జగతి మేడం కిల్లర్ గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్ .. కిల్లింగ్ లుక్స్‌తో జ్యోతిరాయ్ అరాచకం!
స్టార్ మాలో ప్రసారమైన గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా కుటుంబ ప్రేక్షకులను కట్టి పడేశారు కన్నడ నటి జ్యోతిరాయ్. భర్తకు, కొడుకుకి దూరమయ్యే మహిళగా.. తన స్టూడెంట్‌కు మెంటార్‌గా జగతి మేడం పాత్రలో జ్యోతిరాయ్ అద్భుతంగా నటించారు. జగతి మేడం అంటే గుప్పెడంత మనసు.. గుప్పెడంత మనసు అంటే జగతి మేడం అన్నంతగా తన ముద్ర వేశారు. ఈ సీరియల్ సూపర్ హిట్ కావడంతో రిషి, వసులతో పాటు కీలకపాత్ర పోషించింది జగతి మేడం.
సీరియల్స్‌కు గ్యాప్ ఇచ్చిన ఈ బుల్లితెర బ్యూటీ వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకెళ్తున్నారు. సీరియల్స్‌లో పద్ధతిగా కనిపిస్తూ హోమ్లీ బ్యూటీ అనిపించుకున్న జ్యోతిరాయ్ సినిమాలలో మాత్రం సెగలు రేపుతోంది. మోడ్రన్ డ్రెస్‌లలో క్లీవేజ్ షోతో కుర్రాళ్లను నిద్రపోనివ్వడం లేదు. తన భర్త సుక్కు పూర్వజ్ దర్శకత్వంలో జ్యోతిరాయ్ నటిస్తోన్న కిల్లర్ సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యింది. అతి త్వరలోనే కిల్లర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

కర్ణాటకలోని మడికెర ప్రాంతానికి చెందిన జ్యోతిరాయ్ అసలు పేరు జయశ్రీ రాయ్. కన్నడ బుల్లితెర ఇండస్ట్రీలో సీరియల్స్‌తో ఆమె పాపులర్ అయ్యింది. దియా, సప్లయర్ శంకర, జెర్సీ నెంబర్ 10 ధారావాహికలతో తిరుగులేని నటిగా నిలిచారు జ్యోతి. కన్యాదానం సీరియల్ ద్వారా తెలుగువారిని పలకరించిన జ్యోతిరాయ్‌కి గుప్పెడంత మనసు సీరియల్ బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జ్యోతిరాయ్‌కి 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే సినీ దర్శకుడు సుక్కూ పూర్వజ్‌తో ప్రేమలో పడిన ఆమె ఆయనను పెళ్లాడింది.
విభిన్న చిత్రాల దర్శకుడిగా సుక్కు పూర్వజ్‌కు మంచి పేరుంది. కేజీఎఫ్ ఫేమ్ , కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ సినిమాలను గతంలో తెరకెక్కించారు సుక్కూ. ఈ క్రమంలోనే తన భార్యను లీడ్ రోల్‌గా పెట్టి పూర్వాజ్ తెరకెక్కిస్తోన్న సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్. థింక్ సినిమా బ్యానర్ మీద ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థలతో కలిసి పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల అవుతుందని గతంలోనే చిత్ర యూనిట్ పేర్కొంది . దీనిలో భాగంగా ప్రస్తుతం కిల్లర్ పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ చిత్రీకరణ పూర్తి అయ్యిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఫిలింనగర్ టాక్ . అప్పుడెప్పుడో జగతి మేడం ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో హైప్ తీసుకొచ్చిన చిత్ర యూనిట్.. తాజాగా కిల్లర్ గ్లింప్స్ రిలీజ్ చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఏప్రిల్ 30వ తేదీన కిల్లర్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ జ్యోతిరాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. జీన్స్, ఎద భాగాలు కనిపించేలా టాప్ ధరించిన జ్యోతిరాయ్ సెగలు రేపుతున్నారు. దీనికి ఛాతీపై టాటూ తోడు కావడంతో కుర్రాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఈ పోస్ట్‌లో ఆమె మేల్కొంది.. ఆమె అన్నీ గమనిస్తోంది, ఇదే మీ భవిష్యత్తు .. ఏప్రిల్ 30న కిల్లర్ ఫస్ట్ గ్లింప్స్ రాబోతోందని జ్యోతి క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం జగతి మేడం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











