Naga Panchami 16th February: కరాళీకి హ్యాండ్ ఇచ్చిన మహాంకాళి.. మోక్షను బలిచ్చినా నిరుపయోగమేనట!
Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో.. పంచమి, ఫణీంద్రలు మాట్లాడుకుంటూ కనిపించడం చూసిన జ్వాల తెగ గొడవ చేస్తుంది. పంచమియే పాము అంటూ గట్టి గట్టిగా అరుస్తుంది. భార్య గురించి తెలిసి కూడా మోక్ష కావాలనే ఆమెను కాపాడుకుంటూ వస్తున్నాడని వాదిస్తుంది. కానీ పంచమి మాత్రం అలాగే నోరు తెరవకుండా ఉంటుంది.
చిత్ర, జ్వాలలు అడుగుతున్న ప్రశ్నలకు కేవలం మోక్ష మాత్రమే సమాధానం చెబుతాడు. తన భార్యను ఇంకోసారి పాము అంటే ఊరుకునేది లేదని వివరిస్తాడు. ముఖ్యంగా జ్వాల మాత్రం.. పంచమి చేసే పాడు పనులు బయటకు తెలియకూడదనే ఉద్దేశంతోనే ఇలాంటి విషయాలు అన్నీ మోక్ష దాస్తున్నాడని గట్టిగా వాదిస్తుంది. పంచమి శీలం గురించి జ్వాల మాట్లాడగానే తీవ్ర కోపోద్రిక్తుడు అయిన మోక్ష.. ఆమె పీక పట్టుకుంటాడు. ఎవరు వదలమని చెప్పినా వదలడు.

ఈక్రమంలోనే జ్వాల భర్త వచ్చి మోక్షను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. చాలా సేపు పెనుగులాట తర్వాత జ్వాలను విడిపిస్తాడు ఆమె భర్త. అలా జ్వాల సేఫ్ అయినప్పటికీ.. మోక్ష కోపం మాత్రం తగ్గదు. అలాగే పంచమిని చూస్తుంటే ఆమే తన జన్మ రహస్యం గురించి బయట పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అనేది.
నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా కరాళీని చూపిస్తారు. ఆమె మహాంకాళి అమ్మవారిని ఆవాహనం చేసుకుంటుంది. ఈక్రమంలోనే నీ ప్రయత్నాలను ఆపేయాలని అమ్మవారు సూచిస్తుంది. ఫలితం కనిపించనప్పుడు ఊరుకోవాలని చెప్పగా.. సాధించేందుకు పుట్టినదాన్ని అంటూ కరాళీ చెబుతుంది. మోక్షను ఆహుతి ఇచ్చి కచ్చితంగా నా శక్తులు పొందుతానని అంటుంది. కానీ మహాంకాళి అమ్మవారు మాత్రం మోక్ష ఒంటరిగా ఉన్నప్పుడే నువ్వు ఏం చేయలేకపోయావు.. అలాంటిది పంచమి తోడుగా ఉండగా నువ్వేం చేస్తావని అంటుంది.
శక్తుల కోసం మరో ప్రయత్నం ప్రారంభించమని అంటుంది. నేను వెనక్కి తగ్గుతానా లేదా అని పరీక్షిస్తున్నావా తల్లి అని కరాళీ అనగా.. లేదు మోక్షను పంచమి కాపాడుకుంటూ ఉంటుంది.. ఆమె అస్సలే మోక్షను చావనివ్వదు అంటూ చెప్పుకొస్తుంది. పంచమిని తాను తన గుప్పిట్లో పెట్టుకున్నానని.. పంచమియే నేరుగా తన చేతిలో కఠిన బ్రహ్మచారి అయిన మోక్షను నా చేతిలో పెట్టబోతుందంటూ వివరిస్తుంది. ఆరోజే మోక్ష మీ బలిపీఠం ముందు ఉంటాడని కరాళీ వివరిస్తుంది.

ఇప్పటికీ చాలా ఆలస్యం అయింది... నేను ఇక మోక్షను బలి ఇచ్చినా నీకు శక్తులు తిరిగి ఇవ్వలేనని చెబుతుంది. నువ్వేం చేసిన నీకు శక్తులు తిరిగి ఇవ్వనని మహాంకాళి చెబుతుంది. నీకున్న చిన్న చిన్న శక్తులు తప్పు నీవు వేటినీ పొందలేవని పేర్కొంటుంది. భక్తురాలి శక్తి ఏంటో చూపిస్తానని.. ఎవరు సాయం చేసినా, చేయకపోయినా.. తాను అనుకున్నది చేసి తీరుతానని అంటుంది. మిమ్మల్ని మెప్పించి కచ్చితంగా శక్తులు తిరిగి పొందుతానని తెలుపుతుంది. ఇక నా ప్రత్యక్షాన్ని ఆశించకు అంటూ మహాకాంళి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.


Click it and Unblock the Notifications











