For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాంకర్ రవిపై బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం: ‘ఎవరు నువ్వు.. గాడిద.. పబ్బులు పార్టీలు’ అంటూ పరువు తీసేలా!

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా హవాను చూపిస్తున్నారు. దీంతో ఎక్కువ అవకాశాలను అందుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ దాదాపు పదేళ్లుగా యాంకరింగ్ రంగంలో తనదైన మార్క్ చూపిస్తూ దూసుకెళ్తున్నాడు రవి. గ్లామరస్ బ్యూటీల నుంచి పోటీ ఉన్నా.. తనకంటూ ప్రత్యేకమైన శైలితో మెప్పిస్తూ ఛాన్స్‌లు దక్కించుకుంటున్నాడు. అయితే, తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా యాంకర్ రవిపై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'గాడిద' అంటూ పరువు తీసేశాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  మాస్టర్ హీరోయిన్ క్లీవేజ్ షో.. చీరకట్టులో సరికొత్త అందాలు

   అప్పుడే మొదలైన కెరీర్.. పోటీ తట్టుకుని

  అప్పుడే మొదలైన కెరీర్.. పోటీ తట్టుకుని

  ప్రముఖ మ్యూజిక్ ఛానెల్‌లో యాంకర్‌గా పని చేస్తూ ఫేమస్ అయ్యాడు రవి. ఆ తర్వాత ఎన్నో షోలలో అవకాశాలు దక్కించుకున్నాడు. ఇలా దాదాపు పదేళ్లుగా యాంకరింగ్ రంగంలో తన హవాను చూపిస్తున్నాడు. తద్వారా వరుసగా టీవీ షోలు, సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు ఇలా ఎన్నో ఆఫర్లతో బిజీ బిజీగా గడిపాడు. ఈ క్రమంలోనే లేడీ యాంకర్ల డామినేషన్‌ను తట్టుకుని నిలబడ్డాడు.

  ఆ షోతో రవికి కలిసొచ్చింది.. ఆమెతో రచ్చ

  ఆ షోతో రవికి కలిసొచ్చింది.. ఆమెతో రచ్చ

  సుదీర్ఘమైన కెరీర్‌లో రవి ఎన్నో షోలను హోస్ట్ చేశాడు. అందులో కొన్ని మాత్రమే అతడికి మంచి పేరును తెచ్చి పెట్టాయి. అలాంటి వాటిలో ‘పటాస్' ఒకటి. స్టాండప్ కామెడీ షోగా వచ్చిన ఇందులో శ్రీముఖి కూడా యాంకర్‌గా చేసింది. వీళ్లిద్దరూ కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే ఇది సక్సెస్‌ఫుల్‌గా నడిచింది. అయితే, వాళ్లిద్దరూ తప్పుకోవడంతో అర్థాంతరంగా ముగిసింది.

   ఎన్నో వివాదాలు.. అది రాద్దాంతం అవడం

  ఎన్నో వివాదాలు.. అది రాద్దాంతం అవడం

  కెరీర్ మొత్తంలో యాంకర్ రవి ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. అలాగే, తన షోలలో తరచూ ఏదో ఒక కామెంట్లు చేయడం వల్ల విమర్శల పాలయ్యాడు. ఈ క్రమంలోనే ఓ సినిమా ఫంక్షన్‌లో ఆడవాళ్లపై చేసిన కామెంట్స్ పెద్ద రాద్దాంతం అయ్యాయి. ఆ తర్వాత అతడు పలుమార్లు క్షమాపణలు కూడా చెప్పాడు. అయినప్పటికీ రవిపై మహిళా సంఘాలు చాలా కాలం గొడవలు చేశాయి.

  హీరోగా మారాడు... స్టేషన్‌ మెట్టు ఎక్కాడు

  హీరోగా మారాడు... స్టేషన్‌ మెట్టు ఎక్కాడు


  కొన్నేళ్ల క్రితం యాంకర్ రవి ‘ఇది మా ప్రేమకథ' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇది నిరాశనే మిగిల్చింది. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్ సందీప్ రూ. 41 లక్షలు ఇవ్వకుండా తనను మోసం చేశాడని ఆరోపిస్తూ రవి కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు పెట్టాడు. ఆ తర్వాత అతడు కూడా యాంకర్‌పై ఫిర్యాదు చేశాడు. అప్పట్లో పెద్ద రచ్చ అయిన ఈ వివాదం.. తర్వాత ముగిసింది.

  మరో కొత్త ప్రోగ్రాంతో వస్తున్న యాంకర్ రవి

  మరో కొత్త ప్రోగ్రాంతో వస్తున్న యాంకర్ రవి

  ప్రస్తుతం రవి ఎన్నో షోలు చేస్తున్నాడు. అందులో ‘డ్రామా జూనియర్స్ - ద నెక్ట్స్ సూపర్ స్టార్' ఒకటి. దీనికి ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి, సింగర్ సునీత, ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్‌లు జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. దీనికి మొదట ప్రదీప్ మాచిరాజు యాంకర్‌గా చేయగా.. మూడో ఎపిసోడ్‌కు మాత్రం రవి వచ్చాడు. ఇందులో పిల్లలతో పలు స్కిట్లు చేయిస్తారు.

  యాంకర్ రవిపై జూ బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం

  ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే ‘డ్రామా జూనియర్స్ - ద నెక్ట్స్ సూపర్ స్టార్' ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఈ రెండింటికీ ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మూడో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. ఫన్ అండ్ ఎమోషన్స్‌తో సాగిన దీనిలో జూనియర్ బాలకృష్ణ.. యాంకర్ రవిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

  ‘ఎవరు నువ్వు.. గాడిద.. పబ్బులు పార్టీలు'

  ‘ఎవరు నువ్వు.. గాడిద.. పబ్బులు పార్టీలు'

  రెండో ఎపిసోడ్‌లో నందమూరి బాలకృష్ణ గెటప్‌తో అలరించాడు రాజా ప్రజ్వల్. తాజాగా విడుదలైన ప్రోమోలో అతడిని యాంకర్ రవి.. ‘బాలయ్య బాబు గారూ హౌ ఆర్ యూ' అన్నాడు. దీనికి ఆ బుడతడు.. ‘హూ ఆర్ యూ' అని కౌంటర్ ఇచ్చాడు. అప్పుడు రవి ‘నేను యాంకర్‌ను' అనగానే.. ‘ముందు అది చెప్పు గాడిద' అంటూ జూనియర్ బాలయ్య షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత పలు స్కిట్లలో రవిని పబ్బులు.. పార్టీలు.. అంటూ పిల్లలంతా ఆడుకున్నారు.

  English summary
  Anchor Ravi is a Telugu VJ and an anchor who was born and raised in Hyderabad. During his school days, he used to do anchoring. After completing school studies, he has joined the army to survey the country near Pune. After six months of training, he left the army and completed his degree.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X