ట్విస్ట్ ఇచ్చిన పల్లవి ప్రశాంత్: బిగ్ బాస్ టీమ్‌కు పోలీసులు షాక్.. నాగార్జునకు కూడా దెబ్బ!

పల్లవి ప్రశాంత్.. పల్లవి ప్రశాంత్.. పల్లవి ప్రశాంత్ ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అవుతోన్న పేర్లలో ఇది ఒకటి. దీనికి కారణం బిగ్ బాస్ విజేతగా నిలిచిన అతడు.. ఆ తర్వాత ఓ కేసులో చిక్కుకుని జైలు పాలయ్యాడు. ఆ సమయంలో ఎన్నో ఊహించని పరిణామాలు జరిగాయి. ఈ క్రమంలోనే అతడు బయటకు వచ్చేశాడు. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకుంటోన్న సమయంలోనే ఇప్పుడు బిగ్ బాస్ టీమ్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. అంతేకాదు, నాగార్జునకు కూడా ఝలక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది? ఆ వివరాలను మీరే చూడండి!

కేసు నమోదు.. రిమాండ్‌పై:బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద హింస చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో ర్యాలీ చేసిన విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ నివాసానికి చేరుకుని అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం 14 రోజుల రిమాండ్‌పై అతడిని చంచల్‌గూడ జైలుకు పంపారు.

Jubilee Hills Police Sends Notice to Bigg Boss Team Over Pallavi Prashanth Case

ప్రశాంత్‌ తిరిగి వచ్చాడుగా:న్యూసెన్స్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్‌పై జైలుకు వెళ్లిన పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ కోరుతూ పలువురు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై జరిగిన విచారణలో జడ్జ్ అతడికి బెయిల్ మంజూరు చేశారు. ఈ మేరకు కొన్ని షరతులను కూడా విధించింది. దీంతో పల్లవి ప్రశాంత్ శనివారం సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు.

అప్పుడే లాయర్ ఫిర్యాదు:బిగ్ బాస్ ఏడో సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో మొదటి నుంచి వాళ్ల ఫ్యామిలీకి హైకోర్ట్ న్యాయవాది అరుణ్ అండగా నిలిచారు. ఈ క్రమంలోనే తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు (Telangana State Human Rights Commission) బిగ్ బాస్ నిర్వహకులపైనా, హోస్ట్ నాగార్జున పైనా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Jubilee Hills Police Sends Notice to Bigg Boss Team Over Pallavi Prashanth Case

రెండో కేసుపై పోరాడుతూ:హైకోర్ట్ న్యాయవాది అరుణ్ తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో 'బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. బిగ్ బాస్ ఫైనల్ రోజున అక్కడ జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు అయ్యాయి. మరి నిర్వహకులు కూడా దీనికి బాధ్యులే కదా. వాళ్లపైన కేసు నమోదు చేయలేదు. దీనిపై చర్యలు తీసుకోవాలి' అని ప్రస్తావిస్తూ పోరాడారు.

బిగ్ బాస్ టీమ్‌కు షాకిచ్చి:హైకోర్ట్ న్యాయవాది తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు ముందడుగు వేశారు. ఇందులో భాగంగానే సోమవారం బిగ్ బాస్ నిర్వహకులకు సదరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అందులో అసలు గొడవ ఎందుకు జరిగింది? ఇందుకోసం నిర్వహకులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే కొన్ని ప్రశ్నలు అందులో సంధించారు.

Jubilee Hills Police Sends Notice to Bigg Boss Team Over Pallavi Prashanth Case

నాగార్జునకు కూడా షాక్?:హైకోర్ట్ న్యాయవాది అరుణ్ తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో హోస్ట్ అక్కినేని నాగార్జునపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఆ తర్వాత కూడా ఇదే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు. దీంతో బిగ్ బాస్ టీమ్‌కు నోటీసులు ఇచ్చినట్లుగానే నాగార్జునకు కూడా పోలీసులు షాక్ ఇస్తారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

ప్రశాంతే ట్విస్ట్ ఇచ్చాడా:బిగ్ బాస్ న్యూసెన్స్ కేసులో అరెస్ట్ అవడంతో పాటు జైలుకు వెళ్లిన పల్లవి ప్రశాంత్.. బయటకు వచ్చిన తర్వాత లాయర్లతో సంప్రదింపులు జరిపాడాని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ టీమ్‌కు నోటీసులు ఇచ్చేలా చేశాడని కూడా అంటున్నారు. అయితే, దీనిపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఇలా ఎన్నో పుకార్లు పుట్టుకొస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X