బ్లాక్ శారీలో పిచ్చెక్కిస్తోన్న జగతి మేడం.. అక్కడ టాటూ చూపిస్తూ జ్యోతిరాయ్ అరాచకం!
స్టార్ మాలో ప్రసారమైన గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు కన్నడ నటి జ్యోతిరాయ్ అలియాస్ జ్యోతి పూర్వజ్. తన అందం, అభినయంతో తెలుగువారిని అలరించారు. సీరియల్స్‌తో పాటు పలు సినిమాలు, సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే జ్యోతిరాయ్.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
కర్ణాటకకు చెందిన జ్యోతిరాయ్ .. తొలుత కన్నడ బుల్లితెరపై తన సత్తా చాటుకున్నారు. ఆ తర్వాత తెలుగులో పలు సీరియల్స్ చేయగా.. స్టార్ మాలో ప్రసారమైన గుప్పెడంత మనసు సీరియల్ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. ఇందులో జగతి మేడంగా జ్యోతి పూర్వాజ్ అద్భుతంగా నటించారు. కొడుకు కోసం తపనపడే తల్లిగా, విద్యార్ధిని దారిలో పెట్టే లెక్చరర్‌గా జీవించారు. ఈ సీరియల్‌లో తన కట్టుబొట్టు బాగా పాపులర్ అయ్యింది. తన వస్త్రధారణతోనే ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

చిన్న వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో జ్యోతిరాయ్ వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారుడు. అయితే మనస్పర్ధలు, ఇతర వ్యక్తిగత కారణాలతో ఈ జంట పరస్పర అంగీకారంతో విడిపోయింది. ఇదే సమయంలో దర్శకుడు సుక్కు పూర్వాజ్‌తో ప్రేమలో పడిన జ్యోతిరాయ్ ఆయనతో కొన్నాళ్లు డేటింగ్ చేసి కొద్దిరోజులకు రెండో పెళ్లి చేసుకున్నారు. శుక్ర, మాటరాని మౌనమిది వంటి సినిమాలకు సుక్కు దర్శకత్వం వహించారు. సుక్కు పరిచయం తర్వాత జ్యోతిరాయ్ పూర్తిగా బుల్లితెరకు దూరమయ్యారు. వెబ్ సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఏ మాస్టర్ పీస్ మూవీ చిత్రీకరణ సమయంలో జ్యోతిరాయ్, సుక్కుల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి తర్వాత సుక్కు.. కొత్తగా థింక్ సినిమా బ్యానర్‌ను స్థాపించి పలు సినిమాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జ్యోతిరాయ్ లీడ్ రోల్‌గా సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ కథాంశంతో కిల్లర్ అనే సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే ప్రొడక్షన్ పనులు, సీజీ వర్క్ కారణంగా కిల్లర్ మూవీ ఇంకా విడుదల కాలేదు.
మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్‌పై సుక్కు పూర్వాజ్, ప్రణయ్ కామత్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తోన్న రెండో చిత్రం కిల్లర్. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు కీలకపాత్ర పోషిస్తున్నారు సుక్కు పూర్వాజ్. మొన్నామధ్య ఈ సినిమా ఎడిటింగ్ రూమ్‌ని హిట్ మెషిన్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విజిట్ చేసి సినిమా ఫుటేజ్ చూసి హర్షం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే జగతి మేడమ్ ఎప్పటికప్పుడు సినిమాలు, ఇతర విశేషాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా బ్లాక్ శారీలో ఆమె చేసిన ఫోటోషూట్ వైరల్ అవుతోంది. నాభి, నడము అందాలకు తోడు ఎద భాగంలో టాటూ చూపిస్తు ఫోటోలకు ఫోజులిచ్చారు జ్యోతి. ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి.


Click it and Unblock the Notifications