మరుగుజ్జు పిల్లకు.... సినిమాలపై మోజు!

19 సంవత్సరాల ఈ నాగ్ పూర్ గర్ల్.... బాలీవుడ్లో నటించాలని ఉందనే తన కోరిక బయట పెట్టింది. బిగ్ బాస్ షోలో ప్రవేశించక ముందు జ్యోతి ఆమ్గె ప్రపంచంలోనే అతి పొట్టి మహిళగా గిన్నిస్ బుక్ రికార్డుల కెక్కింది. ఆమె హైట్ కేవలం 62.8 సెంటీ(24.7 ఇంచులు) మాత్రమే. ఆమె పిటిఐతో మాట్లాడుతూ.... ఈ రియాల్టీ షోలో పాల్గొనడం ద్వారా బాలీవుడ్ అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను అని పేర్కొంది.
తనను బిగ్ బాస్ నిర్వాహకులు ఈ మెయిల్ ద్వారా సంప్రదించారని, వారు అడిగాక కాదనలేక పోయానని, బిగ్ బాస్ షో తాను రోజూ చూస్తుంటానని జ్యోతి పేర్కొంది. నేను ఎవరితో పోట్లాడకుండా విన్నర్ గా తిరిగి బయటకు వస్తానని ఆశా భావం వ్యక్తం చేసింది ప్రపంచంలోనే అతి మరుగుజ్జు యువతి.
బిగ్ బాస్ హౌస్‌లో ఆమె... టీవీ నటి ఆష్కా గొరాదియా, భోజ్ పురి యాక్టర్ దినేష్ యాదవ్ లతో కలిసి ఉంటోంది. జ్యోతి తో పాటు మరో కంటెస్టెంట్ సంతోష్ శుక్లా బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించారు.


Click it and Unblock the Notifications











