కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ తులసి.. జీ తెలుగులో సరికొత్త సీరియల్

ముద్ద మందారం, గుండమ్మ కథ, సూర్యకాంతం, త్రినయని, రాధమ్మ కూతురు, ప్రేమ ఎంత మధురం, నాగభైరవి లాంటి అత్యుత్తమ సీరియల్స్‌ను అందించిన జీ తెలుగు తాజాగా మరో సరికొత్త ధారావాహికతో వస్తున్నది.

ప్రముఖ దర్శకులు కే రాఘవేంద్రరావు దర్శక, పర్యవేక్షణలో కృష్ణ తులసి అనే సీరియల్ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సీరియల్ ఫిబ్రవరి 22వ తేదీన నుంచి సాయంత్రం 6.30 గంటలకు జీ తెలుగు, జీ తెలుగు హెచ్‌డీ ఛానెల్స్‌లో ప్రసారం కానున్నది.

K Raghavendra Rao to direct Krishna Tulasi for Zee Telugu

నిస్వార్థపూరిత యువతి శ్యామా ఓ గాయని. తన కుటుంబం కోసం తన గాత్రాన్ని ఎందుకు తాకట్టు పెట్టాల్సి వచ్చింది? శ్యామాకు జీవితంలో ఎదురైన కష్టాలు ఏమిటనే కథాంశంతో కృష్ణ తులసి ముందుకు సాగుతుంది.

శ్యామగా ఐశ్వర్య, అఖిల్ కృష్ణగా దిలీప్ శెట్టి, పవిత్రనాథ్, ప్రత్యూష, జేఎల్ శ్రీనివాస్, రాధికారెడ్డి తదితరులు నటిస్తున్నారు.

K Raghavendra Rao to direct Krishna Tulasi for Zee Telugu

ఈ సందర్భంగా డాక్టర్ కే రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. అద్భుతమైన, ఆలోచనాత్మకమైన కథలను జీ అందిస్తున్నది. వారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. కృష్ణ తులసి నా మనసును ఆకట్టుకొన్న కథ. వెలుగు నీడల ప్రయాణం మా శ్యామా జీవితం అని అన్నారు.

సామాజిక మార్పులకనుగుణంగా, ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా జీ తెలుగు సీరియల్స్‌ను అందిస్తున్నది. అలాంటి కోవలోనే వస్తున్న సీరియల్ కృష్ణ తులసి. కుటుంబ కోసం త్యాగం చేసిన ప్రతీ మహిళకు ఈ సీరియల్ అంకితం అని జీ తెలుగు, జీ సినిమాలు క్లస్టర్ హెడ్ అనురాధ గూడుర్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X