Jyoti Poorvaj: చీరలో జగతి మేడమ్ కనికట్టు... స్టన్నింగ్ లుక్‌లో అందాల ఆరబోత

స్టార్‌ మాలో ప్రసారమైన గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు కన్నడ నాటి జ్యోతిరాయ్. ఈ ధారావాహికలో జగతి మేడమ్‌గా ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. తన స్టూడెంట్‌కి అండగా నిలిచే లెక్చరర్‌గా, కొడుకుకి దగ్గరవ్వాలనే తల్లిగా జ్యోతిరాయ్ అలరించారు. ఆమెను జ్యోతిరాయ్ కంటే జగతి మేడమ్‌గా అభిమానులు గుర్తుపెట్టుకుంటారంటే ఆమె వేసిన ముద్ర అలాంటిది. తెలుగునాట లేడీస్‌తో పాటు కుర్రాళ్లు కూడా జ్యోతిరాయ్‌కి అభిమానులే.

కర్ణాటకకు చెందిన జ్యోతిరాయ్ అసలు పేరు జయశ్రీ రాయ్. కన్నడ ధారావాహికలతో బాగా పాపులర్ అయ్యారు. కన్నడంలో ఆమె చేసిన దియా, సప్లయర్ శంకర, జెర్సీ నెంబర్ 10 ధారావాహికలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జ్యోతి. ఈ దశలో తెలుగు బుల్లితెర నుంచి ఆమెకు ఆహ్వానం అందింది. కన్యాదానం సీరియల్ ద్వారా తెలుగువారిని పలకరించారు. ఆ తర్వాత గుప్పెడంత మనసు సీరియల్ ఆమె నట జీవితాన్ని మలుపు తిప్పడంతో పాటు స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది.

Jyoti Poorvaj stunning look with Blue saree Her Latest Photos Here

జ్యోతిరాయ్‌కి 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరిద్దరికీ ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే అనివార్య కారణాలతో ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. అనంతరంసినీ దర్శకుడు సుక్కూ పూర్వజ్‌తో ప్రేమలో పడిన ఆమె కొన్నాళ్లు ఆయనతో డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. సుక్కూతో పరిచయం తర్వాత బుల్లితెరను పూర్తిగా పక్కనపెట్టేసిన జ్యోతిరాయ్ ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు, సినిమాలలో బిజీ అవుతోంది.

సుక్కు దర్శకత్వంలో ఏ మాస్టర్ పీస్ సినిమాలో నటించారు జ్యోతి. ఆ తర్వాత ఈ దంపతులిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కిల్లర్. యాక్షన్, సైన్స్ ఫిక్సన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. కిల్లర్ ఫ్రాంచైజీ పేరిట పలు భాగాలుగా ఈ సినిమా విడుదల అవుతుందని సుక్కూ అప్పట్లోనే హింట్ ఇచ్చారు. తొలి భాగానికి కిల్లర్ పార్ట్ 1- డ్రీమ్ గర్ల్ అనే టైటిల్ కూడా పెట్టారు. ఈ సినిమాను మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్‌పై సుక్కూ పూర్వాజ్, ప్రజయ్ కామత్‌లు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ గతేడాది ఏప్రిల్ 30వ తేదీన విడుదలవ్వగా ... ఇప్పటి వరకు కిల్లర్ రిలీజ్ డేట్ ప్రకటించలేదు. సైన్స్ ఫిక్సన్, యాక్షన్ మూవీ కావడంతో మరికొంత సీజీ వర్క్, ఇతర పనులు ఉండటంతో కిల్లర్ రిలీజ్ లేట్ అవుతోంది.

ఇక గుప్పెడంత మనసులో చీరకట్టుతో ఎందరికో ఫ్యాషన్ ఐకాన్‌గా మారారు జ్యోతిరాయ్. ఆమె కట్టుబొట్టుకు మహిళా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే సీరియల్స్ వదిలేసిన తర్వాత జ్యోతిరాయ్ గ్లామర్ డోస్ పెంచారు. మోడ్రన్ డ్రెస్స్‌లలో అరాచకం సృష్టిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే జగతి మేడమ్ ఎప్పటికప్పుడు సినిమాలు, ఇతర విశేషాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా చీరకట్టులో ఆమె చేసిన ఫోటోషూట్ వైరల్ అవుతోంది. బ్లూ, లైట్ గ్రీన్ శారీలో పార్కింగ్ ఏరియాలో నడుస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు జ్యోతి.

Read more about: jyoti rai guppendantha manasau
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X