పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో.. ఉస్తాద్ భగత్ సింగ్‌కు జగతి మేడమ్ సపోర్టుగా..

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని నటి జ్యోతి పూర్వజ్(Jyoti Poorvaj).'గుప్పెడంత మనసు' సీరియల్‌లో జగతి పాత్రతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అపారమైన అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆ సీరియల్ లో హీరోకి తల్లిగా జగతి అనే పాత్రలో జ్యోతి నటించింది. ఈ సీరియల్ ద్వారా ఆమె స్టార్ గా మారిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి పాపులరిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని చాటుకుంది. వినూత్నంగా తన అభిమానాన్ని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

జగతి పాత్రతో వచ్చిన క్రేజ్
కన్నడకు చెందిన జ్యోతి పూర్వజ్ తెలుగు ప్రేక్షకులకు మొదట పెద్దగా తెలియకపోయినా, 'గుప్పెడంత మనసు' సీరియల్ ఆమెను స్టార్‌గా మార్చింది. ఆ సీరియల్‌లో హీరోకు తల్లిగా 'జగతి' పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె చూపించిన నటనకు తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆ పాత్రతో ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. అయితే కెరీర్‌లో కొత్త అవకాశాల కోసం జ్యోతి ఆ సీరియల్‌కు మధ్యలోనే గుడ్‌బై చెప్పి సినిమాలు, వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టింది. అలాగే పలు సినిమాలు నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు పలు సినిమాల్లో నటిస్తోంది.

Jyoti Poorvaj s Viral Photoshoot Shows Love for Pawan Kalyan s Ustaad Bhagat Singh

మీడియాలో హాట్ టాపిక్
జ్యోతి పూర్వజ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచూ ఫోటోషూట్‌లు చేస్తూ తన అభిమానులతో టచ్‌లో ఉంటారు. ఆమె చేసే స్టైలిష్ ఫోటోషూట్‌లు, గ్లామర్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు వివాదాలు వచ్చినా కూడా వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇటీవల జ్యోతి పూర్వజ్ చేసిన ఒక ఫోటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

పవన్ కళ్యాణ్ పై అభిమానంతో
'ఉస్తాద్ భగత్ సింగ్'.. పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా. ఈ సినిమాలో శ్రీలీల ప్రధాన హీరోయిన్‌గా నటిస్తుండగా, మరో కీలక పాత్రలో రాశి ఖన్నా కనిపించనుంది. ఈ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపుతోంది. ఓవర్సీస్‌లో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా టికెట్స్ హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి.ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై జ్యోతి పూర్వజ్ తన అభిమానాన్ని చాటుకుంటుంది. సినిమాకు ట్రిబ్యూట్‌గా ఆమె ప్రత్యేక కౌబాయ్ థీమ్ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోలను ఆమె తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ 'నిజాయితీతో, యథార్థంగా' అంటూ పవన్ కళ్యాణ్‌కు సెల్యూట్ తెలిపింది. ఈ ఫోటోషూట్‌లో ఆమె వైట్ షర్ట్, డెనిమ్ షార్ట్స్, కౌబాయ్ హ్యాట్, బూట్లతో స్టైలిష్ లుక్‌లో కనిపించింది. గుర్రం పక్కన నిలబడి ఇచ్చిన పోజులు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఫోటోలపై 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా టైటిల్, పవన్ కళ్యాణ్ పేరు కనిపించడంతో ఇవి సినిమాకు ప్రత్యేక ప్రమోషన్‌లా అనిపించాయి.

జ్యోతి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ పోస్టుపై భారీగా స్పందిస్తున్నారు. 'మన జగతి ఆంటీ కూడా పవన్ ఫ్యానా?', 'OG నుంచి ఉస్తాద్ వరకు మీ సపోర్ట్ అదిరిపోయింది', 'మీ స్టైల్ సూపర్' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరూ 'జగతి మేడమ్' కూడా పవన్ అభిమానుల జాబితాలో చేరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X