Naga Panchami: పంచమికి ముద్దు పెట్టిన మోక్ష, ఫస్ట్ నైట్ కు ఏర్పాట్లు - ఆందోళనలో పంచమి
Naga Panchami October 20th Episode: నాగ పంచమి సీరియల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకూ సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. అదిరిపోయే ప్లాన్ లతో నంబూద్రీ, కరాళీలు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఏమవుతుందో తెలిసే దాకా ప్రేక్షకులు నిమ్మళంగా ఉండలేకపోతున్నారు. అయితే తాజాగా వచ్చిన ఎపిసోడ్ లో మోక్ష.. పంచమితో ఫస్ట్ నైట్ చేసుకోవాలని చూస్తాడు. మనసులోని ఆలోచనను ఆచరణలో పెడతాడు. ముఖ్యంగా బెడ్ పై మల్లెపూలు చల్లుతూ కనిపిస్తాడు. ఈ విషయం గుర్తించిన చిత్ర... అలాగా కాసేపు చూస్తూ ఉండిపోతుంది.
ఇక ఆ తర్వాత పాల గ్లాసుతో పంచమి వద్దకు వెళ్లి.. మోక్ష దగ్గరకు వెళ్లమని అంటుంది. కానీ పంచమి మాత్రం చప్పుడు చేయకుండా అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఎంతైనా నీవు మా మోక్ష భార్యవి, వెళ్లు మీరు సంతోషంగా ఉండాలనే మేము కోరుకుంటాం అంటూ చెప్పుకొస్తుంది. దీంతో ఈ రోజుటి ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ చూస్తే తప్ప వారికి శోభనం జరుగుతుందో లేదో తెలుస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా జ్వాల నంబూద్రీని కలవడం చూపిస్తారు.

అక్కడే నంబూద్రీ మంత్ర శక్తితో గరుడను చూపించి... ఇతను నీ అతిథి అని ఇంట్లో వాళ్లకు పరిచయం చేయు అని చెబుతాడు. అతడిని చూస్తేనే భయంగా ఉంది, నాకేమైనా సమస్య వస్తుందేమే అని జ్వాల అనగా అతని భాష, వేషం మొత్తం మారిపోతుందని భరోసా ఇస్తాడు. కానీ ఈ పని తానెందుకు చేయాలని ప్రశ్నించగా... ఇంట్లో పెత్తనం కావాలంటే ఇలాంటివి చేయక తప్పదని నంబూద్రీ అంటాడు. ఇక ఆ తర్వాత పంచమి, మోక్షలను చూపిస్తారు. మీరు బాగు అవుతారని నేను అనుకోలేదు మోక్ష బాబు అంటూ పంచమి కన్నీరు పెడుతుంది.

మోక్ష.. పంచమిని దగ్గగరకు తీసుకొని ఊరుకోబెడతాడు. ఈక్రమంలోనే గరుడ ఇంటికి వస్తాడు. పంచమి రూపంలో ఉన్న పామును కోపంగా చూస్తాడు. పంచమి తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు మోక్ష వచ్చి అలా ఎందుకు చూస్తున్నావని గొడవ పడతాడు. నీవెవరు అంటూ నిలదీస్తాడు. అప్పుడు చిత్ర వచ్చి తను మా బంధువు, ఇంటికి అతిథి అని చెప్పగా.. మోక్ష వార్నింగ్ ఇస్తాడు. మరోసారి అలా చూడకని హెచ్చరిస్తాడు. ఇక ఆ తర్వాత అంతా వెళ్లిపోగా.. పంచమి ముగ్గు వేస్తూ కనిపిస్తుంది. అప్పుడే వచ్చిన మోక్ష... పంచమి అందాన్ని పొగుడుతాడు.

ఓ ముద్దు కావాలని అడుగుతాడు. అంతా చూస్తారు బాగోదు అని పంచమి చెబుతున్నప్పటికీ.. వినకుండా మోక్ష పంచమి చెంపపై ముద్దు పెడతాడు. ఆమె సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత గరుడ పంచమిపైకి తన రెక్కల నీడును చూపిస్తాడు. పంచమి భయపడిపోతుంది. దీంతో గరుడ కిందకు వచ్చి నేను నీకోసమే వచ్చానంటూ చెబుతాడు. పంచమి ఏం చేయాలని అని ఆలోచిస్తూ ఉండగానే.. పంచమి వద్దకు చిత్ర వచ్చి పాలు తీసుకెళ్లమని చెబుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ చూస్తే వారికి శోభనం అవుతుందో లేదో తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











