చీరకట్టులో జగతి మేడమ్ కనికట్టు.. జ్యోతి పూర్వజ్ లేటేస్ట్ పోస్ట్ ట్రెండింగ్

టెలివిజన్ రంగంలో జ్యోతి రాయ్ అలియాస్ జ్యోతి పూర్వజ్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. చిన్న వయసులోనే భారమైన అమ్మ, అత్త పాత్రలతో లక్షలాది మంది బుల్లితెర ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకొన్నారు. అయితే గుప్పెడంత మనసులో జగతి మేడమ్ పాత్రలో కనిపించిన జ్యోతి రాయ్.. జ్యోతి పూర్వజ్‌గా మారి తన లుక్‌తోను, తన పెర్ఫార్మెన్స్‌తో వెండితెర మీద కోట్లాది మంది అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. జ్యోత పూర్వజ్ మేకోవర్, లుక్స్, ఆమె ఫ్యాషన్ ఇటీవల కాలంలో ట్రెండీగా మారింది. సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న పోస్టులు చాలా మంది మహిళలకు స్పూర్తిగా నిలుస్తున్నాయి. జ్యోతి పూర్వజ్ ఫ్యాషన్, ఆమె లేటేస్ట్ సినిమాల గురించిన వివరాల్లోకి వెళితే..

కన్నడ, తెలుగు సీరియల్స్‌తో జ్యోతి రాయ్‌గా పరిచయమైన ప్రస్తుతం జ్యోతి పూర్వజ్‌గా గుర్తింపు పొందుతున్నారు. తెలుగు డైరెక్టర్ సుకుమార్ పూర్వజ్‌ను వివాహం చేసుకోవడం ద్వారా జ్యోతి పూర్వజ్‌గా మారారు. సుక్కు పూర్వజ్ దర్శకత్వంలో రూపొందే రెండు సినిమాల్లో లీడ్ యాక్టర్‌గా, లేడీ ఓరియెంటెడ్ పాత్రలతో ఆకట్టుకోబోతున్నారు.

Jyoti Rai look in Pink Saree

జ్యోతి పూర్వజ్ ప్రస్తుతం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్ కిల్లర్ సినిమాలో ఆమె లీడ్ యాక్టర్‌గా కనిపించబోతున్నారు. అలాగే ఇటీవల రిలీజైన ప్రోమోలతో ఆమె తన గ్లామర్ ఏంటో, తన ప్రతిభ ఏంటో రుచి చూపించేందుకు సిద్దమవుతున్నారు. అలాగే మరో సైంటిఫిక్ థ్రిల్లర్ మాస్టర్ పీస్ ద్వారా మరో విభిన్నమైన పాత్రలో మెస్మరైజ్ చేయబోతున్నారు.

ఇక సీరియల్స్, సినిమాల విషయాన్ని పక్కన పెడితే.. ఇటీవల కాలంలో తన శరీరాకృతిని మార్చుకొని యువ హీరోయిన్లకు ధీటుగా అందచందాలను ప్రదర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో తన ఫోటోషూట్స్‌తో కేక పెట్టిస్తున్నారు. తాజాగా పింక్ కలర్ చీర, జాకెట్‌లో దిగిన ఫోటోలను ఆమె షేర్ చేశారు. సీతాకోక చిలుక ఎమోజీని, కిల్లర్ మార్క్‌ను షేర్ చేశారు. ఆమె పోస్టుకు మంచి స్పందన కనిపిస్తున్నది. ఆమె ఫోటోలను అభిమానులు షేర్ చేస్తూ తన అభిమానాన్ని చాటుకొంటున్నారు.

జ్యోతి రాయ్ కెరీర్ విషయానికి వస్తే.. జోగులా అనే సీరియల్‌తో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత శుభ మంగళ, కస్తూరి నివాస, జో జో లాలీ, గుప్పెడంత మనసు సీరయల్స్‌తో మెప్పించారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. సూపర్ రంగా, వర్ణ పటలం, జెర్సీ నంబర్ 10, మంచి రోడ్డు, ఒక కళాఖండం, కిల్లర్ సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో మరో నాలుగు సినిమాల్లో నటించడానికి రెడీ అవుతున్నారు.

Read more about: jyoti rai guppedantha manasu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X