాక్ చిత్రానికి రూరల్‌లో 3. 10, అర్బన్‌లో 3.81 రేటింగ్ నమోదైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X