Jyoti Rai: జగతి మేడం యాక్షన్ అవతార్.. ఫైట్ సీక్వెన్స్‌లోనూ అందాలతో అరాచకం!

ఇటీవలి కాలంలో బుల్లితెర నటీనటులకు స్టార్స్‌కు మించి పాపులారిటీ లభిస్తోంది. ఎంతో మంది సినిమాల్లోనూ నటిస్తూ స్టార్స్‌కే పోటీ ఇస్తున్నారు. ఇక గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా కుటుంబ ప్రేక్షకులను కట్టి పడేశారు కన్నడ నటి జ్యోతిరాయ్. హీరోయిన్లను మించిన అందంతో మెరిసిపోతూ కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తున్నారు జగతి మేడం. సీరియల్స్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించిన జ్యోతి రాయ్ ఇప్పుడు సినిమాల్లోనూ దుమ్మురేపేందుకు సిద్ధమయ్యారు. ఆమె నటించిన కిల్లర్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

గుప్పెడంత మనసుతో స్టార్ డమ్
కర్ణాటకలోని మడికెర ప్రాంతానికి చెందిన జ్యోతిరాయ్ అసలు పేరు కేకే జయశ్రీ రాయ్. కన్నడ టెలివిజన్ ఇండస్ట్రీలో పలు సీరియల్స్‌లో నటించారు. దియా, సప్లయర్ శంకర, జెర్సీ నెంబర్ 10 వంటి సీరియల్స్‌లో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యారు జ్యోతి. కన్యాదానం సీరియల్ ద్వారా తెలుగువారిని పలకరించిన జ్యోతిరాయ్‌కి గుప్పెడంత మనసు సీరియల్‌తో చిన్నారుల నుంచి పెద్దల వరకు ఫ్యాన్స్‌గా మారిపోయారు. జ్యోతిరాయ్‌కి 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు కూడా ఉన్నాడని బుల్లితెర వర్గాల సమాచారం. సినీ దర్శకుడు సుక్కూ పూర్వజ్‌తో ప్రేమలో పడిన ఆమె ఆయనను పెళ్లాడింది.

Jyoti Rai s killr officially wrapped shoot Jagathi Madam s stunning look goes viral

సుక్కు పూర్వజ్‌తో ప్రేమ వివాహం
కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమలలో దర్శకుడిగా సుక్కూ పూర్వజ్‌కు మంచి గుర్తింపు ఉంది. శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ సినిమాలను గతంలో తెరకెక్కించారు. ఏ మాస్టర్ పీస్ సినిమా షూటింగ్ సమయంలో సుక్కూ పూర్వజ్‌కు, జ్యోతిరాయ్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. సుక్కుతో పెళ్లి తర్వాత తన పేరును జ్యోతిరాయ్ నుంచి జ్యోతి పూర్వజ్‌గా మార్చుకున్నారు జగతి మేడం. సుక్కుతో పెళ్లి తర్వాత టాలీవుడ్ తనకు మెట్టినిల్లు అయిపోయిందని, ఇకపై పూర్తిగా సినిమాలు చేస్తానని జ్యోతిరాయ్ తెలిపారు.

జ్యోతి లీడ్‌ రోల్‌లో కిల్లర్
ఈ క్రమంలోనే తన భార్యను లీడ్ రోల్‌గా పెట్టి పూర్వాజ్ తెరకెక్కిస్తోన్న సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్. థింక్ సినిమా బ్యానర్ మీద ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థలతో కలిసి పూర్వజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఏప్రిల్ 30వ తేదీన విడుదలైన కిల్లర్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కిల్లర్ షూటింగ్‌ పూర్తి
తాజాగా కిల్లర్ సినిమా షూటింగ్ పూర్తయినట్లు జ్యోతిరాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ప్రకటించారు. ప్రతి తుఫానులో బలంగా నిలిచిన చిత్ర యూనిట్‌కు, తన ఈ ప్రయాణాన్ని మెమొరబుల్‌గా మార్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కిల్లర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని జ్యోతి వెల్లడించారు. మొదటి షాట్ నుంచి చివరి కట్ వరకు ఇది ఒక మాయాజాలమని.. నటీనటులు, సాంకేతిక సిబ్బంది కిల్లర్ కోసం శ్రమించారని తెలిపారు. ప్రతి సన్నివేశం, ప్రతి స్టంట్, ప్రతి భావోద్వేగాన్ని పదిలంగా దాచుకున్నానని జ్యోతి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా బ్లాక్ డ్రెస్‌లో యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను జ్యోతి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఫైట్స్ చేసేటప్పుడు బహుశా ఇంత అందంగా ఎవరూ ఉండరని కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: jagathi madam jyoti rai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X